Suryaa.co.in

Andhra Pradesh

యువతరానికి స్ఫూర్తి నారా లోకేష్

– గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ

గుంటూరు: యువనేత మానవ వనరులు, విద్య, ఐటి మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు గురువారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని ప్రభుత్వ అందుల వసతి గృహంలో కేకు కోసి అల్పాహారం అన్నదాన కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు.

జిల్లా తెలుగుయువత అధ్యక్షులురావిపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ.. కార్యకర్తల సంక్షేమమే ధేయ్యంగా రాజకీయాలలో అడుగులు వేసిన నారా లోకేష్ రాజకీయాలలో తనదయిన మార్కుతో ముందుకు సాగుతూ యువ గళ సారధిగా గత రాక్షస నియంత పైన పోరాడి నవ శఖానికి నాంది పలుకుతూ విద్యావ్యవస్థలో నవీన మార్పులతో యువతరానికి స్ఫూర్తిగా నిలిచిన వైనం స్ఫూర్తిదాయకమని అన్నారు. రానున్న రోజుల్లో నారా లోకేష్ దేశం గర్వించదగ్గ గొప్ప నేతగా ఎదగాలని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పేదప్రజల పెన్నిధిగా తిరుగులేని నేతగా ఎదగాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్, జిల్లా తెలుగుయువత ఉపాధ్యక్షులు గుత్తికొండ కిరణ్ యాదవ్,కార్యనిర్వాహక కార్యదర్సులు వేమా విజయ్ కాంత్, మన్నెం శ్రీనివాస్ రావు,గుంటూరు పశ్చిమ ప్రధాన కార్యదర్శి షేక్ ఇమ్రాన్, షేక్ ఇలియాజ్ , ఉపాధ్యక్షులు పప్పుల రాంబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి కోలా మల్లికార్జునరావు ,తూర్పు తెలుగుయువత కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీపతి రాంబాబు, తెలుగుయువత నాయకులు చిక్కాల శివరామ కృష్ణ, బుల్లా కుమార్ బాబు,యస్వంత్, శేషాద్రి సాంబశివరావు,బషీర్,నవీన్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE