-
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వేముల నాగరాజు వైద్యానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం
-
ట్విట్టర్ ద్వారా మంత్రికి విన్నవించిన కుటుంబీకులు
-
వెంటనే స్పందించి రూ.7 లక్షలు సాయం అందించిన మంత్రి నారా లోకేష్
-
“ప్రజాదర్బార్” లో మంత్రి లోకేష్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు
ఉండవల్లి: విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువుకు చెందిన వేముల నాగరాజు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తలకు బలమైన గాయం కావడంతో కోమాలోకి వెళ్లారు. బీసీ సామాజికవర్గానికి చెందిన నాగరాజు ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. ఏం చేయాలో పాలుపోని కుటుంబ సభ్యులు.. వైద్యానికి సాయం అందించి తమ కుమారుడుకి ప్రాణాపాయం నుంచి తప్పించాలని ట్విట్టర్ ద్వారా మంత్రి నారా లోకేష్ కు విన్నవించారు. వెంటనే స్పందించిన నారా లోకేష్.. సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.7 లక్షల సాయం అందించి ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచారు. మంత్రి సాయంతో నాగరాజు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడని, కోమా నుంచి కోలుకుంటున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం నిర్వహించిన “ప్రజాదర్బార్” లో తమ కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి నారా లోకేష్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ధైర్యంగా ఉండాలని మంత్రి భరోసా ఇచ్చారు.