వైయ‌స్ఆర్ సీపీలో చేరిన బీజేపీ నాయకులు

కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి

తాడేప‌ల్లి: గుంటూరు జిల్లాకు చెందిన బీజేపీ నాయ‌కుడు మద్దుల రాజాయాదవ్ నేతృత్వంలో బీజేపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సమక్షంలో మ‌ద్దుల రాజాయాద‌వ్‌, ఆయ‌న అనుచ‌రులు వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. వారికి ఎంపీ విజయసాయిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీసీల‌ సంక్షేమానికి అన్ని విధాలుగా కృషి చేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలో పని చేయాలని పార్టీలో చేరినట్టు మద్దుల రాజా యాదవ్ తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీ బ‌లోపేతానికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఆయన తెలిపారు.