– ప్రాణ భయంతో విద్యార్థులు
– తృటిలో తప్పిన ప్రమాదం
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శివారు పెద అమిరం రోడ్డులో బుధవారం సాయంత్రం నారాయణ విద్యాసంస్థలకు చెందిన బస్సు అడుగుభాగంలో బ్యాటరీ వద్ద అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి.డ్రైవర్ బస్సు ఆపివేశాడు.విద్యార్థులు ప్రాణభయంతో బస్సులో నుంచి బయటకు పరుగులు తీశారు. స్థానికులు బకెట్లుతో నీళ్ళు తీసుకు వచ్చి మంటలు ఆర్పివేశారు.
వెనుకనే వస్తున్న ఆ విద్యాసంస్థకు చెందిన మరో రెండు బస్సులు ఆపి డ్రైవర్లు సహాయం చేసారు.ప్రమాదం తప్పడంతో విద్యార్థులు,స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.అనంతరం ఆ బస్సును విద్యార్థులే గెంటి స్టార్ట్ అయిన తర్వాత ఎక్కారు.ముందు జాగ్రత్త చర్యగా మరో బస్సులో విద్యార్థులను తీసుకెళ్ళకుండా అదే బస్సులోబస్సులో ఇళ్లకు తీసుకెళ్లడం విమర్శలకు తావిచ్చింది .బస్సు తెలంగాణ రిజిస్ట్రేషన్ తో ఉంది. విద్యాసంస్థల బస్సుల కండీషన్,పట్టించుకోని అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.