Suryaa.co.in

Andhra Pradesh

300కోట్లు కాదు.. యోగాంధ్రకు ఖర్చయింది రూ.75 కోట్లే!

– ఆ 75 కోట్లు కేంద్రం నుంచే వచ్చే నిధులు.
– యోగాంధ్రతో వైజాగ్ కి అంతర్జాతీయ గుర్తింపు
– వైసిపి తప్పుడు ప్రచారాలపై కఠిన చర్యలు

అమరావతి : యోగాంధ్ర కార్యక్రమంపై కొందరు వైసిపి బ్యాచ్ సుమారు రూ.300 కోట్లు ఖర్చు చేశారంటూ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఈ కార్యక్రమానికి అయిన మొత్తం ఖర్చు కేవలం రూ.75 కోట్లు మాత్రమే. ఈ నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే తిరిగి రాష్ట్రానికి వస్తాయి. ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయబడుతుంది.

వైజాగ్ లో నే ఎందుకు నిర్వహించారు ?

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో, అందునా ఉత్తరాంధ్రలోనీ వైజాగ్ లో నిర్వహించడం మనందరికీ గర్వకారణం. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఎంతో మంది విదేశీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. వైజాగ్ మరియు విజయనగరం మధ్య ఉన్న ప్రాంతాలన్నీ ఐటీ హబ్‌గా, టూరిజం హబ్‌గా మార్చాలనే దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్వహించారు.

తప్పుడు ప్రచారాలపై కేసులు

విశాఖపట్నానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే ఇలాంటి కార్యక్రమంపై తప్పుడు ప్రచారం చేయడం ఎంతమాత్రం సరికాదు. రాష్ట్ర ప్రతిష్ఠ, వైజాగ్ బ్రాండ్ దెబ్బతినేలా తప్పుడు ప్రచారాలు చేస్తున్న వైసీపీ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేయబడుతున్నాయి.

LEAVE A RESPONSE