Home » రైల్వే జోన్ ఆలస్యానికి జగన్ రెడ్డి కారణం

రైల్వే జోన్ ఆలస్యానికి జగన్ రెడ్డి కారణం

-విశాఖకు రైల్వే జోన్ రావడం, ఉత్తరాంధ్ర అభివృద్ధి అవ్వడం జగన్ రెడ్డి, బొత్సకు ఇష్టం లేదు
-రైల్వే జోన్ కు కేంద్రం నిధులు ఇచ్చినా భూమిని కేటాయించలేదు
-2020-21లో కేటాయించిన రూ. 106 కోట్ల నిధులు నిరుపయోగంగా మారి వెనక్కి వెళ్లాయి
-జగన్ రెడ్డి ప్రభుత్వపై విమర్శలు రావడంతో 2023 డిసెంబర్ తరువాత ముడసర్లోవ ముంపు ప్రాంతంలో భూమి కేటాయింపు – ముంపు ప్రాంతంలో భవనాలు కట్టడం సాధ్యం కాదన్న కేంద్ర మంత్రి
-రైల్వే జోన్ ఏర్పాటు చేయకుండా కేంద్రమే ఆలస్యం చేసిందంటూ మరో సారి ఉత్తరాంధ్ర ప్రజలను, రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న జగన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ
– బొత్స వ్యాఖ్యలపై కూటమి నాయకుల మీడియా సమావేశం వివరాలు

జగన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ అబద్దాలు, అసత్యాలాను ప్రచారం చేస్తున్నారని కూటమి నేతలు మండి పడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు.

బీజేపి అధికార ప్రతినిధి లంకా దినకర్ మాట్లాడుతూ..

రైల్వే జోన్ విశాఖకు రావాలనే చిత్తశుద్ధి జగన్ రెడ్డి, వైసీపీకి లేదు. కేవలం రాజకీయ లబ్ధికోసమే వాస్తవాలను పక్కదారి పట్టిస్తున్నారు. అందులో భాగంగానే అసత్యాలను అబద్దాలను ప్రచారం చేస్తున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఏపీ పర్యటనలో భాగంగా ఏపీలో జరుగుతున్న దుర్మార్గాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లు చెప్పారు.

దాన్ని జగన్ రెడ్డి, జే గ్యాంగ్ జీర్ణించుకోలేకపోతుంది. వాస్తవాలను అణచిపెట్టడంలో వైసీపీ నేతలు సిద్ధహస్తులు. అవినీతి కూపంలో ముగినిపోయి ప్రభుత్వ సొమ్ములు పోతే ఏం చేస్తామన్న అసమర్థ మంత్రి బొత్స… ఇలాంటి అసమర్థ మంత్రి.. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ను విమర్శించే స్థాయి లేదు.

విశాఖ రైల్వే జోన్ పై అబద్దాలను చిలక పలుకులుగా చెబుతున్నారు. రైల్వేజోన్ ఆలస్యంపై మేము ఇది వరకే పోరాడాం. ఇప్పుడు మంత్రి బొత్స అవాస్తవాలతో అవాకులు, చవాకులు పేలుతున్నారు. ఏపీలో రైళ్ల వ్యవస్థకి కేంద్రం పెద్ద ఎత్తున సహకారం అందించింది.

విశాఖలోని బీర్టీఎస్ రహదారి కోసం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుండి రైల్వేస్టేషన్ దగ్గరకు ఉన్న రైల్వే భూములు తీసుకుని ప్రత్యామ్నాయంగా ముడసర్లోవ రిజర్వాయర్ వద్ద 52. ఎకరాల 20 సెంట్లు భూమి(ముంపు భూమి) ఇచ్చి దాన్ని రైల్వే జోన్ కోసం ఇచ్చినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారు.

రోడ్ల విస్తరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖను కోరితే ఇచ్చిన రైల్వే భూములకు బదులు ముడసర్లోవలో రాష్ట్రం రైల్వే శాఖకు భూమి ఇచ్చింది. అయితే ఆ భూమి చుట్టూ 800 ఎకరాల్లో ఎటువంటి భవన నిర్మాణాలు చేపట్టకూడదని ఈ జగన్ రెడ్డికి, ఆయన మంత్రి వర్గంలో ఉన్న బొత్సకు తెలియదా? 2019లో వైసీపీ అదికారంలోకి వచ్చిన తరువాత విశాఖ రైల్వే జోన్ కు అవసరమైన భూమిని ఇవ్వడంలో 2023 డిసెంబర్ వరకు తాత్సారం చేసిన మాట వాత్సవం. కేంద్ర రైల్వేశాఖ అనేక సార్లు విశాఖ రైల్వే జోన్ కు భూమిని అడిగినా భూమి ఇవ్వకుండా మరో వైపు కేంద్రం రైల్వే జోన్ ఏర్పాటు చేయకుండా ఆలస్యం చేస్తుందని వైసీపీ నేతలు అబద్దాలు చెబుతున్నారు.

