జీవో 217పై దుష్ప్రచారం సరికాదు

– మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు

జీవో 217పై దుష్ప్రచారం సరికాదన్నారు మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు. దళారుల దందాపై అధ్యయనం చేసి ఈ తరహా నిర్ణయం తీసుకున్నామని.. ఈ జీవో మత్స్యకారుల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని చెప్పారు. 100 ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న చెరువులకు ఈ జీవో వర్తించదనే విషయాన్ని గుర్తించాలన్నారు.

జీవో 217పై దుష్ప్రచారం జరుగుతోందని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్‌ కన్నబాబు అన్నారు. మత్స్యకారుల అభ్యున్నతి కోసమే జీవో 217 జారీ చేశామని స్పష్టం చేశారు. 27,360 చెరువుల్లో మత్స్య సంపద పెంచుకునేందుకు అవకాశం ఉందన్నారు. వంద హెక్టార్ల కంటే ఎక్కువ ఉన్న 582 చెరువులకే ఈ జీవో వర్తిస్తుందని వెల్లడించారు. 337 చెరువుల్లో 255 మత్స్యకార సంఘాలు చేపలు పడుతున్నాయని వెల్లడించారు.

జీవో 217పై దుష్ప్రచారం జరుగుతోంది. మత్స్యకారుల అభ్యున్నతి కోసం జీవో 217 ఇచ్చాం. 27,360 చెరువుల్లో మత్స్య సంపద పెంచుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. వంద హెక్టార్ల కంటే ఎక్కువున్న 582 చెరువులకే జీవో వర్తిస్తుంది. 337 చెరువుల్లో 255 మత్స్యకార సంఘాలు చేపలు పడుతున్నాయి. నెల్లూరులోని 27 చెరువుల్లో పైలట్ ప్రాజెక్టు కింద జీవో అమలు చేస్తున్నాం. మిగతా 310 చెరువుల్లో ఇంకా జీవో అమలు చేయడం లేదు.

4 ఫిషింగ్ హార్బర్ల పనులు మొదలయ్యాయి. రాష్ట్రంలో 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మించాలని నిర్ణయించామన్ని కన్నబాబు చెప్పారు. రూ.3,177 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తామని.. ప్రాధాన్యతా క్రమంలో వీటిని పూర్తి చేస్తామని వివరించారు. ప్రస్తుతం 4 ఫిషింగ్ హార్బర్ల పనులు మొదలయ్యాయని.. మిగతా 5 ఫిషింగ్ హార్బర్లూ టెండర్ల దశలో ఉన్నాయని పేర్కొన్నారు. మత్స్య ఎగుమతులను దేశీయంగా మరింత పెంచేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. రీటైల్ అవుట్‌లెట్లను ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదని.. రోడ్డు పక్కన అమ్ముకునే వారికి సౌలభ్యం కలిగించేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు.

నెల్లూరులోని 27 చెరువుల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఈ జీవో అమలు చేస్తున్నామని కన్నబాబు పేర్కొన్నారు. నెల్లూరులో విజయవంతమైతే మిగతా చోట్లకు విస్తరించాలని నిర్ణయించామని చెప్పారు. మిగిలిన 310 చెరువుల్లో ఇంకా జీవో అమలు చేయడం లేదన్నారు. మత్స్యకార సంఘాలకు మరింత ఆదాయం వచ్చేందుకే జీవో అమలు చేస్తున్నామన్న ఆయన దళారుల దందాపై అధ్యయనం చేసి ఈ తరహా నిర్ణయం తీసుకున్నామని వివరించారు. 100 ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న చెరువులకు ఈ జీవో వర్తించదనే విషయాన్ని గుర్తించాలని సూచించారు.

Leave a Reply