చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలసిన జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని బుధవారం ప్రముఖ సినీ కథానాయకుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ దర్శించుకున్నారు.
శ్రీకాళహస్తి టీడీపీ నేతలు, ముక్కంటి ఆలయ అధికారులు ఈయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు.స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.
కాగా బాలయ్యను చూడటానికి అభిమానులు పెద్ద సంఖ్యలో ముక్కంటి ఆలయం వద్దకు వచ్చారు.ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.బాలయ్య వెంట అఖండ దర్శకుడు
బోయపాటి శ్రీను కూడా ఉన్నారు. వారు బుధవారం ఉదయం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని, తర్వాత మంగళగిరి నరసింహ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం.. శ్రీకాళహస్తీశ్వరుని సేవకు వచ్చారు.