Suryaa.co.in

Andhra Pradesh

సుజనాకు జై కొట్టిన ఎమ్మార్పీఎ

అణగారిన వర్గాలు ముఖ్యంగా దళితుల కోసం మాట్లాడుతున్న పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి)కి తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పేరుపొగు వెంకటేశ్వరరావు ప్రకటించారు భవానీ పురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వర్గీకరణకు మోదీ అంగీకరించారని, అందుకే ఏపీలో ఎన్డీయే కూటమికి ఎమ్మార్పీఎస్ పూర్తి మద్దతు తెలుపుతోందని, సుజనాకు తామందరూ మద్దతు ప్రకటిస్తున్నామని వెంకటేశ్వరరావు ప్రకటించారు. సుజనా ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మాల, మాదిగలకు నిధులు ఇవ్వకుండా జగన్ మోసం చేశారని, దళితులను బానిసలుగా చూశారని విమర్శించారు. ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్వాయి దాస్, సుబ్బారావు, నాగేశ్వరరావు, ప్రసాద్ తదితరులు కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE