కొత్త కొత్తగా..!

Spread the love

తెలంగాణా లో బీసీ ముఖ్యమంత్రి..!
ఆహ్వానించదగ్గ నిర్ణయం..!
ఎస్సీ వర్గీకరణ..!
మాదిగల పోరాటానికి మద్దతు..!
మరింత మంచి హామీ..!

అయితే ఏనాడో పదేళ్ళ క్రితమే 2014 ఎన్నికల్లోనే బీసీ సంఘాల నాయకుడు ఆర్ .కృష్ణయ్య ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి, సేఫ్ సీటు ఇచ్చి గెలిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ..! నాయకుడు చంద్రబాబునాయుడు ..!
తర్వాత కృష్ణయ్య పార్టీ మారి చంద్రబాబు ని దుమ్మెత్తి పోసారు..అది వేరే కధ..!

అలాగే దాదాపు ఇరవై ఏళ్ళకు ముందే మాదిగల ఆకాంక్ష వర్గీకరణ చేసి అమలు చేశారు చంద్రబాబు . తర్వాత వచ్చిన ప్రభుత్వాలు న్యాయస్ధానాలు వంక తో ఆపేశారు. ఆ ఫలాలు అందుకున్న మాదిగ సోదరులు ఇప్పటికీ తలుచుకుంటారు.

అది ఇటీవల చరిత్ర..!
చరిత్ర చింపేస్తే చిరిగిపోదు..!
చెరిపేస్తే చెరిగిపోదు..!

ఒక్కరంటే ఒక్కరు మీడియా ప్రతినిధులు కాని.. రాజకీయ పక్షాల ప్రతినిధులు కాని ఈ విషయం ప్రస్తావించటం లేదు. అవగాహన లేకా? లేకపోతే అసలు ఆ విషయమే గుర్తులేదా..!? మరి ఉద్దేశపూర్వకమా..!?

పచ్చ ఛానల్ గా ముద్రపడిన ఛానల్ చర్చలు నిర్వహించే సీనియర్ జర్నలిస్టు..మోడరేటర్ ఎంతో ఎగ్జయిట్ అయిపోయారు ఈ హామీలు చూసి..! ప్రధాన ప్రత్యర్ధులైన కాంగ్రెస్ నాయకులు కూడా ప్రస్తావించటం లేదు.

అయితే అన్నిసార్లు అందర్నీ మోసం చెయ్యలేరు. నరేంద్ర మోడీ హామీలు..తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా తెలుసు. ఆ మాట కొస్తే దేశం మొత్తం తెలుసు.

దేశాన్ని పాలించే వారు.. మంచి పనులు చేసి అభివృద్ది చేసి..చట్టాన్ని- వ్యవస్ధల్ని తమపని తాము చేసుకునే అవకాశం కల్పించి, ప్రజాస్వామ్యాన్ని రక్షించి, ఓట్లు అడిగే పద్దతి వదిలేశారు.

కులము..మతము..ప్రాంతము..ఇవే ఎమోషన్స్.
దయచేసి దేశాన్ని కాపాడండి.
నెరవేర్చే హామీలివ్వండి.
ఇక మీదట మోసం చేయవద్దు.

లాస్ట్ బట్ నాట్ లీస్ట్..
మహబూబ్ నగర్ సభలో చంద్రబాబు చెయ్యి పట్టుకుని లాగి తన కుర్చీలో కూర్చోపెట్టిన మోదీ. ఆరోజున ఆదృశ్యం అపురూపం..
తర్వాత చంద్రబాబు పట్ల వారి వైఖరి జగద్వితం.
పురచ్చితలైవి జయలలిత ని పరామర్శించారు..ఆవిడ అక్కడ నుండి అటే సర్దుకున్నారు.
శశికళ తలనిమిరారు..ఓదార్చారు. కట్ చేస్తే ఆవిడ పరప్పన అగ్రహారంలో తేలారు.
కళైజ్ఞర్ కరుణానిధి..అనారోగ్యం పరామర్శించారు..ఏకంగా తన ఇంటికొచ్చి ఉండమన్నారు..పాపం ఆయన కానరాని లోకాలకెళ్ళిపోయారు.

ఒక్కటి గుర్తుంచుకోండి.. ఆ సారు..ఎవర్ని ప్రేమిస్తే వారికి మూడినట్టే..!

 అడుసుమిల్లి శ్రీనివాసరావు

 

Leave a Reply