ఆంధ్రప్రదేశ్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (ఏపీబీఏ) చైర్మన్ గా వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. దీనికి సంబంధించిన వివరాలను విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో తెలిపారు.
ఇటీవలే తాను బాస్కెట్ బాల్ సంఘం చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యానని విజయసాయి తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం రోజున, ఆంధ్రప్రదేశ్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ చైర్మన్ పదవీ బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. ఏపీలో బాస్కెట్ బాల్ క్రీడ సర్వతోముఖాభివృద్ధికి శక్తిమేర కృషి చేస్తానని అన్నారు.
బాస్కెట్‌బాల్‌ను భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడలలో ఒకటిగా మార్చడానికి మరియు గొప్ప ఆటగాళ్లను తయారు చేయడానికి శ్రమిస్తానని ఆయన తెలిపారు.ఈ మేరకు ఫొటోలను కూడా ట్వీట్ చేశారు.