Suryaa.co.in

Andhra Pradesh

గొప్ప విజన్ ఉన్న నాయకుడు నారా లోకేష్ బాబు

పార్థసారధి ఆధ్వర్యంలో నూజివీడులో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు 41 వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మొదటిగా తెలుగుదేశం నాయకులతో కలిసి మంత్రి అడవి ఆంజనేయ స్వామి గుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సుమారు 10 వేలమంది నాయకులు కార్యకర్తలు మహిళలు యువతతో భారీ ర్యాలీ ప్రారంభించారు.

సుమారు 10 కిలో మీటర్ల మేర నగర ప్రధాన రహదారి నుండి ఈ ర్యాలీ కొనసాగింది మద్య మధ్య మధ్యలో కార్యకర్తలకు అభివాదం చేస్తూ కేక్ కత్తిరించి కార్యకర్తలకు పంపిణీ చేశారు . గాంధీ నగర్ నందన వనంలో ముగిసిన ర్యాలీ తరువాత భారీ కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలకు తినిపించి లోకేష్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,రాష్ట్ర విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన నాయకుల కార్యకర్తలకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ మన యువనాయకుడు నారా లోకేష్ బాబు పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ఒక పండగ అని మంత్రి పేర్కొన్నారు.

LEAVE A RESPONSE