Suryaa.co.in

Telangana

ఎంపీ వద్దిరాజు మాజీ మంత్రి పువ్వాడతో కలిసి పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు

ఖమ్మం: బీఆర్ఎస్ ప్రముఖులపై దాడికి పాల్పడిన అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవలసిందిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, బానోతు మదన్ లాల్, మాజీ జేడ్పీ మాజీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్ తదితరులు ఖమ్మం నగర పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కు ఫిర్యాదు చేశారు.

మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, గుంటకండ్ల జగదీష్ రెడ్డి,సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావులు మున్నేరు ముంపు బాధితులను పరామర్శిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు రాళ్లతో దాడికి దిగడంతో సంతోష్ రెడ్డి అనే బీఆర్ఎస్ నాయకుడు తీవ్రంగా గాయపడడాన్ని సీపీ సునీల్ దత్ కు పువ్వాడ అజయ్ కుమార్ వివరించారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ బీఆర్ఎస్ ప్రముఖులు సీపీకి వినతిపత్రం సమర్పించారు.

LEAVE A RESPONSE