Suryaa.co.in

Political News

25 లక్షల కోట్ల అప్పులను రద్దు చేసిన ఎన్డీయే ప్రభుత్వం!

– ప్రజా సొమ్ము రాబందుల పరం!

సూరత్ కి చెందిన సామాజిక కార్యకర్త సంజయ్ ఎజ్వా సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు ప్రతిస్పందిస్తూ , రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యంత ఆశ్చర్యకరమైన గణాంకాలను తెలియజేసింది.

మోడీ నాయకత్వంలోనీ ఎన్డీఏ ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాల కాలంలో దిమ్మె తిరిగేలా బడా కార్పొరేట్ సంస్థలు బ్యాంకుల నుండి తీసుకున్న 25 లక్షల కోట్ల రూపాయల అప్పులను రద్దు చేసింది.

ఎన్డీఏ ప్రభుత్వము 1 మరియు 2 కలిపి 9 సంవత్సరాలు (2014_15 నుండి 2022_23) మధ్యకాలంలో 10.41 లక్షల కోట్ల అప్పులు జాతీయ బ్యాంకుల ద్వారా మరియు షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల ద్వారా 14.53 లక్షల కోట్ల అప్పులను మొత్తం 24 లక్షల 94 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం అధికారికంగా రద్దు చేసింది.

ఈ అపారమైన మొత్తాలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం గుర్తించాల్సింది ఏమంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంక సమాచారం మాత్రమే వెల్లడించింది. ఎగవేత దారుల పేర్లను బయట పెట్టలేదు. ఏమైనా ఇది భారత ఆర్థిక చరిత్ర లో గుర్తుంచుకోవలసినటువంటి ముఖ్యమైన విషయము.

గత యూపీఏ 1 మరియు యూపీఏ 2 సంయుక్త ప్రభుత్వాల కాలంలో రద్దు చేసిన మొత్తానికంటే ఈ ఎన్ డి ఏ ప్రభుత్వం రద్దు చేసిన మొత్తం సుమారు 810% అధికంగా ఉన్నది. యూపీఏ ప్రభుత్వాలతో పోల్చి చూసినప్పుడు ఈ ప్రభుత్వం యొక్క రద్దు చేసిన మొత్తాల యొక్క తీవ్రత మనకు బాగా అర్థమవుతున్నది.

యూపీఏ 1 మరియు యూపీఏ 2 ప్రభుత్వాల2003_04 ఉండి 2013_14 మధ్య కాలంలో 11 సంవత్సరాల వ్యవధిలో ప్రభుత్వ బ్యాంకుల ద్వారా 1.58 లక్షల కోట్లు మరియు షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల ద్వారా 2.17 లక్షల కోట్లు మొత్తం కలిపి 3.76 లక్షల కోట్ల అప్పులను రద్దు చేసింది.

25 లక్షల కోట్ల రూపాయలు రద్దు చేసిన కారణంగా దీని యొక్క భారం మొత్తం సామాన్య పౌరులైన రైతులు మరియు కొద్ది మొత్తలు తీసుకునే అప్పుదారుల పైన పడుతుంది. ఈ అప్పుల రద్దు చర్యల వలన ఎవరైతే దేశంలో పెద్ద ఎత్తున అప్పులు తీసుకొని పెట్టుబడుదారులుగా చలామణి అవుతున్న ఆశ్రిత పెట్టుబడిదారులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది.

తెలియజేసిన వివరాల ప్రకారం షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు 2014_15 నుండి 2022_23 మధ్య 9 సంవత్సరాల కాలంలో ఎత్తివేసిన 25 లక్షల కోట్ల అప్పులో వాణిజ్య బ్యాంకులు కేవలం 2.5 లక్షల కోట్లు (10%} మాత్రమే తిరిగి వసూలు చేయగలిగాయి. ఇక్కడ ఒక క్లిష్టమైన ప్రశ్న ఏమంటే ప్రభుత్వము సమర్థవంతంగా ఎందుకు తిరిగి ఈ అప్పులను రాబట్టడానికి చర్యలు తీసుకోలేకపోతున్నది?

మొత్తం సంపదను పెద్ద పారిశ్రామికవేత్తలకు (లూటీ దారులకు) పంచి పెడుతూ అప్పులను వసూలు చేయడానికి ఫలవంతమైన చర్యలకు పూనుకోవడం లేదు. దేశంలోని ప్రజలు పూర్తిగా మేల్కొని చైతన్యవంతులు కాకుంటే దేశ ప్రజలు భారాలు మోస్తూ మరింతగా దిగజారి పోవాల్సి వస్తుంది .
(గుజరాత్ అనే ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు సంక్షిప్త తెలుగు అనువాదం .)

LEAVE A RESPONSE