Suryaa.co.in

Andhra Pradesh

మంగళగిరిలో స్త్రీశక్తి కేంద్రాన్ని సందర్శించిన నారా బ్రహ్మణి

మహిళలతో మాట్లాడి వారికి అందుతున్న శిక్షణ గురించి అడిగి తెలుసుకున్న నారా బ్రహ్మణి

నారా లోకేష్ నెలకొల్పిన స్త్రీశక్తి ఎంతో మంది నుంచి ప్రశంసలు అందుకుంటుంది. మంగళగిరి మహిళలకు స్త్రీశక్తి ఎంతగానో దోహదపడుతుంది. ఇప్పటికే 47 బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు అందించడం జరిగింది. మంగళగిరి, తాడేపల్లి పట్టణాలతో పాటు దుగ్గిరాలలో ప్రతి రోజు 13 బ్యాచ్‌లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. నియోజకవర్గంలోని పేద మహిళల ఆర్థికాభివృద్ధే లోకేష్ లక్ష్యం

నిరంతరం మంగళగిరి అభివృద్ధి గురించే నారా లోకేష్ ఆలోచన. నియోజకవర్గ ప్రజల కోసం నారా లోకేష్ 27 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.మరో రెండు నెలల్లో మంగళగిరి రూపురేఖలు మారబోతున్నాయి.

 

LEAVE A RESPONSE