కరిగిపోయే నిశి ..మెరిసిపోయే శశి

Spread the love

చంద్రకిరణాల జల్లులో ..
తడిసి మురిసేటి మనసులో ..
పున్నమై మెరిసిందిలే యామినీ ..
వెన్నెలై కురిసిందిలే ఆమనీ ..
వేసంగి హృదయాలలో ..
సంపంగి సౌరభం నిండే ..
ఆ నింగి లోని హరివిల్లులో ..
సప్తవర్ణాల సొగసు కనువిందే ..
నడిఝాము మేఘాలలో ..
చిరుగాలి పెత్తనమేమిటో
చల్లని రేయిలో పలకరింపుల
పరవశాలు పరచేటి హాయిలో
కరిగిపోయే నిశి ..మెరిసిపోయే శశి .

– రాధిక ఆండ్ర

Leave a Reply