Suryaa.co.in

Andhra Pradesh

ఉల్లాసంగా.. ఉత్సాహంగా!

– ఇందిగాంధీ స్టేడియంలో ఎమ్మెల్యేల ‘ఖేల్’ ఖతం
– ఉత్సాహ భరిత వాతావరణంలో ప్రజాప్రతినిధుల పోటీలు
అదే జోరు.. హుషారు
• రెండవ‌రోజూ ఉత్సాహ‌భ‌రితంగా సాగిన‌ ప్రజాప్రతినిధుల క్రీడ‌లు
* ర‌స‌వ‌త్త‌రంగా సాగిన క్రికెట్ ఫైన‌ల్ మ్యాచ్‌
* ‌ మంత్రి స‌త్య‌కుమార్ యాదవ్ టీమ్‌పై మంత్రి నాదెండ్ల టీమ్ విజ‌యం
• *ప‌రుగుపందెంలో ప్ర‌జాప్ర‌తినిధుల అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌
• *కోలాహ‌లంగా మారిన ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియం

విజయవాడ; ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో బుధవారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు ఆద్యంతం ఉల్లాసంగా, ఉత్సాహ భరిత వాతావరణంలో జరిగాయి. రాష్ట్ర‌ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న శాస‌న‌స‌భ్యుల‌, శాస‌న‌మండ‌లి స‌భ్యుల క్రీడా పోటీలు రెండ‌వ‌ రోజూ అదే జోరుతో హుషారుగా జ‌రిగాయి.

శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో నిర్వ‌హించిన అథ్లెటిక్స్‌, క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌, రన్నింగ్, కబడ్డీ, షాట్‌ పుట్, త్రోబాల్, టెన్నిస్, మ్యూజికల్ చైర్, షటిల్, టేబుల్ టెన్నిస్ క్రీడ‌ల్లో స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు, డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ రాజు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఛీఫ్ విప్‌లు ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొని త‌మదైన శైలిలో ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచారు. స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు, డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణంరాజు, మంత్రులు క్రీడాపోటీల్లో పాల్గొని సంద‌డి చేస్తూ ప‌ర్య‌వేక్షించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి వై. స‌త్య‌కుమార్ యాద‌వ్ లెవ‌న్ టీమ్‌ వెర్సెస్ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ లెవ‌న్ క్రికెట్ టీములుగా ఏర్ప‌డి ఫైనల్లో త‌ల‌ప‌డ్డాయి. నాదెండ్ల టీమ్‌లో మంత్రి రాంప్ర‌సాద్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బొమ్మాజి నిరంజ‌న్ విజ‌య్‌ కుమార్, బ‌ల్లి క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి, ఎ. ఉద‌య్‌ భాస్క‌ర్‌, బీటీ నాయుడు, కె.ఈ. శ్యామ్‌, వంశీకృష్ణ‌ యాదవ్‌, ఎమ్.వెంక‌ట‌రాజు, బొజ్జ‌ల సుధీర్ రెడ్డి, అనిమిల్లి రాధాకృష్ణ‌, ఏలూరి సాంబ‌శివ‌రావు, ఎన్‌. ఈశ్వ‌ర‌రావు, చిర్రి బాల‌రాజు, దాట్ల సుబ్బ‌రాజు, బి.జ‌య‌ నాగేశ్వ‌ర‌ రెడ్డి జ‌ట్టు స‌భ్యులు ఆడారు.

అలాగే ప్ర‌త్య‌ర్థి మంత్రి వై. స‌త్య‌కుమార్ యాద‌వ్ టీమ్‌లో ప‌ల్లా శ్రీ‌నివాస్, వంకా ర‌వీంద్ర‌నాథ్‌, కంచ‌ర్ల శ్రీ‌కాంత్‌, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు, పి.జి.వి.ఆర్ నాయుడు(గ‌ణ‌బాబు), ఆదిరెడ్డి శ్రీ‌నివాస్, సుంద‌ర‌పు విజ‌య్‌ కుమార్‌, బి. ద‌స్త‌గిరి, పి.వి. పార్థ‌సార‌థి, గోవింద‌రావు, గుర‌జాల జ‌గ‌న్‌మోహ‌న్‌రావు, ఎమ్ఎస్‌.రాజు, కాక‌ర్ల సురేష్‌లు జ‌ట్టు స‌భ్యులుగా పాల్గొన్నారు.

