Home » జగన్ ఉన్నంతవరకూ నన్నేమీ చేయలేరు: మంత్రి జయరాం ధీమా

జగన్ ఉన్నంతవరకూ నన్నేమీ చేయలేరు: మంత్రి జయరాం ధీమా

ఏదైనా మంత్రి జయరాం రూటే వేరు. వరస వెంట వరస ఆరోపణలెదుర్కొంటున్న ఆయనను తాజాగా సీఎం జగన్ పిలిపించారు. జగన్‌ను కలిసిన తర్వాత మంత్రి జయరాం చాలా ధీమాగా మీడియాతో మాట్లాడారు. జగన్ ఉన్నంత వరకూ తనను ఎవరూ ఏమీ చేయలేరని నిర్భయంగా చెప్పారు.
సీఎంగా జగన్ ఉన్నంతవరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని కార్మిక శాఖమంత్రి గుమ్మనూరి జయరాం స్పష్టం చేశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను జయరాం కలిశారు. అనంతరం జయరాం మీడియాతో మాట్లాడుతూ ‘‘దందాగిరీ చేయడానికి నేనేమీ అంతరాష్ట్ర స్మగ్లర్ వీరప్పన్‌ను కాదు. పోలీసులు ఖాళీ ఇసుక ట్రాక్టర్లు పట్టుకుంటే వదిలేయండి అని చెప్పిన మాట వాస్తవమే. నేను దౌర్జన్యంగా మాట్లాడలేదు.


నాపై బురదజల్లే కార్యక్రమం పెట్టుకోవద్దని అందరిని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రిని కలిశాను. కానీ నా నియోజకవర్గ సమస్యలపై మాత్రమే మాట్లాడాను. సీఎం సమావేశంలో ఇతర అంశాలు ప్రస్తావనకు రాలేదు. టీడీపీ నేత లోకేష్‌కు మాట్లాడే యోగ్యతే లేదు. నా నియోజకవర్గం కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. మద్యం సేవించేవారు అక్కడికి వెళ్లి మద్యం తెచ్చుకుంటున్నారు. మద్యం ఏరులై పారుతుంటే నేనేం చేయగలను’’ అనినిస్సహాయత వ్యక్తం చేశారు.

Leave a Reply