నీ అడుగు నాదై సాగదా పయనమే
అణువణువు ప్రేమై చేరదా పరవశమే
నే చేరలేని దూరం దూరమే ..
నే చేరుతున్న గమ్యం నీ స్నేహమే ..
కొమ్మల్లో ఆమని కోయిలా ..
రేయంతా కురిసేటి ఆ వెన్నెలా ..
నువు చూపించావు ఈ జగమిలా
నేనెన్నడూ చూడలేదే ఇలా ..
శశికిరణాల తడిసిన ఈ పుడమిలా
నా మది మురిసింది పున్నమి వెలుగులా
ఈ మాయ చేసింది నువ్వే కదా ..
ఎదలో ఆశ తెలిపింది ఈ ప్రేమ కథా .
– రాధిక ఆండ్ర