ముందుగా మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఎమ్మెల్యే బొజ్జ‌ల సుధీర్‌ రెడ్డి, కె.ఈ.శ్యామ్‌లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అలాగే వారికి ధీటుగా ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు బౌల‌ర్లు ప‌ల్లా శ్రీ‌నివాస్, మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌లు త‌మ‌దైన శైలిలో బౌలింగ్ చేస్తూ స‌వాల్ విసిరారు. అద్భుత‌మైన బ్యాటింగ్‌, అత్యుత్త‌మ క‌ట్ట‌డితో బౌలింగ్ చేస్తూ హోరాహోరీగా క్రికెట్ లో త‌ల‌పడ్డారు. చివరికి విజయం మంత్రి నాదెండ్ల మనోహర్ టీమ్ నే వరించింది.

100 మీట‌ర్స్ ప‌రుగు పందెంలో..

రెండవ‌ రోజు నిర్వ‌హించిన క్రీడా పోటీల్లో భాగంగా 100 మీట‌ర్ల ప‌రుగు పందెం పోటీలు ర‌స‌వ‌త్త‌రంగా సాగాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటాపోటీగా పాల్గొని ప‌రుగులు పెట్టారు. మొద‌టి రౌండులో ఎమ్మెల్సీ వంకా ర‌వీంద్ర‌నాథ్‌, ఎమ్మెల్యేలు రామాంజ‌నేయులు, బుచ్చ‌య్య‌చౌద‌రి, ర‌ఘురామ‌కృష్ణంరాజు, కె.శ్రీ‌నివాస్‌, గ‌ద్దె రామ్మోహ‌న‌రావు లు పాల్గొన్నారు. అలాగే రెండ‌వ రౌండులో సుంద‌ర‌పు విజ‌య్‌ కుమార్‌, బొజ్జ‌ల సుధీర్‌ రెడ్డి, ర‌ఘురామ‌కృష్ణ రాజు లు 100 మీటర్ల ప‌రుగు పందెంలో పాల్గొన్నారు. మూడ‌వ రౌండులో డి.ప్ర‌సాద్‌, సీహెచ్.బాల‌రాజు, జె.నాగేశ్వ‌ర‌రెడ్డి, విజ‌య‌చంద్ర‌, ఎమ్‌.గోవింద‌రావు, శ్రీ‌ధర్‌, కాక‌ర్ల సురేష్‌లో పాల్గొని హోరాహోరీగా ప‌రుగులు తీశారు. నాల్గ‌వ రౌండులో కే.ఈ.శ్యామ్‌, బి.నాయ‌క‌ర్‌, నాదెండ్ల మ‌నోహ‌ర్‌, స‌త్య‌కుమార్ యాద‌వ్‌, పార్థ‌సార‌థి, రాంగోపాల్‌రెడ్డి త‌దిత‌రులు ర‌న్నింగ్ పోటీల్లో పాల్గొన్నారు.

షాట్‌పుట్‌లో..

షాట్‌ పుట్ క్రీడ‌లో పెద్దఎత్తున ప్రజాప్ర‌తినిధులు క్రీడోత్సాహంతో పాల్గొన్నారు. 60 సంవ‌త్స‌రాల విభాగంలో ప్ర‌జాప్ర‌తినిధులు కామినేని శ్రీ‌నివాస్‌, గ‌ద్దె రామ్మెహ‌న్‌రావు, బుచ్చ‌య్య‌ చౌద‌రి, వంకా ర‌వీంద్ర‌నాథ్‌, ర‌ఘురామ‌కృష్ణ రాజు, వ‌ర‌ద‌రాజుల రెడ్డి, ఎమ్ఎమ్‌.కొండ‌య్య లు పాల్గొన్నారు. అలాగే రెండ‌వ రౌండులో ఎమ్‌. రాంప్ర‌సాద్‌ రెడ్డి, ఎస్‌.విజ‌య్‌కుమార్‌, శ్రీ‌రామ్ తాత‌య్య‌, వంశీకృష్ణ‌ యాద‌వ్‌, రాధాకృష్ణ‌, వ‌ర్ల కుమార్‌ రాజా, బోడే ప్ర‌సాద్‌, ఆదిరెడ్డి శ్రీ‌నివాస్‌, స‌త్య‌కుమార్ యాద‌వ్‌, విజ‌య్‌ కుమార్‌, వెనిగండ్ల రాము, కంచ‌ర్ల శ్రీ‌కాంత్‌, గొండు శంక‌ర్‌, ఏ. పార్థ‌సార‌థి, శ్రీ‌ధ‌ర్‌, శ్రీ‌రామ్‌ రెడ్డి త‌దిత‌రులు షాట్‌ పుట్‌ లో పాల్గొన్నారు.

మ‌హిళా విభాగంలో (షాట్‌ పుట్‌)..

