ఇరవై సంవత్సరాల తర్వాత మారిన నేమ్ ప్లేట్

ఢిల్లీ తుగ్లక్‌ రోడ్డు… 23వ నెంబర్ బంగ్లా…

ఢిల్లీ రాజకీయాలతో పరిచయం ఉన్న వారికి… సుపరిచితం ఆ 23వ నెం బంగ్లా…. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం. డిసెంబర్ మొదటి వారం వరకు… కేసీఆర్‌ పేరుతో ఉన్న నేమ్‌ ప్లేట్‌ ను అధికారులు మార్చారు.2004 నుంచి 2014 వరకు ఎంపీగా,మంత్రిగా తుగ్లక్‌ రోడ్డు నివాసం నుంచే కేసీఆర్‌ కార్యకలాపాలు నిర్వహించారు.ఆ తర్వాత 2014 నుంచి 2023 డిసెంబరు తొలివారం వరకు అదే బంగ్లాలో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌ అధికారిక నివాసంగా ఉండేది. ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్‌ సిబ్బంది బంగ్లాను ఖాళీ చేసి తెలంగాణ భవన్‌ అధికారులకు అప్పగించారు. సీఎం గా ప్రమాణ స్వీకారం తర్వాత మంగళవారం తొలిసారి ఢిల్లీకి వచ్చిన రేవంత్ రెడ్డి… ఈ బంగ్లాను సందర్శించారు. MS ఫ్లాట్స్‌, యమున అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ నెం 902 ప్రస్తుతం రేవంత్‌ అధికార నివాసంగా ఉంది.

Leave a Reply