2020 -21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బడ్జెట్ లో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు రూ. 106 కోట్లను కేటాయించింది. జగన్ రెడ్డి రైల్వే జోన్ కు భూమి కేటాయించక పోవడంతో ఆ నిధులు మురిగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం పదేపదే అడగ్గా… చివరికి 2023లో భూమిని కేటాయించారు. కాని ఆ భూమిని బదలాయించడంలో కూడా తాత్సారం చేశారు. దీనిపై విమర్శలు వస్తుండటంతో హడావిడిగా భూమిని కేటాయిస్తూ ఇప్పటి కేంద్రమంత్రి అశ్వీని వైష్ణవ్ కి విశాఖలో కొన్ని రెవెన్యూ పత్రాలను అందించారు. ఇప్పుడు ఆ పత్రాలను చూపించి బొత్స ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు.

వాస్తవానికి ముడసర్లోవలో కేటాయించిన భూమి ముంపు ప్రాంతం. అక్కడ భవన నిర్మాణాలు చేయడానికి వీలు పడదు. ముడసర్లోవ ముంపు ప్రాంతంలో ఇచ్చిన భూమిలో భవన నిర్మాణాలు వీలు పడదని రాజ్యసభలో ఎంపి కనకమేడల అడిగిన ప్రశ్నకు సాక్షాత్తు రైల్వే శాఖ మంత్రి సమధానం చెప్పారు. వరదలో మునిగిపోయే భూమిని చూపి రైల్వే జోన్ కు భూమి ఇచ్చామని చెప్పడం ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరి మనోభావాలను దెబ్బతీయడమే అవుతుంది.

2014కు ముందు కాంగ్రెస్ పాలనలో మంత్రిగా ఉన్న బొత్స, ఎంపీగా ఉన్న జగన్ రెడ్డి ఏనాడు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు గురించి అడగలేదు. నేడు మళ్లీ రైల్వే జోన్ పై రాష్ట్ర ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. ఏపీలో రైల్వే అభివృద్ధికి కాంగ్రెస్ 2009 -2014 వరకు సంవత్సరానికి సగటున రూ. 886 కోట్లు మాత్రమే ఇచ్చింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక సంవత్సరానికి సగటున రూ.7,500 కోట్లను ఏపీలో రైల్వే అభివృద్ధికి కేటాయించింది.

ఏపీలో 31 కొత్త ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. 5,581 కిలోమీటర్ల పరిధిలో రూ. 70 వేల కోట్ల విలువైన పనులు వివిధ దశలో ఉన్నాయి. అమృత్ భారత్ లో భాగంగా 72 రైల్వే స్టేషన్ లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అభివృద్ధి చేస్తున్నారు. ఇంత చేస్తుంటే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పై బొత్స విమర్శలు చేయడం సిగ్గుచేటు. బొత్స చేస్తున్న విమర్శలు ఆకాశంపై ఉమ్మి వేయడం లాంటిదే.

టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ..

విభజన చట్టంతో ఏపీ అభివృద్ధి చెందుతుందని 2014కి ముందు కాంగ్రెస్ పార్టీ అనేక మాటలు చెప్పింది. వాటిలో భాగంగా ఏపీకి రైల్వే జోన్ ఇచ్చామని రైల్వే జోన్ తో ఏపీలో రవాణా వ్యవస్థ అభివృద్ధి చెంది అనేక ఉద్యోగ అవకాశాలు వస్తాయని నమ్మబలికారు.

2014 కు మందు మంత్రి బొత్స సత్యనారాయణ భారీ పరిశ్రమలు, పంచాయతీ, రవాణా, మర్కెటింగ్ శాఖా మంత్రిగా ఉన్నారు. రైల్వే జోన్ పట్ల బొత్సకు చిత్త శుద్ధి ఉంటే, రైల్వే జోన్ ను ఉత్తరాంధ్రకు త్వరగా తెచ్చుకోవాలని ఉంటే, రైల్వే జోన్ ఉత్తరాంధ్రాలోనే ఉండాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకున్నట్లుగా బొత్సకు కూడా ఉండి ఉంట్లే విభజన చట్టం తయారు చేసేటప్పుడే ఎటువంటి అవరోధాలు లేకుండా విశాఖలోనే రైల్వే జోన్ ఏర్పాటుకు కృషి చేసేవారు.

పీయూష్ గోయల్ మీద బొత్స సత్యనారాయణ అనవసరంగా అబద్దాలు ప్రచారం చేస్తున్నాడు. 2014 ముందు రాష్ట్రమంత్రిగా ఉన్న బొత్స విభజన చట్టాన్ని తయారు చేయడానికి మంత్రిగా ప్రాధాన్యత ఉన్నప్పుడు నీవు ఎందుకు స్పష్టమైన విధి విధానాలను రూపొందించలేకపోయావు. ఆరోజు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ లో జగన్ రెడ్డి కూడా ఒక పార్లమెంట్ సభ్యుడు. విశాఖ రైల్వే జోన్ కు సంబంధించి ఎటువంటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆనాడు కాంగ్రెస్ ఎంపీగా జగన్ రెడ్డిపై లేదా ? ఈ ప్రశ్నలకు జావాబు చెప్పకుండా ఇంకా కేంద్రం రైల్వే జోన్ ప్రకటించలేదంటూ జగన్ రెడ్డి అబద్దపు ప్రచారాలు చేయడం ఎంత వరకు సమంజసం.

