జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆవిర్భావ దినోత్సవం

• తెలంగాణ ఈజిఎస్ ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేసిన మంత్రి ఎర్రబెల్లి
• తెలంగాణ ఈజిఎస్ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ
• దేశవ్యాప్తంగా ఉపాధిహామీ కింద తెలంగాణ ప్రభుత్వమే అత్యంత ప్రజోపయోగ పనులు చేసింది
• అన్ని వర్గాల సంక్షేమం కోసం సిఎం కేసిఆర్ నిత్యం కృషి చేస్తున్నారు
• పథకాలను విజయవంతం చేయాలి..సిఎం కేసిఆర్ ను కాపాడుకోవాలి
• రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

పేదలు, కూలీలు వలసలు వెళ్ల కూడదు, ఆకలికేకలు ఉండకూడదు, ఆత్మహత్యలకు పాల్పడకూడదనే సదుద్దేశ్యంతో వచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నేటికి సరిగ్గా 17 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటిసరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేడు మంత్రుల నివాసంలో తెలంగాణ ఈజీఎస్ ఉద్యోగులతో కలిస్ కేక్ కట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రజోపయోగ పనులు చేసిందని, దీనిని కేంద్ర ప్రభుత్వం స్వయంగా కొనియాడిందని, ఇందుకు ఉద్యోగులు, సిబ్బంది, కూలీలకు అభినందనలు తెలిపారు.

దేశవ్యాప్తంగా పేదలకు, కూలీలకు ఉపాధి హామీ అందిస్తున్న ఈ పథకాన్ని ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి కేంద్ర ప్రభుత్వం ఏటా నిధులకు కోత పెడుతూ నిర్వీర్యం చేస్తోందని తెలిపారు. రానున్న ఆర్ధిక సంవత్సరం 2023-24కు బుధవారం పార్లమెంట్ లో ఆర్ధిక శాఖామాత్యులు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో గ్రామీణ ఉపాధి పథకానికి 89వేల కోట్ల నుంచి 60వేల కోట్ల రూపాయలకు బడ్జెట్ తగ్గించారని, ఇది పేదల, కూలీల వ్యతిరేక కేంద్ర విధానాలకు నిదర్శనం అన్నారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల సంతోషం కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, వాటన్నింటిని విజయవంతం చేయడం కోసం భాగస్వాములంతా అంకితభావంతో పనిచేయాలని, ముఖ్యమంత్రి కేసిఆర్ని కాపాడుకోవాలని కోరారు. తెలంగాణ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్యోగుల క్యాలెండర్ 2023 ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించారు. కూలీలకు ఉపాధి కల్పించేందుకు పనిదినాలు పెంచాలని కేంద్రాన్ని కోరినట్లు వారికి తెలిపారు. కానీ కేంద్రం పనిదినాలు పెంచకుండా, నిధులు ఇవ్వకుండా కూలీల పొట్టగొడుతోందని, పేదల ఉసురుముడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలు, ఉద్యోగుల సంక్షేమానికి నిత్యం కృషి చేస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి సంఘం ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి, విజయవంతం చేసేందుకు చిత్తశుద్దితో కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో చైర్మన్- ఏ.లింగయ్య, కో చైర్మన్లు- అంజిరెడ్డి, విజయ్ కుమార్, వెంకట్రామిరెడ్డి, మోహన్ రావు, తంగేళ్ల రఘు, జానగిరి, చరణ్ సింగ్, సుదర్శన్ మరియు టి.సి.ఓస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply