Suryaa.co.in

Andhra Pradesh

అది అసెంబ్లీనా లేక గొడ్ల చావిడా?

ఇక్కడెవరూ చేతులు కట్టుకుని కూర్చోలేదు
-మా జోలికొస్తే ఖబడ్దార్ –నందమూరి బాలకృష్ణ
– రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై మీడియా ముందుకు నందమూరి కుటుంబం
– అసెంబ్లీలో నారా భువనేశ్వరి గారిపై వైసీపీ నేతల దూషణలను, వారి ప్రవర్తనా తీరును ముక్తకంఠంతో ఖండించిన నందమూరి కుటుంబసభ్యులు
– మా కుటుంబం గురించి మాట్లాడేవాడు ఎవడైనా సరే వదిలిపెట్టమని హెచ్చరిక
నందమూరి బాలకృష్ణ, టీడీపీ హిందూపురం శాసనసభ్యులు
ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు నన్నెంతో బాధించాయి.అక్కడ జరిగిన ఘటనలు దురదృష్టకరం. ప్రజల దృష్టిని మరల్చేందుకు వ్యక్తిగత దూషణలకు వ్యక్తిత్వహననానికి పాల్పడ్డారు. చంద్రబాబు కంటతడిపెట్టడం బాధాకరం. అసెంబ్లీలో పాలకపక్షం, ప్రతిపక్షం మధ్య వాదోపవాదాలు సహజంగా జరిగేవే. ప్రతిపక్షంలోఉన్న మేము సూచనలు, సలహాలు ఇవ్వడం.. వారికి నచ్చితే స్వీకరించడం అనేది ఎప్పుడూ జరిగేదే. వారికి మాకు సవాళ్లు..ప్రతిసవాళ్లు అనేవి ఆనవాయితీగా వస్తున్నవే. కానీ అందుకు విరుద్ధంగా వ్యక్తిగత విమర్శలకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
శాసనసభలో మహిళా శాసన సభ్యురాళ్లు కూడా ఉన్నారు. వారందరూ కూడా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులే. మాఇంట్లోని వారు కూడా శాసనసభ్యులుగా ఉండొచ్చు..కానీ ఎప్పుడూ కూడా ఇష్యూ బేస్డ్ గానే చర్చ జరగాలి. దానికి విరుద్ధంగా మా సోదరి భువనేశ్వరిగారి మీదకు పర్సనల్ గా వెళ్లడం చాలా దురదృ ష్టకరం. అసెంబ్లీలో వారు మాట్లాడిన భాష, ఆంగికం, ఆహార్యం, వాచకం చూస్తే, గొడ్లచావిడిలోఉన్నామా..లేక అసెంబ్లీలో ఉన్నామా అనే అనుమానంకలిగింది. భువనేశ్వరి గారికి సమాజంలో గౌరవప్రదమైన స్థానముంది.
రాజకీయాలతో సంబంధంలేకుండా, తనపనితాను చేసుకునే వ్యక్తి ఆమె. ఆమె హెరిటేజ్ ను నడుపుతున్నారు… మొన్న కూడా హిందూపురానికి హెరిటేజ్ తరుపున కంప్యూటర్స్, ప్రొజెక్టర్లు పంపారు. ఇప్పుడు మాట్లాడుతున్నవారు ఎవరైనా ఇలాంటిపనులుచేశారా? రాష్ట్రాభివృద్ధిగురించి వదిలేయండి, మామూలుగా ప్రజలకు చేయాల్సినవి ఎప్పుడైనా చేశారా..చేస్తున్నారా? దోచుకున్న సొమ్ముని ఇళ్లలోకి చేర్చడం తప్ప, ఇలాంటివి వాళ్లకు పట్టవు. వారి మాటలు విని వారిళ్లలోని ఆడవాళ్లే చీదరించుకుంటున్నారు. కావాలంటే వారే వెళ్లి, ఇంట్లోవాళ్లతో మాట్లాడమనండి.
ఇక్కడ ఎవరూ ఊరికే చేతులు కట్టుకొని కూర్చొనిలేరు. మాఇళ్లలోని ఆడవాళ్ల జోలికివస్తూ, పర్సనల్ గా టార్గెట్ చేసి మాట్లాడితే ఊరుకోం. వాళ్ల ఫ్యామిలీలో కూడా చాలా ఉన్నాయి. వాళ్ల ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూలో , వాళ్ల ఫ్యామిలీ వ్యక్తి ప్రమేయం ఉందనే అనుమానం ఉందని ఆ ఇంట్లోని మనిషేచెప్పారు. దటీజ్ దా ఇష్యూ. ఆచనిపోయిన వ్యక్తి కూడా ఒకప్పుడు ప్రజాప్రతినిధే. దానిగురించి బయట కు వస్తుందని ఏవేవో అంటూ నోరుపారేసుకుంటారా? అక్కడ అసెంబ్లీలో ఉన్నవాళ్లలో లాయర్లు, డాక్టర్లు అందరూ ఉన్నారు. వారు కూడా భయంతో బయటికి చెప్పుకోవడం లేదు…ఏంటి ఇలా జరుగుతోందని వాపోతున్నారు. మళ్లీ మళ్లీ చెబుతున్నాను.
