Suryaa.co.in

International

కెనడా హాలిఫాక్స్ లో అత్యద్భుతంగా ఘనంగా నోవా మల్టీఫెస్ట్ వేడుకలు

– తెలుగు భాషకి అత్యున్నత వైభవం, దేశ, విదేశాలకు పరిచయం

మనమంతా పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం కాదు, మేము ఎక్కడ ఉంటే అక్కడే పండుగ అంటూ మన సంస్కృతి సంప్రదాయాలను కెనడా లో చాటి చెబుతున్న మన భారతీయులు ముఖ్యంగా మన తెలుగు వారు.

విశాల్ భరద్వాజ్ వారి టీం భ్యారి, .టీనా సెలెస్ట్ ఆధ్వర్యంలో కెనడా NS లీడర్ పార్టీ లీడర్ మరియు యార్మౌత్ MLA జాక్ చర్చిల్, NDP లీడర్ క్లాజుడై చందర్ మరియు క్లేటొన్ పార్క్ MLA రఫా డీకోస్తాంజో ముఖ్య అతిథులుగా విచ్చేసిన నోవా మల్టీఫెస్ట్ సంబరాలు కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు. 8000 మంది ప్రజలు హాజరయ్యారు. హరి చల్లా మన దేశం / రాష్ట్రం తరఫున కార్య కలాపాలు నిర్వహించారు.

శ్రీహరి బృందం, ఫణి వంక , శివ మారెళ్ళ , చంద్రా తాడేపల్లి, వెంకట్ వేలూరి , శ్రీనివాస చిన్ని, పృద్వి కాకూరు , .క్రిష్ట్న వేణి , రత్నం , జయ , ప్రియాంక ,లావణ్య , .శ్రీలేఖ, .జనని కృష్ణ్ణ , జ్యోత్స్నా శ్రీజ , కుమారి.దీపీకా కర్ణం, కుమారి.జయశ్రీ కర్ణం, కుమారి.సియ శ్రీ శివకుమార్, చిరంజీవి.రిషిన్త్ శివకుమార్ చిరంజీవి.శిబి నాన్తం ఆట్రియం & చిరంజీవి.రోహిత్ సాయి చల్లా పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వర్తించారు.

కెనడా లో హాలిఫాక్స్ నగరంలో జరిగిన “నోవా మల్టీఫెస్ట్” సంబరాలలో మన తెలుగు వారు మరియు ఇతర రాష్ట్రాల వారు కలిసి మన పండుగలు (ఉగాది,- తెలుగు కొత్త సంవత్సరం, కర్వా చౌత్(అట్ల తదియ), రాఖీ -రక్షాబంధన్, తెలుగు పండుగ సంక్రాంతి(ముగ్గులు, గాలిపటాలు, ధాన్యం, పాలు కలిపి వండిన నైవేద్యం); మరియు దీపావళి( దీపాల వరుస,ఆనందం, విజయం, సామరస్యానికి గుర్తుగా జరుపుకునే పండుగలు) వాటి ప్రాముఖ్యతను కెనడా వాసులకి వివరించి కన్నుల విందు చేశారు.

వాతావరణం అనుకూలించక మా నోవా మల్టీఫెస్ట్ సంబరాలు ఒక్క రోజు మాత్రమే జరిగింది, ఐన నూ 8000 మంది వేడుకలలో పాల్గొనడం విశేషం. వివిధ భాషలు, వివిధ సంస్కృతులు నివాసమైన కెనడా వాసులు మన పండుగలు విశేషాలను బాగా అర్థం చేసుకొని, అభినందించారు. రెండు రోజులు హోరున వర్షాలు ఈదురు గాలులు, మూడవ రోజు వాతావరణం అనుకూలించడం వలన వేడుకలు ఘనంగా జరిగాయి. కెనడా వాసులలో మన ఇండియా పండుగల ప్రాముఖ్యత గుర్తించి ఎనిమిది వేలకు పైగా పాల్గొని ఘన విజయం సాధించింది.

కెనడా హెలి fax – సుప్రజ మాట్లాడుతూ ఏ దేశమేగినా ఎందు కాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని అంటూ, మన ప్రాచీన కళలైనటు వంటి భరతనాట్యం ( కుమారి.జనని కృష్ణ్ణ ), కూచిపూడి (కుమారి .జ్యోత్స్న శ్రీజ చల్లా), కర్రసాము (చిరంజీవి.శిబి నాన్తం ఆట్రియం ) మరియు జానపద నృత్యాలతో (కుమారి.దీపీకా కర్ణం కుమారి.జయశ్రీ కర్ణం ) కెనడా ప్రజలను ఆశ్చర్య చకితులను చేసింది. అలాగే మన సాంప్రదాయ వస్త్రాలతో కెనడా వాసులని అలంకరించింది.వివాహ భోజనంబు వింతైన వంటకంబు అంటూ రకరకాల దేశాల వారి విందు భోజనాలు అందరూ ఆరగించారు.

 

LEAVE A RESPONSE