పెనుకొండ/గోరంట్ల : గోరంట్ల మండలం పాలసముద్రంలో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ మరియు నార్కోటిక్స్(NACIN) ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం సందర్శించారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మర్యాద పూర్వకంగా కలిశారు. సత్యసాయి జిల్లాతో పెనుకొండ నియోజక వర్గంలోని పలు సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి మంత్రి సవిత తీసుకెళ్లారు.
సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించినట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ పార్థసారథి కూడా పాల్గొన్నారు.