మెగా ఈవెంట్ కు సర్వం సిద్దం : సుమన్ మీనా, నేహా జైన్
లబ్బీపేట ఎస్ఎస్ కన్వేన్షన్ వద్ద ఎంట్రీపాసులు లభ్యం
విబిన్న అంశాల సమాహారంలో నాలుగు గంటల నాన్ స్టాప్ షో
నగరంలో అతిపెద్ద దాండియా, గార్భా వేడుకకు సర్వం సిద్దం అయ్యిందని క్రియోటివ్ సోల్ వ్యవస్ధాపకులు సుమన్ మీనా. నేహా జైన్ తెలిపారు. ఆదివారం లబ్బీపేట ఎస్ఎస్ కన్వేన్షన్ వేదికగా జరిగే ఈ కార్యక్రమం విభిన్న అంశాల సమాహారంగా ఉండనుందన్నారు. శనివారం ఈవెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ బెజవాడ కనకదుర్గమ్మకు నృత్య నీరాజనం అర్పిస్తూ 2017 నుండి క్రియేటివ్ సోల్ నిర్వహిస్తున్న దాండియా పండుగ నగర వాసులకు వినూత్న అనుభూతిని మిగుల్చుతుందన్నారు.
మెగా ఈవెంట్ కు ముందస్తుగా ఎంట్రీపాస్లు తీసుకుని హాజరు కావచ్చని, ఆదివారం కూడా వేదిక వద్ద అందుబాటులో ఉంటాయని, 9700346517( సూరజ్), 9908544747 (సోను పటేల్), 9440089262 (టింకు), 9966411099 (గిరీష్ చౌహాన్), 9885210832( జైన్), 9959516016 (పండు) నెంబర్లలో కూడా సంప్రదించవచ్చన్నారు. దాదాపు నాలుగు గంటలకు పైగా సాగే విభిన్న కార్యక్రమాలలో డిజె అనంత్, ఆర్ జె షినయ్ తమ సంగీతంతో హెరెత్తిస్తారని సుమన్ మీనా, నేహా జైన్ తెలిపారు.
మరోవైపు సాంప్రదాయ వస్త్రాల ప్యాషన్ షో ఉంటుందని, దాండియాలో మంచి ప్రదర్శనలకు లక్ష రూపాయలకు పైబడి బహుమతులు అందిస్తున్నామన్నారు. దాండియా వర్క్ షాపులో శిక్షణ పొందిన వారే కాక, సాధారణ ప్రజలు సైతం రాత్రి 8.30 గంటల తరువాత తమ ప్రతిభను ప్రదర్శించి, బహుమతులు అందుకోవచ్చన్నారు.