– ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్
అమరావతి: బియ్యం వ్యాపారంతో తన వియ్యంకుడికి సంబంధం లేదని ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. మీడి యాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ‘‘ ‘‘ మా వియ్యంకుల కుటుంబం మూడు తరాలుగా బాయిల్డ్ రైస్ ఎగుమతి వ్యాపారం చేస్తున్నారు. ముడిబియ్యం వ్యాపారం చేయరు. స్టీమ్ రైస్ మాత్రమే ఎగుమతులు చేస్తారు. నాతో వియ్యం పొందాక మా వియ్యంకుడు బియ్యం వ్యాపారం చేయట్లేదు. రేషన్ బియ్యంతో నా వియ్యంకుడి వ్యాపారానికి సంబంధం లేదు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి సొంత ఫ్యాక్టరీలో మిల్లింగ్ చేసుకుని ఎగుమతి చేస్తారు’’ అని మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు.
కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోనే తన వియ్యంకులు వ్యాపారం చేస్తున్నారని, ఏపీలో గింజ కూడా కొనుగోలు చేయలేదు. మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబుకు అనుమానం ఉంటే చెక్ పోస్ట్ పెట్టుకుని, ప్రతి బ్యాగ్‌ను తనిఖీ చేసుకోవచ్చని అందుకు తానే అనుమతులు ఇప్పిస్తానని.. వాళ్లు చేసేది పారాబాయిల్డ్ రైస్ వ్యాపారం మాత్రమే అని మంత్రి స్పష్టం చేశారు.