Suryaa.co.in

Andhra Pradesh

నకిలీ స్టాంపుల కుంభకోణంపై మంత్రి అనగాని ఆగ్రహం

అమరావతి: నకిలీ ఈ – స్టాంపుల కుంభకోణం వ్యవహారంపై రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సీరియస్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవహారంపై విచారణ జరపాలని రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ, డీఐజీలను ఆదేశించారు. ఈ వ్యవహారంపై శుక్రవారం అమరావతిలో ఉన్నతాధికారులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు.

ఈ తరహా వ్యవహారం రాష్ట్రంలో పునరావృతం కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఈ -స్టాంపుల జారీ ప్రక్రియ ఎలా జరుగుతుందో పరిశీలించాలని ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంలో సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE