గిరిజనంలోకి మోదీ సర్కారు విజయాలు

Spread the love

– తెలంగాణ బీజేపీ గిరిజన శాఖ పిలుపు

హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధానకార్యదర్శి నేనవత్ రవి నాయక్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం మహ జన్ సంపర్క్ అభియాన్ పై సమీక్ష.

గడిచిన తొమ్మిది సంవత్సరాలలో గౌ. ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి పాలనను గుర్తుచేస్తూ గడప గడపకు తీసుకువెళ్ళేల ఈనెల 30 నుండి జూన్ 30 వరకు జరిగే మహా జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులతో చర్చించారు. అలాగే సంయుక్త మోర్చాల ఆధ్వర్యంలో జరిగే మహాజన్ అభియాన్ సమ్మేళనంను విజయవవం చెయ్యడానికి గిరిజనులు ప్రధాన భూమిక పోషించాలని మరియు అన్ని జిల నియోజకవర్గల వారిగా సమన్వయ కర్తలను నియమించాలని నిర్ణయించారు.

ఈ సమావేశానికి బిజెపి ముఖ్య అతిధిగా మాజీ మంత్రి వర్యులు రవీంద్ర నాయక్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గిరిజన మోర్చా ప్రభారీ కుమారి బంగారు శృతి , విశిష్ట అతిధిలుగా జాతీయ కార్యవర్గ సభ్యులు. నేనవత్ బిక్కునాథ్ నాయక్ పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహా జాన్ సంపర్క్ అభియాన్ విషయంపైన గిరిజన మోర్చా ప్రభారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమారి బంగారు శృతి నియోజకవర్గాల వారిగా అడిగి నియోజకవర్గ కన్వీనర్ల నుండి బూత్ మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టి సూచనలు చేసి, తీర్మానాన్ని బలపరచగా సభ్యులంతా కరతాల ధ్వనులతో ఏకగ్రీవంగా ఆమోదం చేశారు. అనంతరం గిరిజమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేనవత్ రవి నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి నీరుద్యోగ యువత పట్ల చిన్న చూపు అన్ని రంగాలలో విఫలమై ప్రజా వ్యతిరేక విధానాలు పట్ల సభ సమక్షంలో ప్రశ్నించారు.

అలాగే ఈ నెల 30 వ తేదీ నుండి వచ్చే నెల 30వ తేదీ వరకు మహా జన సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా రాష్ట్రంలో ని ప్రతి జిల్లాకు రాష్ట్ర శాఖ అదేశాలివ్వడం జరిగిందని మహా జన సంపర్క్ అభియాన్ కార్యక్రమం ఎంతో విశిష్టత కలిగిందని ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలోకి మరింతగా వెళ్లేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.

కావున ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా తరుపున జిల్లా నుండి , మండలాల నుండి బాధ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా నాయకులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply