అమ్మ కోరిక ఇప్పుడు నెరవేరింది..
ఆ తల్లి ఏ ఉద్దేశంతో పెట్టిందో గాని తన కొడుక్కి!?
ఆ పేరు అచ్చంగా 69 సంవత్సరాలు తర్వాత అదే జరిగింది.
ఔను..మన దేశానికి 17వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణన్ మాతృమూర్తి జానకి అమ్మాళ్ సంకల్పబలం నిజంగా అంత గొప్పది…
తమిళనాడులోని తిరుపూర్ గ్రామానికి చెందిన జానకి అమ్మాళ్ కు 69 సంవత్సరాల క్రితం ఒక అబ్బాయి పుట్టాడు.. జానకి అమ్మాళ్ దంపతులిద్దరూ ఉపాధ్యాయులే.
ఆ ఇద్దరు నాటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పై ఉండే గౌరవంతో
తమ గారాలపట్టికి రాధాకృష్ణన్ అని పేరు పెట్టుకున్నారు అప్పుడు జానకి అమ్మాళ్ భర్త జోక్ చేశారట కూడా..
ఏంటి నీ కొడుక్కి రాధాకృష్ణన్ అని పేరు పెడుతున్నావ్..
వాడు కూడా దేశానికి రాష్ట్రపతి అవ్వాలనా నీ కల అని..
నిజమే..ఆ తల్లి సంకల్పం 69 సంవత్సరాల తర్వాత అచ్చంగా నెరవేరింది..
ఆమె కొడుకు రాధాకృష్ణన్ ఇప్పుడు భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికై అమ్మ కలను
నెరవేర్చడమే గాక తన పేరుకు సార్ధకత చేకూర్చుకున్నారు..
చూసారా.. ఆ తల్లి సంకల్పం ఎంత గొప్పదో..
సురేష్..9848546286
7995666286