Suryaa.co.in

Andhra Pradesh

సీఎం జ‌గ‌న్‌కు నాయీ బ్రాహ్మ‌ణుల కృత‌జ్ఞ‌త‌లు

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి నాయీ బ్రాహ్మ‌ణ సేవా సంఘం ప్ర‌తినిధులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ను నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్, నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా నాయీ బ్రాహ్మణులను, వారి సామాజికవర్గాన్ని కించపరిచే పదాలపై ప్రభుత్వం నిషేదం విధిస్తూ జీవో జారీ చేయడంపై ముఖ్యమంత్రికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. తమ ఆత్మగౌరవాన్ని కాపాడారని సీఎంకు వివరించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన వారిలో నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ సిద్దవటం యానాదయ్య, నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి కోటేశ్వరరావు, నాయీ బ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు జి. రామదాసు, కే. శ్రీదేవి, నందిని ఉన్నారు.

LEAVE A RESPONSE