Suryaa.co.in

Telangana

ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసిన హ్యాట్రిక్ కొట్టేది కేసీఆర్

కాంగ్రెస్ అంటేనే మాటలు, ముఠాలు, మంటలు
మళ్ళీ కెసిఆర్ రాకుంటే బిజినెస్ అవుట్ అని భయపడుతున్నారు
అమరావతి లెక్క హైదరాబాద్ అవుతుంది అని రియల్ ఎస్టేట్ వాళ్ళు అనుకుంటున్నారు
బిజెపి డక్ అవుట్, కాంగ్రెస్ రన్ అవుట్, కేసీఆర్ సెంచరీ
అందర్నీ కాపాడుకునే పార్టీ బి ఆర్ ఎస్
మంత్రి హరీశ్ రావు

తెలంగాణ భవన్ వేదికగా మంత్రి హరీశ్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన టిపిసిసి మాజీ సెక్రటరీ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, ఏఎస్ రావు నగర్ కార్పోరేటర్ సింగిరెడ్డి శిరీష, రవి కుమార్ ముదిరాజ్ (బిత్తిరి సత్తి), పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. గులాబి కండువా వేసి పార్టీలోకి స్వాగతం పలికిన అనంతరం మంత్రి హరీశ్ రావు.

ఈ సందర్భంగా హరీష్‌రావు ఏమన్నారంటే.. కాంగ్రెస్ అంటేనే మాటలు, ముఠాలు, మంటలు.రాష్ట్రంలో బలమైన నాయకత్వం ఉండాలా, బలహీనమైన నాయకత్వం ఉండాలాఇటువైపు బలమైన కేసీఆర్ ఉన్నడు, అవతలి వైపు ఎవరు ఉన్నారు? ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసిన హ్యాట్రిక్ కొట్టేది కేసీఆర్.కెసిఆర్ రైతుల ఎజెండా అయితే, వారిది బూతుల ఎజెండా.

బూతులు మాట్లాడటం చాలా సులువు, కానీ నీళ్ళు ఇవ్వడం, రైతు బంధు ఇవ్వడం, కరెంట్ ఇవ్వడం, అంబేడ్కర్ విగ్రహం కట్టడం కష్టం. బూతులు మాట్లాడేవాళ్ళు కాదు భవిష్యత్ నిర్మించే వాళ్ళు కావాలి.ఒకవైపు ఐటి పరిశ్రమలు, మరో వైపు వ్యవసాయం అభివృద్ధి చేసింది కేసీఆర్.నేడు నీళ్ళ కష్టం లేదు, కరెంట్ కోతలు లేవు.నాడు హైదారాబాద్ లో కరెంట్ కావాలని పారిశ్రామిక వేత్తలు ధర్నాలు చేశారు.

24 గంటల నిరంతర కరెంట్ ఇస్తున్నది కేసీఆర్.కరువు లేదు, కర్ఫ్యూ లేదు ఇక్కడ.హీరో సన్నీ డియోల్ వచ్చి ఇక్కడ అభివ్రుది గురించి ఆశ్చర్య పోయారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా హైదరాబాద్ న్యూ యార్క్ లెక్క అభివృద్ధి చెందింది అన్నడు.పక్కన ఉన్న రజీనీలకు అర్థం అవుతున్నది, కానీ ఇక్కడే ఉన్న గజినీలకు అర్థం కావడం లేదు.

మళ్ళీ కెసిఆర్ రాకుంటే బిజినెస్ అవుట్ అని భయ పడుతున్నారట. అమరావతి లెక్క హైదరాబాద్ అవుతుంది అని రియల్ ఎస్టేట్ వాళ్ళు అనుకుంటున్నారు.అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందింది. 7.7 శాతం గ్రీన్ కవర్ పెరుగుదల.6.6 మీటర్లు భూగర్భ జలాలు మీదకు వచ్చాయి.99 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల ఉత్పత్తి నుండి 2 కోట్ల 48 లక్షల ఉత్పత్తికి పెరిగింది.

కేటీఆర్ కృషి వల్ల ఐటి అద్భుతంగా అభివృద్ధి చెందింది. ఎక్కువ ఉద్యోగాల కల్పన జరిగింది.డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్. ప్రతి ఏటా పది వేల మంది డాక్టర్లను అందిస్తున్నాం.తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో నంబర్ వన్ గా ఉంది. ఉప్పల్, మేడ్చల్, మల్కాజ్ గిరి.. సహా హైదరాబాద్ అన్ని నియోజకవర్గాలు గెలిపించాలి. జిహెచ్ఎంసి లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవదు. అన్ని సర్వేలు ఇదే చెబుతున్నాయి. బిజెపి డక్ అవుట్, కాంగ్రెస్ రన్ అవుట్, కేసీఆర్ సెంచరీ కొడతారు.దక్షిణ భారత దేశంలో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డ్ కొట్టబోతున్నరు. కాంగ్రెస్ పార్టీ లాగా మోసం ఉండదు, ద్రోహం ఉండదు. అందర్నీ కాపాడుకునే పార్టీ బి ఆర్ ఎస్.

LEAVE A RESPONSE