చదువుల కోసం ఎవరూ అప్పులపాలు కాకూడదు

-8 లక్షలమంది తల్లుల ఖాతాల్లోకి దాదాపు రూ. 912 కోట్ల రూపాయలను నేరుగా జమ
-పేదరికం సంకెళ్లు తెంచుకోవడానికి చదువే అస్త్రం
-నాణ్యమైన చదువుల కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం
-జగనన్న విద్యా దీవెనకు తోడుగా జగనన్న వసతి దీవెన
-ప్రైవేట్‌ విద్యా సంస్థలే ప్రభుత్వ పాఠశాలలతో పోటీ పడే పరిస్థితి తెచ్చాం
-నా తమ్ముళ్లు, చెల్లెళ్లు సత్య నాదేళ్లతో పోటీ పడే పరిస్థితి రావాలి
-అబద్ధాలు ఆడేవారిని, వంచకులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు
-రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో మీ దీవెనలు నాకు కావాలి
-జగనన్న వసతి దీవెన స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

అనంతపురం: పేదరిక సంకెళ్లను తెంచుకోవాలంటే అది చదువనే అస్త్రంతోనే సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. దాదాపు 9 లక్షల మందికి పైగా విద్యార్థులకు మంచి చేస్తూ.. దాదాపు 8 లక్షలమంది తల్లుల ఖాతాల్లోకి దాదాపు రూ. 912 కోట్ల రూపాయలను నేరుగా జమ చేస్తున్నామ‌ని చెప్పారు. చదువు ఓ కుటుంబ చరిత్రనే కాదు.. ఓ సామాజిక వర్గాన్ని కూడా మారుస్తుంది. చదువుల కోసం ఏ ఒక్కరూ అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదనే మా తాపత్రయం. ఈ నాలుగేళ్లలో నాణ్యమైన విద్య అందించే విధంగా.. విద్యా రంగంలో గొప్ప విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని సీఎం వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నారు. చదువుల కోసం ఎవరూ అప్పులపాలు కాకూడదు. చదువుల వల్ల జీవితాల్లో మార్పులు రావాలి. నాణ్యమైన చదువుల కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఐటీఐ విద్యార్థులకు రూ. 10 వేలు.. పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ. 15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ చదువుతున్న విద్యార్థులకు రూ. 20 వేలు అందిస్తున్నాం. ఇది జగనన్న విద్యాదీవెనకు తోడుగా అందిస్తున్న జగనన్న వసతి దీవెన అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. పీజు రీయంబర్స్‌మెంట్‌ పూర్తిగా విద్యార్థులకు అందిస్తున్నామని సీఎం వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నారు. గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడాలు ప్రజలు గమనించాలని సీఎం వైయ‌స్ జగన్‌ ఏపీ ప్రజలకు పిలుపు ఇచ్చారు.

పేదలు కూలీలు, కార్మికులుగా మిగలాలనే పెత్తందారి మనస్తత్వం గత ప్రభుత్వానిది. పేదలకు పెద్ద చదువులు అందించాలనేది మన ప్రభుత్వ లక్ష్యం అని సీఎం వైయ‌స్ జగన్‌ పేర్కొన్నారు. గవర్నమెంట్‌ విద్యాసంస్థలు ప్రైవేట్‌ విద్యాసంస్థలతో పోటీ పడే పరిస్థితి తెచ్చాం. గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు. పేద పిల్లలు ఎప్పటికీ పేదలుగానే మిగిలిపోవాలనుకున్న పెత్తందారి మనస్తత్వం గత ప్రభుత్వానిది. అందుకే బకాయిలు పెట్టి వెళ్లిపోయారు. కానీ, మన ప్రభుత్వం అలా కాదు. ప్రతీ మూడు నెలలకు తల్లుల ఖాతాలో నగదు జమ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చాక విద్యా రంగంలో డ్రాపవుట్ల సంఖ్య తగ్గిందని సీఎం వైయ‌స్ జగన్‌ గుర్తు చేశారు. జగనన్న వసతి దీవెన నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా.. బుధవారం అనంతపురం జిల్లా నార్సలలో ఏర్పాటు జరిగిన బహిరంగ సభలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రసంగించారు.

