నోవాటెల్ టు నోవాటెల్

66

అత్తారింటికి దారేది..
మాంగారింట్లో దూరేది..
ఈ ఇద్దరికీ ఒకరే దాయాది..
జనదేశమా..
దేశసేనా..!
చంద్రపవనాలా..
పవనచంద్రమా..
కలిసొచ్చే కేంద్రమా..
కలిస్తే జనసంద్రమా..!

మొత్తానికి గర్జన..
అధికారపార్టీకి
తార్మార్ తక్కర్మార్!

ఆరడుగుల బుల్లెట్టు..
డెబ్బై మూడేళ్ల రాకెట్టు
అధికారపక్షమేగా
టార్గెట్టు!

విశాఖలో మొదలైన చిచ్చు
నోవాటెల్ టు నోవాటెల్
రాజకీయ ‘కాక’టైల్..
గ్లాసులో సైకిలా
సైకిలెక్కిన గ్లాసా…
అదే ఢంకాపలాసా..!
మిషన్ ఎలక్షన్స్..
సరికొత్త ఫిక్షన్స్..!!

ఈఎస్కే..