Suryaa.co.in

Andhra Pradesh

వై .ఎస్ .ఆర్ హెల్త్ క్లినిక్ లలో రెండు లక్షలకుపైగా డెంగ్యు ఆర్డీటి కిట్స్ అందుబాటులో ఉంచాం

ప్రతి ప్రాథమిక , పట్టణ , సామాజిక ఆరోగ్య కేంద్రాలలో కూడా తగినన్ని డెంగ్యు ఆర్డీటి కిట్స్ అందుబాటులో ఉంచాం
ఏరియా , జిల్లా, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో ఎలిసా ద్వారా డెంగ్యు నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
నిబంధనలు పాటించని ల్యాబ్ లపై చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్వోలను ఆదేశించాం
ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ వేమిరెడ్డి రామిరెడ్డి

జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు తనిఖీలకు వెళ్ళినప్పుడు నిబంధనలను పాటిస్తున్న ల్యాబ్ లకు మాత్రమే అనుమతులు జారీచేయాలని, అనుమతులు లేని వాటిని గుర్తించి వాటిపై తగు చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలిచ్చామని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ వేమిరెడ్డి రామిరెడ్డి నేడొక ప్రకటనలో తెలిపారు. “ధరల పట్టిక, ల్యాబ్ టెక్నీషియన్ అర్హతలు, పెథాలజిస్టులను లేదా ఎమ్మెస్సీ చేసి 5 సంవత్సరాల ల్యాబ్ అనుభవం కలిగిన నిపుణుల అర్హతలు పరిశీలించటం జరుగుతుంది.

అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో మలేరియా, డెంగీ, టైఫాయిడ్ మరియు అన్ని రకాల జ్వరాలకు ఉచితంగా పరిక్షలు చేస్తున్నారు. డెంగీకి సంబందించిన నిర్దారణ పరీక్షలు సెంటినరీ సర్వైలెన్స్ ఆసుపత్రులు( ఎఎస్ హెచ్) ఆసుపత్రులలో మాత్రమే చేస్తారు. ప్రతి ప్రైవేటు ఆసుపత్రిలో డెంగీకి నిర్దారణ పరీక్షకు సంబంధించి, ఎలిసా పరీక్ష లేకపోయినట్లయితే, రాపిడ్ టెస్ట్ లో పాజిటివ్ డెంగ్యు కేసును గవర్నమెంట్ ఆసుపత్రికి రెఫరల్ చేయాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ అల్లోపతిక్ ప్రైవేటు మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం నెం.13 – 2002 ప్రకారం ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్ లకు అనుభవం కలిగిన నిపుణులు ఉంటే ఆయా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తగిన షరతులతో అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ అల్లోపతిక్ ప్రైవేటు మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం నెం.13 /2002 ను ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్ లు ఉల్లంఘించిన ఎడల తగిన చర్యలు తీసుకోనవలసిందిగా ఆదేశాలు జారీ చేశాం, అలాగే వ్యాధికి అవసరమైన పరీక్షలు మాత్రమే చేయవలసిందిగా ప్రతి ఆసుపత్రి అనుబంధ ల్యాబ్ లకు, ఇతర ల్యాబ్ లకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేయాలని ఆదేశించాం .

రాష్ట్రంలోని గ్రామస్థాయిలో డాక్టర్ వై .ఎస్ .ఆర్ హెల్త్ క్లినిక్ లలో మరియు ఆరోగ్య కార్యకర్తల వద్ద మలేరియా నిర్ధారణ కొరకు ఆర్డీటి కిట్స్ తగినన్ని ఉంచాం. అలాగే ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు మరియు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులలో కూడా మలేరియా నిర్దారణ పరీక్షలు ఉచితంగా చేస్తారు.

అలాగే డాక్టర్ వై .ఎస్ .ఆర్ హెల్త్ క్లినిక్ లలో సుమారుగా రెండు లక్షల పైబడి డెంగ్యు ఆర్డీటి కిట్స్ అందుబాటులో ఉంచాం. ఇంకా ప్రతి ప్రాధమిక , పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో కూడా తగినన్ని డెంగ్యు ఆర్డీటి కిట్స్ అందుబాటులో ఉంచాం. ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు మరియు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల నందు ఎలిసా ద్వారా డెంగ్యు నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. టైఫాయిడ్ పరీక్షలు కూడా ప్రతి ప్రాథమిక , పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో, ఏరియా , జిల్లా ఆసుపత్రులు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులలో అందుబాటులో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం నెం.13/ 2002 ప్రకారం నియమ నిబంధనలు పాటించటంలో విఫలమైన, అధిక ధరలతో పరీక్షలు చేసిన ప్రైవేట్ ల్యాబ్ లు , అలాగే ప్రైవేటు ఆసుపత్రి అనుబంధ ల్యాబ్ లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం” అని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ వేమిరెడ్డి రామిరెడ్డి తెలిపారు.

LEAVE A RESPONSE