నేటి యువతకు నేతాజీ జీవితం ఓ స్ఫూర్తిదాయకం

-బండి సంజయ్ 

భారత స్వాతంత్య్ర సమరయోధుడు, ఇండియన్ నేషనల్ ఆర్మీ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఢిల్లీలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం నేతాజీ చేసిన త్యాగాలను, సేవలను స్మరించుకున్నారు.

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో సుభాష్ చంద్రబోస్ పాత్ర ప్రత్యేకం, చిరస్మరణీయం. ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించి ఆంగ్లేయులతో తలపడిన గొప్ప చరిత్ర నేతాజీ సొంతం. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ దేశ రక్షణ కోసం దేనికవే ఆర్మీని తయారుచేసుకుని నేతాజీ బాటలో పయనిస్తున్నాయి. భారత
sanjay1 దేశ ప్రజలకు స్వేచ్ఛా-స్వాతంత్ర్యాలు కలగాలని ఎంతగానో కృషి చేసిన గొప్ప నేత. నేటి యువతకు నేతాజీ జీవితం ఓ స్ఫూర్తిదాయకం. ఆవేశం, ఆలోచన కలగలిసిన నేతాజీ మాట్లాడే ప్రతి మాటా ఓ తూటాలా ఉండేది. భారత స్వతంత్ర్య సంగ్రామంలో నేతాజీ నినాదాలు దేశ యువతను ఉర్రూతలూగించాయి. ప్రతి ఒక్కరిలో స్వాతంత్ర్యం సాధించాలనే తపపను రగిలించి దేశ ప్రజలకు ఏకతాటిపైకి తీసుకొచ్చిన మహనీయుడు. నాటి స్వతంత్ర్య పోరాటంలో నేతాజీ ఇచ్చిన సమర నినాదాలు దేశ యువతను యావత్తు ఉర్రూతలూగించాయి.

‘‘స్వాతంత్ర్యం ఒకరు ఇచ్చేది కాదు… తీసుకునేది’’…. ‘‘మీ రక్తం నాకు ఇవ్వండి… నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను’’… “ఓ ఆలోచన కోసం ఓ వ్యక్తి చనిపోతారు. ఆ వ్యక్తి మరణం తర్వాత ఆ ఆలోచన… మరింత మందిలో ప్రతిబింబిస్తుంది… అనే నేతాజీ నినాదాలు ఎప్పటికీ స్పూర్తిదాయకం. స్వాతంత్ర్య సమర యోధులకు ప్రత్యేక గుర్తింపునిచ్చేందుకు నేతాజీ వేడుకలను నరేంద్ర మోదీ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుండటం దేశ ప్రజలకు గర్వకారణం.

ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర ప్రత్యేకంగా 28 అడుగుల ఎత్తైన నేతాజీ గ్రానైట్ విగ్రహాన్ని ఆవిష్కరించడంపట్ల ప్రధాని నరేంద్రమోదీకి ప్రత్యేకంగా కృతజ్ఝతలు అన్నారు.

Leave a Reply