-వరంగల్ సభలో ఒక్క రూపాయి ప్రకటించ లేదు
-జాతీయ రహదారులు తెలంగాణ రాష్ట్ర హక్కు
-బిజెపిలోనే 200 మంది వరకు రాజకీయాల్లో నాయకుల వారసులు
-ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన విమర్శలపై రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఘాటు స్పందన
వరంగల్ జిల్లా నిండు బహిరంగ సభలో మోడీ రాష్ట్రంలో బిజెపి ఓటమిని అంగీకరించారు.ఎన్నికలు ఉండే రాష్ట్రాల్లో పర్యటన సందర్భంగా భారీగా నిధులు ఇచ్చి , హామీలు కురిపించే నరేంద్ర మోడీ వరంగల్ సభలో ఒక్క రూపాయి ప్రకటించ లేదు. ఎలాంటి హామీ ఇవ్వలేదు. తెలంగాణలో బిజెపి గెలిచే అవకాశాలు లేవు కాబట్టే మోడీ నిధులు ఇవ్వకుండా, హామీలు లేకుండా ప్రసంగం ముగించారు. మోడీతో సహా ఢిల్లీ బిజెపి నేతలంతా ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట మాట్లాడతారు..
జాతీయ రహదారులు తెలంగాణ రాష్ట్ర హక్కు.. విభజన చట్టం, పార్లమెంట్ లో ఆమోదం మేరకే రాష్ట్రానికి జాతీయ రహదారులు. ఉద్యోగాల కామన్ రిక్రూట్మెంట్ బిల్లును గవర్నర్ చేత తొక్కిపెట్టి, ఇప్పుడు యూనివర్సిటీలో ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని మోడీ చెప్పడం విడ్డూరంగా ఉంది. బిజెపిలోనే 200 మంది వరకు నాయకుల వారసులు రాజకీయాల్లో ఉన్నారు. వారసత్వ రాజకీయాలపై మాట్లాడే అర్హత మోడీకి లేదు.
కొన్ని ట్రైలర్లు ట్రైలర్స్ కే పరిమితం అవుతాయి. సినిమాలు మాత్రం విడుదల కావు. బిజెపి ట్రైలర్ కూడా అలాంటిదే…తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీలకు అత్యధికంగా కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇచ్చి… ఇప్పుడు తెలంగాణాలో అభివృద్ధి లేదనడం మోడీ ద్వంద వైఖరికి నిదర్శనం.
వినోద్ కుమార్ కు ఘనంగా స్వాగతం
దక్షిణ కొరియా, సింగపూర్ దేశాలలో అధికారిక పర్యటన ముగించుకుని తిరిగి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ను ఘనంగా స్వాగతం పలుకుతున్న బీ.ఆర్.ఎస్. పార్టీ నాయకులు జక్కుల నాగరాజు యాదవ్, శ్రీరామ్ మధు, దూలం సంపత్ గౌడ్, సాజిద్ ఖాన్ , సాయి కృష్ణ, కార్యకర్తలు , నాయకులు పాల్గొన్నారు.