తెలంగాణ అభివృద్ధి మీద కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు
కొడుకును సీఎం చేయాలని కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో పగటి కలలు కంటున్నారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన రైతు సదస్సులో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మార్పులు వచ్చాయి. వ్యవసాయ, పారిశ్రామిక, ఉత్పత్తి, విదేవీ విధానం, దేశంలో మౌలిక వసుతుల కల్పన లాంటి అనేక అంశాల్లో గత తొమ్మిదేండ్లుగా జరిగిన అభివృద్ధిని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షా 20 వేల కోట్ల రూపాయలు తెలంగాణలో రహదారుల కోసం వెచ్చించారు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో గతంలో కరెంట్ కొరత ఉండేది.. ఇప్పుడు ఏ రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవు. వ్యవసాయ, పారిశ్రామీకరణ రంగాలకు సరిపోను కరెంట్ ఈ దేశంలో ఉన్నది. విద్యుత్ కోతలు లేని దేశాన్ని మోదీ ఆవిష్కరించారు.
ఉత్తర భారత్ నుంచి దక్షిణ భారత్ వరకు పవర్ గ్రిడ్ ఏర్పాటు చేసింది కేంద్రం.. తెలంగాణలో కూడా ఎన్టీపీసీ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేసిన దాన్ని జాతికి అంకితం చేశారు. నీటిపై సోలార్ పవర్ ప్లాంట్ ను తెలంగాణలో మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
ఒకప్పుడు డబ్బులు ఇచ్చినా.. ఎరువుల కోసం రాత్రింబవళ్లు క్యూలైన్లలో ఉండాల్సి వచ్చేది. తెల్లవారు జామున 4 గంటలకే రైతులు వచ్చి చెప్పులు క్యూ పెట్టే వారు. ఈ రోజు పరిస్థితి మారింది. రైతులకు సరిపోను ఎరువులు కేంద్ర ప్రభుత్వం సమకూర్చింది. యూరియా ఎక్కువ వాడితే.. భూమి దెబ్బతింటుందని భావించి నీమ్కోటెడ్ యూరియాను కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది.
250 రూపాయలు ఒక బస్తాకు రైతు ఇస్తే.. కేంద్ర ప్రభుత్వం దాదాపు 2 వేల వరకు సబ్సిడీ భరిస్తున్నది. ఒక ఎకరానికి ఒక ఏడాదికి మోదీ ప్రభుత్వం 20 వేల రూపాయల సబ్సిడీ అందిస్తున్నది. ఎరువుల కొరత లేనిది నూతన భారతవానిని మోదీ ఆవిష్కరించారు.
మన రాష్ట్రంలో రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించి ప్రధాని మోదీ స్వయంగా ప్రారంభించారు. ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించేందుకు ప్రధాని మోదీ రామగుండం వస్తే.. మన ముఖ్యమంత్రి ఫామ్‌హౌజ్‌లో ఉన్నారు. మోదీ ఎన్టీపీసీ ప్రాజెక్టును ప్రారంభించేందుకు వస్తే.. కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఉన్నారు.
తన కొడుకును ఎలా ముఖ్యమంత్రి చేయాలన్నదే ఆయన తపన తప్ప.. తెలంగాణ అభివృద్ధి మీద కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు. వ్యవసాయం బాగుపడాలంటే.. సాగునీరు రావాలి. తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల మీద పోరాటం జరిగింది.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాణహిత చేవెళ్లను రీడిజైనింగ్ పేరుతో.. 30 వేల కోట్ల బడ్జెట్‌ను లక్షా 50 వేల కోట్లకు తీసుకువెళ్లారు. అంత చేస్తే.. ఆ ప్రాజెక్టుకు ఫీసిబిలిటి లేదు. కరెంట్ బిల్లులు కట్టలేని పరిస్థితి. వచ్చే నీళ్లకు, పండే పంటకు పొంతన లేదు. స్వయంగా ముఖ్యమంత్రే ఫామ్‌హౌజ్ ఇంజనీర్‌గా మారి ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు చేపట్టి తెలంగాణను ముంచారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 20 వేల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలతో ఉన్న ప్రాజెక్టును.. 57 వేల కోట్లకు పెంచారు. ఒక్క పంపు హౌజ్‌ను ప్రారంభించి ఎన్నికల ముందు పాలమూరుకు మొత్తం నీళ్లు ఇచ్చినట్లు మభ్యపెడుతున్నారు.
కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణ సుప్రీంకు వెళ్లింది. కేసు విత్ డ్రా చేసుకోమని కేంద్రం చెబితే.. ఏండ్ల తరబడి జాప్యం చేసింది కేసీఆర్ మాత్రమే. ఆయన కారణంగానే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడంలో ఆలస్యం జరిగింది. పాలమూరు, నల్లగొండ, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి జిల్లాలు సస్యశ్యామలం కావాలంటే నదుల అనుసంధానం కావాలి. ఏటా గోదావరి నీళ్లు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నది. ఆ నీటిని రైతులకు సాగునీరుగా ఇవ్వాలని దేశంలో చర్చ జరుగుతున్నది.
గోదావరి కృష్ణా లింక్ చేస్తే.. గ్రావిటీ ద్వారా తాగు, సాగునీరు అందించే అవకాశం ఉన్నది. కానీ సీఎంకేసీఆర్కు అది ఇష్టం లేదు. ఎందుకంటే ప్రాజెక్టులు కడితే కమీషన్లు వస్తాయి.
సాగునీటి ప్రాజెక్టులు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలుగా మారాయి. అందుకే కేసీఆర్‌కు నదుల అనుసంధానం ఇష్టం లేదు.మనం కోరుకున్న తెలంగాణకు పూర్తి విరుద్ధంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. ఓ తెలంగాణ సమాజమా? అర్థం చేసుకో.. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో వేల కోట్లతో ఓటర్లను నాయకులను కొని తన కొడుకును సీఎం చేయాలని కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో పగటి కలలు కంటున్నారు.
తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీద ఉన్నది.కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రమే అప్పు ఇచ్చింది. మోదీ ప్రభుత్వమే అప్పు ఇచ్చింది. విద్యుత్ ప్రాజెక్టులకు మోదీ ప్రభుత్వమే అప్పు ఇచ్చింది. 9 ఏండ్లలో తెలంగాణకు మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో అండగా నిలబడుతున్నది. తెలంగాణలో 11 ప్రాజెక్టులు డబ్బులు లేకుండా పూర్తి కాలేక ఆగిపోయాయి. ఈ 11 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి ఆదుకున్నది.
2014లో రైతుల నుంచి ధాన్యం సేకరణ కోసం యూపీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఖర్చుపెట్టింది రూ.3,400 కోట్లు.. కానీ మోదీ ప్రభుత్వం 26 వేల కోట్లు ఖర్చు పెట్టి రైతుల పంట ఉత్పత్తులను కొంటున్నది.కేంద్రం ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం నిందలు వేయడమే తప్ప.. రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు.
ప్రకృతి విపత్తులతో పంట పోతే.. రైతు తీవ్రంగా నష్టపోతాడు. పంటల బీమా పథకం దేశం మొత్తం అమలు అవుతుంటే… కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ వాటా ప్రీమియం కట్టకపోవడంతో.. తెలంగాణలో పంటల బీమా పథకం అమలు కావడం లేదు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అన్ని రకాలుగా అండగా ఉంటుంది. పంటల బీమా అమలు చేస్తుంది.
పంటకు కనీస మద్దతు ధర ధాన్యంకు 60 నుంచి 80 శాతం పెంచిన ఘనత మోదీ ప్రభుత్వానిదే. రైతు ఆదాయం రెట్టింపు చేసే క్రమంలో కేంద్రం అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నది.రైతులంతా మోదీ ప్రభుత్వాన్ని ఆదరించాలి. అండగా ఉండాలి. తెలంగాణలో రైతు రాజ్యాన్ని బీజేపీ నేతృత్వంలో తీసుకువస్తాం.
కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో వ్యవసాయం చేస్తూ.. ఎకరానికి కోటి రూపాయలు సంపాదిస్తున్నా అంటాడు. ఎలా వస్తున్నాయో చెప్పడు. తన కొడుకును ముఖ్యమంత్రిని చేయడం తప్ప.. తెలంగాణ ఏమై పోయినా కేసీఆర్‌కు ఏం ఫర్వాలేదన్నట్టు వ్యవహరిస్తున్నాడు.