విశాఖలోనే రైల్వే జోన్ అనేది ఎక్కడ కూడా కేంద్రం విభజన చట్టంలో పెట్టలేదు. విశాఖలో రైల్వే జోన్ కావాలిని నాటి ఏపీ కాంగ్రెస్ ప్రభుత్వం కోరలేదు. ఆప్రాంత మంత్రి గా ఉన్న బొత్స కోరలేదు. ఆ ప్రాంతంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడం మంత్రి బొత్సకు అసలు ఇష్టం లేదు. ఏపీకి రైల్వే జోన్ ఇస్తాం మీకు అనుకూలమైన చోట పెట్టుకోవచ్చమని మాత్రమే విభజన చట్టంలో పేర్కొన్నారు.

2014 లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్ర్నాన్ని వేగవంతా అభివృద్ధి చేయాలని అనేక ప్రాజెక్టులు తీసుకువచ్చారు. అందులో భాగంగా నీటి వనరులు బాగా ఉన్న అమరావతి రాజధానిగా నిర్మిస్తే అందరికి అనుకూలంగా ఉంటుందని రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కేంద్రం ప్రతిపక్షాలతో చర్చించాక అందరి నిర్ణయంతో రాజధాని నిర్మాణం చేపట్టారు. దాన్ని ఈ జగన్ రెడ్డి మంట కలిపాడు. పోలవరం పూర్తి అయితే ప్రాజెక్టుకు ఉత్తరం, దక్షిణం వైపు ఉన్న ప్రజలకు నీటిని అందించి ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయవచ్చని వేగవంతంగా పోలవరం నిర్మాణానికి చంద్రబాబు పూనుకున్నారు. దాన్ని జగన్ రెడ్డి సర్కార్ తుంగలో తొక్కి పోలవరాన్ని పూట్లోకి నెట్టాడు.

రైల్వే జోన్ కోసం రాయలసీమలో నుండి కూడా అనేక విజ్ఞప్తులు వచ్చినా… ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పటి నుండో కోరుకుంటున్నందున… ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష అయిన రైల్వే జోన్ కోసం అనేక సార్లు కేంద్రం చుట్టూ చంద్రబాబు తిరిగి విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు కు 2019 ఫిబ్రవరిలో మోడీతో ప్రకటన చేయించారు. రైల్వే జోన్ కోసం వైసీపీ ఏ ప్రయత్నం చేయలేదు. దానిపై ఏరోజు మాట్లాడలేదు. రైల్వో జోన్ కోసం కేటాయించిన నిధులు కూడా వాడుకోకుండా మురిగిపోయేలా చేశాడు. విశాఖకు రైల్వే జోన్ రావడం, ఉత్తరాంధ్ర అభివృద్ధి అవ్వడం జగన్ రెడ్డి, బొత్సకు ససేమీరా ఇష్టం లేదు.

అమరావతి, పోలవరం, రైల్వే జోన్ లాంటి అనేక ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ సాయంతో చంద్రబాబు తెచ్చారు. కాబట్టే జగన్ రెడ్డి వాటిని విధ్వంసం చేస్తున్నాడు. అమరావతిని ముక్కలు చేసినట్లే చంద్రబాబు సహకారంతో వచ్చిన విశాఖ రైల్వే జోన్ కు భూమి కేటాయించకుండా నాశనం చేశారు. ఉత్తరాంధ్ర వాసైనా మంత్రి బొత్సకు కూడా ఆప్రాంతం ప్రజలపై మమకారం లేదు. విభజన సమయంలో మంత్రిగా, నేడు మంత్రిగా ఉన్నా బొత్స తప్పుడు ప్రకటనలు చేయడం తప్పా ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఏనాడు పట్టించుకోలేదు. ఉత్తరాంధ్ర ప్రజలు దీన్ని గుర్తు పెట్టుకుని బొత్సకు, ఈ జగన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలి.

జనసేన అధికార ప్రతినిధి గౌతమ్ మాట్లాడుతూ…

రైల్వే జోన్ పై పదే పదే అబద్దాలు చెబుతూ జనాలను జగన్ రెడ్డి, బొత్స సత్యనారాయణలు మోసం చేస్తున్నారు. జోన్ ఏర్పాటు ఇష్టం లేక విశాఖ రైల్వే జోన్ కు వరదలు వస్తే కొట్టుకు పోయే స్థలం కేటాయించి.. రైల్వే జోన్ కు స్థలం ఇచ్చామంటూ మోసం చేస్తున్నారు. విశాఖలో రైల్వే జోన్ కు కేటాయించడానికి ఎక్కడా భూములు లేవా?… అన్నీ వైసీపీ నేతలు దోచేశారా? ఎంటనే సమాధానం చెప్పాలి.

Leave a Reply