ఈనెల 14వ తేదీ న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని మచిలీపట్నంలో భారీ బహిరంగదభ జరగనుంది.సభా ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. సుమారు ఐదు లక్షల మంది హాజరవుతారని అంచనా.
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్ సభ ఏర్పాట్లు పరిశీల నిమిత్తం నిన్న మచిలీపట్నం రావడం జరిగింది. స్థానికంగా ఉన్న జీ కన్వెన్షన్ లో జనసేన పార్టీ నాయకులతో జనసైనికులతో 14 జరగబోయే సభ ఏర్పాట్లు గురించి దిశా నిర్దేశం చేయడం జరిగింది.
ఆ సందర్భంగా పెడన జనసేన నాయకులు, జనసైనికులు రూపొందించిన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ వాల్ పోస్టర్ ను నాదెండ్ల మనోహర్ చేతుల మీదగా విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెడన నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున నాయకులు జనసైనికులు పాల్గొనడం జరిగింది.