Suryaa.co.in

Andhra Pradesh National

బ్రహ్మోస్ ఏరోస్పేస్ ను సంద‌ర్శించిన ఎంపి కేశినేని శివ‌నాథ్

తిరువనంతపురం : స్టాండింగ్ క‌మిటీ ఆన్ డిఫెన్స్ స్ట‌డీ టూర్ లో భాగంగా విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) తిరువ‌నంత‌పురం లోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ ను గురువారం సంద‌ర్శించారు. అనంతరం స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ ఛైర్మ‌న్ రాధ మోహ‌న్ సింగ్ ఆధ్వ‌ర్యంలో క‌మిటీ స‌భ్యుల‌తో క‌లిసి ఏర్పాటు చేసిన స‌మావేశంలో పాల్గొన్నారు. రక్షణ రంగంలో అభివృద్ధి కోసం బ్రహ్మోస్ వంటి సంస్థలను మరింతగా ప్రోత్సహించడంతో పాటు కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడం దేశ భద్రతకు ఎంతో అవసరమ‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ తెలిపారు.

LEAVE A RESPONSE