-కేంద్రమిచ్చే ఉచిత బియ్యాన్ని జగన్ రెడ్డివిదేశాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు
– రేషన్ బియ్యాన్ని దారిమళ్లించి సొమ్ముచేసుకుంటూ, పేదలను అర్థాకలితో అలమటింపచేస్తున్న జగన్ రెడ్డి ఆటలుసాగనివ్వం
– తక్షణమే వైసీపీప్రభుత్వం పేదలకు ఇవ్వాల్సిన రెండునెలల బియ్యాన్ని అందించాలి
– రేషన్ దుకాణాలకు మంగళంపాడి, పేదలపొట్టకొట్టాలన్న ముఖ్యమంత్రి దుర్మార్గపు ఆలోచనలకు ప్రజలే సమాధానంచెప్పాలి.
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు
పేదలకడుపునింపే రేషన్ బియ్యాన్ని కూడా జగన్ ప్రభుత్వం తనఅవినీతివనరుగా మార్చుకుందని, ఉచితబియ్యం పథకానికి తూట్లుపొడిచేలా వ్యవహరిస్తోందని, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు తెలిపారు.
మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడిన వివరాలు ఆయనమాటల్లోనే …
“కరోనాసమయంలో పేదలను ఆదుకోవడానికి, రేషన్ కార్డుఉన్న ప్రతికుటుంబానికి కేంద్ర ప్రభుత్వం రూ.1000లు నగదుఇస్తే, ఆంధ్రప్రదేశ్ మినహా దేశంలోని అన్నిరాష్ట్రాలు ఎంతోకొంతసొమ్ముకలిపి పేదలకు అందించాయి. ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కేంద్రమిచ్చినదానికి రూపాయికూడా ఇవ్వకుండా నిర్దాక్షణ్యంగా వ్యవహరించింది. అప్పుడు అలా వ్యవహరించిన జగన్ రెడ్డి ఇప్పుడుఏకంగా పేదలకు కేంద్రమిచ్చే రేషన్ బియ్యాన్ని ఎగ్గొట్టడానికి సిద్ధమయ్యాడు. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా కేంద్రం ఉచితంగా రేషన్ కార్డుదారులకు బియ్యం ఇస్తోంది. ప్రతినెలా 1వతేదీనుంచి 15వతేదీవరకు ఆ బియ్యాన్ని అన్నిరాష్ట్రాలు విధిగా పేదలకు అందిస్తున్నాయి. కానీ జగన్ రెడ్డిప్రభుత్వం, గత రెండునెలలుగా కేంద్రంసరఫరాచేసే బియ్యాన్ని పేదలకు ఇవ్వడంలేదు.
బియ్యం ఎగ్గొట్టింది కాక, దానిపై మంత్రులు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. పౌరసరఫరాల మంత్రేమో కేంద్రం ఇస్తున్నబియ్యం సరఫరా తమప్రభుత్వానికి భారంగా మారిందంటున్నాడు. దేశంలో ఏ రాష్ట్రానికిలేని బియ్యంసరఫరా భారం, ఆంధ్రరాష్ట్రానికే ఎందుకొచ్చిందో సదరుమంత్రి పేదలకు సమాధానం చెప్పాలి. మరో మంత్రేమో రాష్ట్రంలో బియ్యం కొరత ఉందని, కాబట్టే పేదలకు బియ్యం ఇవ్వలేక పోతున్నామంటూ శుద్ధ అబద్ధం చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్ననే ఖరీఫ్ సీజన్ లో రైతులనుంచి 42లక్షలమెట్రిక్ టన్నులధాన్యాన్ని కొన్నట్లు చెప్పింది. అంతధాన్యంకొంబే బియ్యంకొరత ఎక్కడుంటుందో మంత్రేచెప్పాలి. మంత్రులు చెప్పే తిక్క సమాధానాలు వింటుంటే కేంద్రప్రభుత్వమిచ్చే ఉచిత రేషన్ బియ్యానికి స్వస్తిపలకాలని ఏపీప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుంది.
రేషన్ దుకాణాలపై జగన్ రెడ్డికి, ఆయనప్రభుత్వానికి చాలాకోపం ఉంది. అధికారంలోకిరాకముందు పేదలకు సన్నబియ్యం ఇస్తానన్న జగన్ రెడ్డి, ఇప్పుడు ఉన్నబియ్యాన్నే తీసేస్తున్నాడు. బియ్యానికి బదులుగా నగదుఇవ్వాలన్న జగన్ ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచనను రాష్ట్రప్రజలు తిప్పికొట్టారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులకు ఆశపడి బియ్యానికి బదులు నగదుతీసుకుంటే, భవిష్యత్ లో జగన్ రెడ్డి రేషన్ కార్డులు తీసేసి, ఆతరువాత అదిలేదని చెప్పి, ఇతరపథకాలు ఆపేస్తాడని ప్రజలంతా గ్రహించారు. కాబట్టే జగన్ రెడ్డి బలవంతంగా ప్రజలపై రుద్దాలనుకున్న నగదుచెల్లింపులను నిర్ద్వందంగా తిరస్కరించారు.
ప్రజలంతా ఒకేబాటలో నడవడంతో, ఏంచేయాలో పాలుపోని జగన్ రెడ్డి, ఇప్పుడుఏకంగా బియ్యం సరఫరాకే ఎసరుపెట్టాడు. కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు రూపాయిఖర్చు లేకుండా సరఫరాచేసే బియ్యాన్ని కూడా ఏపీప్రభుత్వం పేదలకు పంచలేదా? కేంద్రం ఇచ్చేబియ్యానికి ముందస్తుగా పెట్టుబడిపెట్టలేని అసమర్థస్థితిలో ఉన్న జగన్ రెడ్డి సర్కారుఏకంగా బియ్యం పంపిణీనే ఎత్తేయాలని నిర్ణయించింది. బియ్యం సరఫరా కోసం రాష్ట్రప్రభుత్వాలు ముందస్తుగాచేసే చెల్లింపులను, ఎప్పటికప్పుడు కేంద్రం తిరిగి చెల్లి స్తుంటుంది. అలాచెల్లించినాకూడా ముందుగా పెట్టుబడిఎందుకు పెట్టాలన్న జగన్ రెడ్డి దురాలోచన, చివరకు పేదల్ని అర్థాకలితో అలమటించేలా చేస్తోంది.
పేదలకు బియ్యమే ఇవ్వలేని ముఖ్యమంత్రి చర్య, రాష్ట్రాన్ని మరో శ్రీలంక చేస్తుందడం వాస్తవంకాదా? రాష్ట్రంలో కోటి 52లక్షల రేషన్ కార్డులున్నాయని, కానీకేంద్రప్రభుత్వం కేవలం 89లక్షల రేషన్ కార్డులకే ఉచితబియ్యం అందిస్తుందని పౌరసరఫరాలమంత్రి నిన్నచెప్పుకొచ్చారు. సాధారణంగా మనంచూస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుల్లో 80 నుంచి 90శాతం మందిమాత్రమే క్రమంతప్పకుండా ప్రభుత్వమిచ్చేరేషన్ తీసుకుంటున్నారు. అలాంటప్పుడు కేంద్రంఉచితంగా అందించే బియ్యాన్ని 90లక్షలకార్డులకు కూడా జగన్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదు?
కేంద్రమిచ్చే బియ్యాన్ని పేదలకు ఇవ్వకుండా, సొంత అవసరాలకు వాడుకోవాలన్న దుర్మార్గపు ఆలోచనలో జగన్ ప్రభుత్వంఉంది. కాబట్టే కేంద్రప్రభుత్వం చేసే సాయాన్ని, అమలుచేస్తున్న పథకాలను, ఇతరత్రానిధుల్ని తనసొంత అవసరాలకోసం మళ్లించుకుంటున్నాడు. ఆ క్రమంలోనే ఇప్పుడు పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని కాకినాడపోర్ట్ కేంద్రంగా విదేశాలకుతరలిస్తూ, సొమ్ముచేసుకుంటున్నాడు. కేంద్రం పేదలకు సరఫరాచేసే బియ్యం విషయంలో, దేవుడువరమిచ్చినా, పూజారి కరుణించలేదు అన్నట్లుగా జగన్ రెడ్డి వైఖరి ఉంది.
కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పేదలకు అందించే బియ్యాన్ని వైసీపీ ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకోవడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఏప్రియల్ నెలలో బియ్యం సరఫరాకు కొత్త జిల్లాల ఏర్పాటుని సాకుగాచూపిన జగన్ ప్రభుత్వం, మేనెలలో ఇవ్వాల్సిన బియ్యాన్నికూడా ఇవ్వలేదు. మరో 4రోజుల్లో జూన్ నెల బియ్యం కూడా వస్తాయి. మూడునెలలబియ్యం పేదలకు ఒకేసారి ఇవ్వడం, అంతమొత్తంలో రేషన్ బియ్యం తరలించే రవాణావ్యవస్థకూడా ప్రభుత్వానికిలేనందున, జగన్ రెడ్డి సర్కారు తక్షణమే పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని వీలైనంతత్వరగా వారికి అందించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభు త్వం ఈ దిశగా స్పందించకుంటే, తెలుగుదేశంపార్టీ రేషన్ బియ్యం పంపిణీవ్యవహారంలో జగన్ రెడ్డిని దోషిగా నిలబెట్టి, ప్రజల్లో ఆయనభరతం పడుతుందని హెచ్చరిస్తున్నాం.”