మ‌హిళా ప్రజాప్రతినిధులు వంగ‌ల‌పూడి అనిత‌, గుమ్మిడి సంధ్యారాణి, ఎస్‌.స‌విత‌, తంగిరాల సౌమ్య‌, టి. జ‌గ‌దీశ్వ‌రి, ప‌ల్లె సింధూర‌ రెడ్డి, రెడ్డిప్ప‌గారి మాధ‌వీ రెడ్డి, విజ‌యేశ్వ‌రి, ప‌ద్మ‌శ్రీ లు పాల్గొని అత్యుత్త‌మ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచారు.

మ్యూజిక‌ల్‌ ఛైర్ క్రీడ‌లో..

మ్యూజిక‌ల్ ఛైర్ క్రీడ‌లో మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధులు సైతం ఉల్లాసంగా పాల్గొన్నారు. ఆద్యంతం ఉత్సాహ‌భ‌రితంగా పాల్గొని అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌న‌బ‌రిచారు. వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి, ఎస్‌.స‌విత‌, పి.సింధూర‌ రెడ్డి, తంగిరాల సౌమ్య‌, జి. చ‌రితారెడ్డి, మిరియాల శిరీషా, ప‌రిటాల సునీత పాల్గొని మ్యూజిక‌ల్ ఛైర్‌లో త‌మ ప్ర‌తిభ‌ను చాటారు.
పోటీల్లో గెలుపొందిన విజేత‌లు..

100 మీట‌ర్స్ ర‌న్నింగ్‌లో..

100 మీట‌ర్ల ర‌న్నింగ్ క్రీడ‌లో మొద‌టి రౌండులో రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీ‌ధర్‌, రెండ‌వ విభాగంలో ప‌త్తికొండ ఎమ్మెల్యే కె.ఈ.శ్యామ్ కుమార్‌, మూడ‌వ రౌండులో ఎమ్మెల్యే రామాంజ‌నేయులు విజ‌య‌ఢంకా మోగించి విజేత‌లుగా నిలిచారు.

షాట్‌పుట్‌ క్రీడ‌లో..

షాట్‌పుట్ మ‌హిళా విభాగంలో పుట్ట‌ప‌ర్తి ఎమ్మెల్యే పి.సింధూర‌రెడ్డి గెలుపొందారు. పురుషుల విభాగంలో మొద‌టి రౌండులో పార్వ‌తీపురం ఎమ్మెల్యే విజ‌య్‌కుమార్, రెండ‌వ రౌండులో ఎమ్మెల్యే కామినేని శ్రీ‌నివాస్ విజేత‌లుగా నిలిచారు.

మ్యూజిక‌ల్ ఛైర్ క్రీడ‌లో..

మ్యూజిక‌ల్ ఛైర్ క్రీడ‌లో ప్ర‌ధ‌మ స్థానంలో మిరియాల శిరీషా, ద్వితీయ‌స్థానంలో ఎస్‌.స‌విత‌, తృతీయ‌స్థానంలో ప‌ల్లె సింధూర‌రెడ్డి విజేత‌లుగా నిలిచారు.

క్రికెట్‌లో నాదెండ్ల టీమ్ విజ‌యం..

క్రికెట్ పోటీల్లో మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ టీమ్‌పై మంత్రి నాదెండ్ల టీమ్ విజ‌యం సాధించింది. మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ టీమ్‌లో మంత్రి రాంప్ర‌సాద్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బొమ్మాజి నిరంజ‌న్ విజ‌య్‌కుమార్, బ‌ల్లి క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి, ఎ.ఉద‌య్‌భాస్క‌ర్‌, బీటీ నాయుడు, కె.ఈ.శ్యామ్‌, వంశీకృష్ణ‌ యాదవ్‌, ఎమ్.వెంక‌ట‌రాజు గారు, బొజ్జ‌ల సుధీర్ రెడ్డి, అనిమిల్లి రాధాకృష్ణ‌, ఏలూరి సాంబ‌శివ‌రావు, ఎన్‌.ఈశ్వ‌ర‌రావు, చిర్రి బాల‌రాజు, దాట్ల సుబ్బ‌రాజు, బి.జ‌య‌నాగేశ్వ‌ర‌రెడ్డి జ‌ట్టు స‌భ్యులు విజ‌యం సాధించారు. 12 ఓవ‌ర్ల‌లో 97ప‌రుగులు చేసి విజ‌యం సాధించి సంబ‌రాలు చేసుకున్నారు. సంద‌ర్భంగా మంత్రి నాదెండ్ల‌ను జ‌ట్టు స‌భ్యులంద‌రూ త‌మ భుజాల‌పైకి ఎత్తి హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేశారు.

LEAVE A RESPONSE