Suryaa.co.in

Andhra Pradesh

యువ పోరు అంటూ వై’చీప్ పాలిట్రిక్స్’

– టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం

మంగళగిరి: యువతకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పెట్టి ఇప్పుడు చీప్ గా యువ పోరు అంటూ వీధి నాటకాలకు తెరతీశాడు జగన్ రెడ్డి అంటూ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం ఆగ్రహాం వ్యక్తం చేశారు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2 నెలల క్రితం వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి విద్యార్థి సమస్యలపై రోడ్డు ఎక్కాల్సి వస్తుందని చెప్పినప్పుడు మాట్లాడాడు.. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఏ విద్యార్ధి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతోనే మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని అమలు పరుస్తామని, అలాగే లోకేష్ గారి పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబట్టుకుంటామని, మీకు ఏవిధమైన సమస్యలు ఉన్నా వాటిని సానుకూలంగా తీసుకుని నేరవేర్చుతామని కూటమి ప్రభుత్వం చెప్పిందన్నారు.

గత వైసీపీ ప్రభుత్వం పేద విద్యార్థులకు చేసిన అన్యాయం మీద… ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే లోకేష్ చేస్తున్న ప్రక్షాళనకు టైం, ప్లేస్ చెబితే చర్చిద్దామని సవాలు విసిరితే ఎవరు స్పందించ లేదు. శాసన మండలి లో ప్రశ్నోత్తరాలలో సభ్యులు అడిగిన దానికి సమాధానంగా వైసీపీ పెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల్లో రూ.800 కోట్లు విడుదల చేశారు. అంతేకాక కోడిగుడ్లు, చిక్కీలకు రూ.352 కోట్లు విడుదల చేశారు. కాని పదే పదే అబద్ధాలు చెబుతూ.. అక్రమ సంపాదనతో సంపాదించిన పేపర్లో, సాక్షి మీడియాలో అబద్దాలు వడ్డించే ప్రయత్నం చేస్తూ రాస్తూ ఉన్నారు. విశాఖలో ఒక ర్యాలీ లో పాల్గొన్న కొంత మంది విద్యార్థులు ప్లక్ కార్డులు పట్టుకుని ఉంటే వారు కూటమికే జై కొట్టే విద్యారంగాన్ని ప్రక్షాళన చేసిన నాయకుడు లోకేష్.

వైసీపీ ప్లకార్డులు పట్టుకున్న.. వారి మనస్సులో మాత్రం 9 నెలల్లో విద్యారంగాన్ని గాడిలో పెట్టి ముందుకు నడిపిస్తున్నా కూటమి ప్రభుత్వానికి వాళ్లు జై కొట్టారంటే…వారికి నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం కల్పించింది. వైసీపీ ప్రభుత్వం నాడు పెట్టిపోయిన బకాయిలను కూటమి ప్రభుత్వం విడుదల చేస్తుంది అనేది జగమెరిగిన సత్యం .. కాని ఏమి ఎరగనన్నట్లు జగన్ రెడ్డి ఆత్మవంచనకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు.

LEAVE A RESPONSE