ఒక పానీపూరీ బండి దగ్గర మెనూ ఇలా వుంది. ఇది హాస్య భరితంగా ఉంటుంది. ఆఖరి వరకూ చదవండి.
1) పానీపూరీ ~ 10 రూ.
2) స్పెషల్ పానీపూరీ ~ 12 రూ.
3) వెరీ స్పెషల్ పానీపూరీ ~ 15 రూ.
4) ఎక్స్ ట్రా స్పెషల్ పా పానీ పూరీ ~ 18 రూ.
5) డబల్ ఎక్స్ ట్రా స్పెషల్ పానీపూరీ ~ 20 రూ.
6) సండే స్పెషల్ పానీపూరీ ~ 25 రూ. ( ఆదివారం మాత్రమే).
ప్రతి ఒక్క పానీపూరి రుచి చూడటం కోసం, నేను ప్రతీ రోజూ ఒక్కో వెరైటీ తినడం మొదలు పెట్టాను.
కానీ అన్నీ తిన్నాక, అవన్నీ ఒకే రుచిగా వున్నాయనిపించింది. ఆఖర్న వాణ్ణి అడిగాను అన్నీ ఒకేలా ఉన్నాయి ఎందుకూ అని?
పానీపూరీ వాడు చెప్పాడు: పానీపూరీ రేటు ~ 10 రూ.
స్పెషల్ పానీపూరీ అంటే కడిగిన స్పూన్స్ ఇస్తాము .. 🍴
వెరీ స్పెషల్ పానీపూరీ అంటే కడిగిన ప్లేటు, స్పూన్ ఇస్తాము…🍽
ఎక్స్ ట్రా స్పెషల్ పానీపూరీ అంటే కడిగిన చేతులతో పానీపూరీ కడిగిన ప్లేట్లో పెట్టి కడిగిన స్పూన్ ఇస్తాము…
డబల్ ఎక్స్ ట్రా స్పెషల్ పానీపూరీ అంటే శుభ్రమైన త్రాగు నీరు ప్రత్యేకముగా ఇస్తాము..
మరి సండే స్పెషల్ అంటే ఏమిటి అని అడిగాను?
పానీపూరి వాడు నాకేసి చూసి ఇలా చెప్పాడు.:
“ఆదివారం… నేను స్నానం చేస్తాను.
– ఏ.వెంకటరాజు