టీడీపీ నేతలకు కాఫీ, టీలు అందించి.. వారి కార్లు తుడిచిన నీ గత చరిత్ర మర్చిపోయావా నానీ?
– జగన్.. కొడాలి నానీ పాద ప్రభావంతోనే సుభిక్షమైన రాష్ట్రం, కృష్ణాడెల్టా ప్రాంతం దుర్భిక్షంగా మారాయి
• రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన కృష్ణాజలాల కోసం కేంద్రానికి లేఖ రాసే ధైర్యం జగన్ రెడ్డికి…కొడాలినానీకి లేదు
• నాలుగున్నరేళ్లుగా ప్రజల్ని పీడించి.. ప్రతిపక్షాలను వేధించి.. అవినీతి దోపిడీలు చేయడం తప్ప జగన్, నానీ చేసిందేమీ లేదు
• నందమూరి-నారా కుటుంబాలను దూషించినందుకే నానీకి గొంతు క్యాన్సర్ వచ్చింది
• నానీ చేసిన పాపాలు అతని బిడ్డలకు శాపాలుగా మారాయి
– టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహాక కార్యదర్శి, రాష్ట్ర విభిన్నప్రతిభావంతుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు
వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచీ రాష్ట్రంలో కరవుకాటకాలు కరాళ నృత్యం చేస్తున్నాయని, జగన్మోహన్ రెడ్డి..కొడాలినానీల పాదప్రభావంతో రాష్ట్రం.. కృష్ణాడెల్టా ప్రాంతం దుర్భిక్షాన్ని అనుభవిస్తున్నాయని, ముఖ్యమంత్రికి.. మాజీ మంత్రికి రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన కృష్ణా జలాల కోసం కేంద్రానికి లేఖలు రాసే ధైర్యం లేదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోనుగుంట్ల కోటేశ్వరరావు చెప్పారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లా డారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
“ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడమే రాష్ట్ర రైతాంగానికి శాపంగా మారింది. రైతులకు అవసరమైన సాగునీరు.. విత్తనాలు..ఎరువులు.. సూక్ష్మపోషకాలు అందించ డంలో జగన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యాడు. మరోపక్క సుభిక్షమైన కృష్ణాడెల్టా ప్రాంతం ఎడారిగా మారినా కొడాలినాని ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రిని ప్రశ్నించింది లేదు. పట్టిసీమను వట్టిసీమ అని నిందలేసిన జగన్ రెడ్డి.. వైసీపీనేతలు.. మంత్రులు ఇప్పుడు దాన్నే వినియోగించుకోవాల్సిన దుస్థితిక వచ్చారు.
తాగిన మైకంలో మతిచలించి మాట్లాడుతున్న కొడాలినానీకి రోజులు దగ్గరపడ్డాయి నానీ చేసిన పాపాలు అతని బిడ్డలకు శాపాలుగా మారాయి
చంద్రబాబుపై.. టీడీపీపై నోరుపారేసుకుంటున్న కొడాలినాని తన స్థాయి ఏమిటో గుర్తుంచుకొని మాట్లాడాలి. గతంలో నాలాంటి టీడీపీనేతలకు టీ..కాఫీలు అందించిన కొడాలినాని.. నేడు జగన్ ప్రభుత్వంలో ప్రజలసొమ్ము కాజేశానన్న అహంకారంతో నోరు పారేసుకుంటున్నాడు. గుడివాడలోని తోపుడుబండ్ల వ్యాపారుల నుంచి మామూళ్లు వసూలు చేయడం.. పేదల బియ్యాన్ని విదేశాలకు సరఫరా చేయడం..పేకాట క్లబ్బులు .. జూదకేంద్రాలు నిర్వహించిన నీతిమాలిన చరిత్ర నానీది.
తాగిన మైకంలో మైకుల ముందు మతి చలించినవాడిలా మాట్లాడుతున్న కొడాలినానీకి రోజులు దగ్గరపడ్డాయి. గతంలో ఆహ్వాన్ హోటల్లో నేలపై పడుకొని.. టీడీపీనేతల చుట్టూతిరుగుతూ.. చంద్రబా బు ప్రాపకం కోసం పాకులాడిన చరిత్ర నానీది. తాను చేసిన పాపాలు.. .తాను నందమూరి – నారా కుటుంబాలను అన్నందుకే నానీకి గొంతు క్యాన్సర్ వచ్చింది. తన నోటి దూలతో చివరకు తన ఇద్దరు కూతుళ్ల జీవితాలను కూడా నానీ నాశనంచేసే స్థితికివచ్చాడు.
భువనేశ్వరికి లభిస్తున్న ప్రజాదరణచూసి ఓర్వలేకే నానీలాంటి వెధవలు… మతిలేని మంత్రులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు లోకేశ్ పప్పో…నిప్పో తెలియాలం టే జగన్ రెడ్డి, మా యువనేతతో కలిసి మీడియా ముందుకు రావాలి
అన్యాయంగా చంద్రబాబుని జైలుకు పంపిన జగన్ రెడ్డి.. 50 రోజులైనా టీడీపీ అధినేత రూపాయి అవినీతిచేశాడని నిరూపించలేకపోయాడు. చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లి.. తన అవినీతి అక్రమాలను ఎండగడుతున్నాడన్న అక్కసుతోనే జగన్ రాజకీయకుట్రలకు పాల్పడి అన్యాయంగా చంద్రబాబుని జైలుపాలు చేశాడని ప్రజలు గ్రహించారు. చంద్రబా బు సమర్థవంతంగా అమలుచేసిన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ను జగన్ తన స్వార్థ రాజకీయాలకు బలిచేసి, యువత జీవితాల్లో నిప్పులు పోశాడు. తానే కాదు….టీడీపీ నేతలు ఎవరు ఎలాంటి తప్పుచేసినా చంద్రబాబు సహించరు. అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి తప్పుచేశాడని జగన్ రెడ్డి..కొడాలినాని లాంటి వాళ్లు ఎంతగా విషప్రచారం చేసినా ప్రజలు నమ్మరు.
గతంలో పౌరసరఫరాలశాఖా మంత్రిగా ఉన్న కొడాలినానీ వేల లారీల ఇసుకను స్వయంగా దగ్గరుండి పక్కరాష్ట్రాలకు తరలించి, జగన్ రెడ్డికి అవినీతి సొమ్మును చేరవేశాడు. నీతి…జాతి లేని నాని మరోసారి చంద్రబాబుని గానీ, లోకేశ్ నుగానీ, ఆయన కుటుంసభ్యులను గానీ ఏమైనా అంటే అతని చర్మం ఒలిచి దివ్యాంగులకు చెప్పులు కుట్టిస్తాం. భువనేశ్వరికి ప్రజల్లో లభిస్తున్న ఆదరణచూసి ఓ ర్వలేకనే నానీలాంటి వెధవలు… మతిలేని మంత్రులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడు తున్నారు. లోకేశ్ పప్పో…నిప్పో తెలియాలంటే జగన్ రెడ్డి, మా యువనేతతో కలిసి మీడియా ముందుకు రావాలి. లోకేశ్ వాగ్ధాటికి జడిసి.. ఆయన లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే జగన్ రెడ్డి తన మంత్రులతో విషప్రచారం చేయిస్తున్నాడు.
జగన్ రెడ్డికి కోర్టులంటే భయం ఉంది కాబట్టే.. తప్పు చేశాడు కాబట్టే.. తనపై ఉన్న కేసుల విచారణకు హాజరుకాకుండా తప్పించుకుంటున్నాడని తెలుసుకో నాని. నాలుగున్న రేళ్ల పాలనలో జగన్ రెడ్డి అన్నివర్గాలను దారుణంగా వంచించాడు. దళితులు.. బీసీలు.. మైనారిటీలు.. మహిళలు.. రైతులు అందరూ జగన్ బాధితులే. బటన్ నొక్కుడు పేరుతో వారిని వంచించిన జగన్ కు వచ్చేఎన్నికల్లో బుద్ధిచెప్పడానికి వారం తా ఎదురుచూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వమంటే ఏంటో తెలియదు.. పరిపాలన అసలే తెలియదు. మంత్రులకు వారి శాఖల గురించి తెలియదు.
జగన్ అండ్ కో కి తెలిసిందల్లా దోపిడీనే. ప్రజలంతా ఇప్పటికైనా జగన్ రెడ్డి అతని ప్రభుత్వ దుశ్చర్యలు.. దుర్మార్గాలు.. అవినీతి..దోపిడీపై ఆలోచించి, వచ్చేఎన్నికల్లో వైసీపీ అభ్య ర్థులకు తగిన విధంగా బుద్ధిచెప్పాలి. ఓటు అనే కత్తితో 175 నియోజకవర్గాల్లోని వైసీపీ అభ్యర్థుల మెడలు నరికి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంది. చంద్రబాబు ఎక్కడున్నా..ఏంచేస్తున్నా ఆయన ఆలోచనలు ప్రజల చుట్టూనే తిరుగుతాయని తెలుసుకో కొడాలి. జగన్ రెడ్డి దెబ్బకు అతని తల్లి..చెల్లే రాష్ట్రం వదిలి పారిపోయారని వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తెలుసుకోవాలి.
గతంలో జగన్ తో అంటకాగి.. అతన్ని పొగిడినవారంతా అతని నిజస్వరూపం తెలుసుకున్నాక ఛీ కొడు తున్నారు. దివ్యాంగులు తమకు చేసిన అన్యాయానికి జగన్ కు ఎప్పుడు బుద్ధి చెబు దామా అని ఎదురుచూస్తున్నారు. కొడాలినాని ఇప్పటికైనా మనిషిలా ప్రవర్తించకపోతే వచ్చే ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గ ప్రజలు అతనికి సమాధి కడతారు.” అని గోనుగుంట్ల హెచ్చరించారు.