Suryaa.co.in

Telangana

రేపు చెన్నైకి ఎమ్మెల్సీ కవిత

ఏబీపీ నెట్వర్క్ నిర్వహించే సదరన్ రైసింగ్ సమ్మిట్ లో పాల్గొననున్న కవిత

సార్వత్రిక ఎన్నికలు 2024: ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు ? అనే అంశంపై చర్చలో అభిప్రాయాలను వెల్లడించనున్న కవిత. చర్చ వేదికలో కవితతో పాటు పాల్గొననున్న కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం, తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నమలై

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం నాడు చెన్నైలో పర్యటించనున్నారు. ఏబీపీ నెట్వర్క్ సంస్థ నిర్వహించనున్న “ద సదరన్ రైసింగ్ సమ్మిట్”లో పాల్గొంటారు.

సమ్మిట్ లో “సార్వత్రిక ఎన్నికలు 2024: ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు ?” అనే అంశంపై గురువారం నాడు రాత్రి 7 గంటల 30 నిమిషాల నుంచి జరిగే చర్చ వేదికలో పాలుపంచుకుని కవిత తన అభిప్రాయాలను తెలియజేయనున్నారు. ఈ అంశంపై జరిగే చర్చలో కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నమలై పాల్గొంటారు. ఈ చర్చా వేదికకు ప్రముఖ రచయిత చేతన్ భగత్ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.

LEAVE A RESPONSE