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగం ముఖ్యాంశాలు..
  • దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం
  • 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్లు జమ చేయనున్నాం
  •  చదువు ఒక కుటుంబ చరిత్రనే కాదు.. ఆ కుటుంబానికి చెందిన సామాజిక వర్గాన్నే మారుస్తుంది.
  • పేదరికం సంకేళ్లు తెంచుకోవడానికి చదువే అస్త్రం
  • చదువుల కోసం ఎవరూ అప్పులపాలు కాకూడదు
  • చదువుల వల్ల జీవితాల్లో మార్పులు రావాలి
  • నాణ్యమైన చదువుల కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం
  • జగనన్న విద్యా దీవెనకు తోడుగా జగనన్న వసతి దీవెన
  • ఐటీఐ విద్యార్థులకు ఏడాదికి రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు ఏడాదికి రూ.15 వేలు
  • డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్‌ విద్యార్థులకు రూ.20 వేలు అందిస్తున్నాం
  •  ఇది విద్యా దీవెనకు తోడుగా అందిస్తున్న వసతి దీవెన
  •  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పూర్తిగా విద్యార్థులకు అందిస్తున్నాం
  • గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు..బకాయిలు పెట్టి వెళ్లిపోయారు
  •  ప్రతి 3 నెలలకు తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం
  • పేదల పిల్లలు ఎప్పటికీ పేదలుగానే మిగిలిపోవాలనే పెత్తందారి మనస్తత్వం గత ప్రభుత్వానిది
  • ఈ ప్రభుత్వం వచ్చాక విద్యారంగంలో డ్రాప్‌ అవుట్ల సంఖ్య తగ్గింది
  •  ప్రభుత్వ స్కూళ్లు, ప్రైవేట్‌ స్కూళ్లతో పోటీ పడుతున్నాయి
  •  ప్రైవేట్‌ స్కూల్స్, ప్రభుత్వ స్కూళ్లతో పోటీ పడాల్సి వస్తోంది
  • గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడాను ప్రజలు గమనించాలి
  • గవర్నమెంట్‌ స్కూళ్లలో డిజిటల్‌ బోధన అందిస్తున్నాం
  •  ప్రభుత్వ పాఠశాలల్లో రోజుకో మెనూతో గోరుముద్ద అందిస్తున్నాం
  • 8వ తరగతి నుంచే విద్యార్థులకు ట్యాబ్‌లు అందిస్తున్నాం
  • 6వ తరగతి నుంచే డిజిటల్‌ బోధన అందిస్తున్నాం
  • ప్రైవేట్‌ విద్యా సంస్థలే ప్రభుత్వ పాఠశాలలతో పోటీ పడే పరిస్థితి తెచ్చాం
  • 2018–2019లో 87 వేల మంది ఇంజినీరింగ్‌ చదివేవారు
  • 2022–2023కు వచ్చేసరికి లక్షా 20 వేల మంది ఇంజినీరింగ్‌ చదువుతున్నారు
  • రూ. కోటి 20 లక్షల ఖర్చు అయినా సరే అని జగనన్న విదేశీ విద్యా దీవెన తీసుకొచ్చాం
  • ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఉన్నత విద్య చదివే వారి పెరిగింది
  •  యువతను ప్రపంచ స్థాయి లీడర్లను తయారు చేయాలనేది మా లక్ష్యం
  • నా తమ్ముళ్లు, చెల్లెళ్లు సత్య నాదేళ్లతో పోటీ పడే పరిస్థితి రావాలి
  • ఆత్మవిశ్వాసం, కామన్‌సెన్స్‌తో పాటు మంచి డిగ్రీ ఉంటే మీ చుట్టూ ప్రపంచం తిరుగుతుంది
  • నాలెడ్జ్‌ ఈజ్‌ పవర్‌..ఎడ్యుకేషన్‌ ఈజ్‌ పవర్‌
  • ఈ మధ్య ఓ ముసలాయన రిపబ్లిక్‌ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు..
  • రిప్లబిక్‌ టీవీ ఇంటర్వ్యూలో చంద్రబాబును చూసి పంచతంత్రం కథ గుర్తొచ్చింది.
  • వేటాడే శక్తి కోల్పోయిన పులి గుంటనక్కలను వెంటేసుకుని తిరిగినట్టు ఉంది
  • నేను సీనియర్‌ను ఇప్పుడు మంచోడ్ని అయ్యాను అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తారు
  • ఈ కథ చెప్పే నీతి ..అబద్ధాలు అడేవారిని, వంచకుడిని, వెన్నుపోటు పొడిచేవారిని, మాయమాటలు చెప్పేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు.
  • ఈ కథ వింటే మనకు చంద్రబాబు గుర్తుకు వస్తారు.
  • జాబ్‌ రావాలంటే బాబు రావాలని అంటున్నాడు. గతాన్ని గుర్తుకు తెచ్చుకోండి.
  • రుణమాఫీ పేరుతో రైతులకు వెన్నుపోటు పొడిచాడు. బ్యాంకుల్లో బంగారాన్ని వేలం వేశారు.
  • సున్నా వడ్డీ పథకాన్నే చంద్రబాబు రద్దు చేశారు.
  • కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పగలిగే ఘటికుడు చంద్రబాబు
  • ఇప్పుడు మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు ప్రజల్లోకి వస్తున్నారు
  • మాయ మాటలు చెప్పే చంద్రబాబు లాంటి వారిని నమ్మకూడదు
  • దోచుకో పంచుకో తినుకో అనేది చంద్రబాబు సిద్ధాంతం
  • చంద్రబాబుకు తోడుగా ఓ గజ దొంగల ముఠా ఉంది
  • ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీరికి తోడుగా దత్తపుత్రుడు..ఇది గజ దొంగల ముఠా
  • చంద్రబాబు అబద్ధాలను, మోసాలను నమ్మకండి
  • జగనన్న వల్ల మంచి జరిగిందా లేదా అనేది కొలమానంగా తీసుకోండి
  • నా నమ్మకం ..నా ధైర్యం మీరే..నా ఆత్మ విశ్వాసం ప్రజలే
  • మీ జగనన్న దేవుడి దయను ప్రజల ఆశీస్సులను మాత్రమే న మ్ముకున్నాడు
  • రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో మీ దీవెనలు నాకు కావాలి
  • శింగనమల నియోజకవర్గానికి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వరాల జల్లులు కురిపించారు.
  • సాగునీటి ప్రాజెక్టులకు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు
  • మరో మూడు నెలల్లో ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని సీఎం హామీ ఇచ్చారు

Leave a Reply