చెల్లి
తల్లి
ఉండవల్లి…
ఎవరు తెరమీదకు వచ్చినా…
రామోజీరావుని తిట్టినా… పోలీసులను కొట్టినా…
ఇక నీ
టాపిక్ మళ్లింపు పథకాలేవి…
పనిచేయవు.
నువ్వు పుట్టిన ఊరు
నువ్వు కాపురం చేస్తున్న ఊరు
నువ్వు కాపురానికి వెళ్తానంటున్న ఊరు…..
అందరికీ తెలిసిపోయింది….
మీ బతుకులు ఒక నాటకమని.
మీ మాటలు నాటకమని.
మీ ప్రేమలు నాటకమని.
మీ దీక్షలు నాటకమని.
మీ కక్షలు నిజమని.
మీ హత్యలు నిజమని.
మీ రక్త చరిత్ర నిజమని.
మిమ్మల్ని నమ్మితే నాశనమని.
మానవజాతి చరిత్రలో రాక్షసులను నమ్మిన సందర్భాలు ఉన్నాయి.
అసమర్థులు ఏలిన రోజులు ఉన్నాయి.
కానీ….
చరిత్ర ప్రతి మలుపులో…
చలి చీమలు తిరగబడ్డాయి,
నియంతలను నిలువునా పాతేశారు,
జనం రక్తంతో నిర్మించిన రాజభవనాలను కూల్చేశారు,
వాళ్ల భవిష్యత్తుని వాళ్లే రాసుకున్నారు.
చరిత్రకు ఒక లక్షణం ఉంది…
ధర్మసంస్థాపన ఘట్టం….
ప్రతి మలుపులో పునరావృతం అవుతుంది.
రామాయణం సారాంశం అదే,
భారతం చెప్పిన పాఠం అదే,
ఫ్రెంచి విప్లవానికి ముగింపు అదే,
శ్రీలంక చరిత్రలో కొత్త పేజీ అదే,
అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ లో జరిగేది అదే.