మమ్మల్ని అడ్డుకోవడానికి చేసే ఎలాంటి కుట్రలనైనా తిప్పికొడతాం. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంపై దాడిచేశారు. ఇది వరకే ఈ ధోరణిపై మేము మాట్లాడుకున్నాం. ఇకపై జరిగే వాటికి, మాట్లాడేవాటికి ఊరుకునేది లేదు. మైండ్ గేమ్ ప్లే చేస్తున్నామని మీరు అనుకుంటున్నారు. పదవులు, అధికారం శాశ్వతం కాదు. ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు. ప్రభుత్వఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి కల్పించారు. ఆర్థికపరిస్థితిపై చంద్రబాబునాయుడుగారు ప్రణాళికాబద్ధంగా ముందుచూపు తో వ్యవహరించారు. మెజారిటీ ఉందికదా అని విర్రవీగి ఇష్ట మొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు.
ఇకపై చంద్రబాబు నాయుడి గారి అనుమతి అవసరంలేదు. ఆయన మీకు ఇచ్చే గౌరవాన్నిచూసి ఆగాము. మీకు మంచి సలహాలిస్తే, ప్రజల అవసరాలు తీరతాయనిభావించి, ఆయన మీకు ఒకపెద్దరికాన్నిఅంటగట్టారు. ప్రజలు, నా అభిమానులు, పార్టీ కార్యకర్తల తరపున ఇదే నా హెచ్చరిక. మరలా ఇలాంటి నీచ నికృష్ట పాపిష్ట,కల్మష్ట భూయిష్టమైన పదాలు వాడారంటే సహించేది లేదు. మీ అందరి భరతం పడతాం…ఖబడ్దార్. ఆరోగ్యకర వాతావరణం లేకుండా అసెంబ్లీని నాశనంచేశారు.
నేనూ ఎమ్మెల్యేగా హిందూపురం అభివృద్ధికి సంబంధించిన పనులను అడుగుతాము. అంతేగానీ రామారావు గారి అబ్బాయిగా, చంద్రబాబుగారి వియ్యంకుడిలా ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఇకపై ఆలోచించి మాట్లాడటం నేర్చుకోండి. ఎలా పడితే అలా మాట్లాడితే, మీరు అడ్డుపెట్టుకున్న వ్యవస్థల గోడలను పగల గొట్టుకొని వచ్చీ మరీ మీకు బుద్ధిచెబుతాం…జాగ్రత్త ఖబడ్దార్. అసెంబ్లీ హుందాతనాన్ని కాపాడండి.. మిమ్మల్ని మీరు కాపాడుకోండి.
లోకేశ్వరి:
ఇలా మీడియాతో మాట్లాడటం ఇదే తొలిసారి. ఇలాంటి సంఘటన మా కుటుంబంలో ఎప్పుడూ జరగలేదు. నా లెక్కలో అయితే అసెంబ్లీ ఒకదే వాలయంతో సమానం. ఎందుకంటే అక్కడ ప్రజల సమస్యలు, రాష్ట్ర సమస్యలపై ఇరుపక్షాలు చర్చించుకొని ఒక నిర్ణయానికి వస్తాయి. అలాంటిది ఇష్టానుసారం మాట్లాడుతూ, దాన్ని అపవిత్రం చేస్తున్నారు. చంద్రబాబునాయుడి లాంటి వ్యక్తి విలపిస్తుంటే, చూడలేకపోయాం. మా చెల్లెలి బాధ చూడలేకపోతున్నాం. ఆయన హాయాంలో ఏనాడూ విజయమ్మ గారిని, భారతిగారిని, షర్మిలగారిని పల్లెత్తుమాట ఆయనా అనలేదు.. తన పార్టీవారిని అననివ్వలేదు. కానీ వీళ్లు ఇలా మాట్లాడటం చాలా తప్పుండీ. ఎందుకలా చేశారో అర్థంకావడం లేదుకూడా. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉంటే మంచిదని చెబుతున్నాం. మాలో కూడా రామారావు గారి, బాలకృష్ణగారి రక్తమే ఉంది… గుర్తుంచుకోండి.
నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ కుమారుడు:
రెండుమూడేళ్లుగా రాష్ట్రంలోని పరిస్థితుల్ని చూస్తున్నాం. రాజకీయం, వాటి తాలూకా పర్యవసనాలు, పరిణామాలు చూస్తుంటే చాలా బాధేస్తోంది. దేవాలయం లాంటి నందమూరి కుటుంబంపైకి రావడాన్ని మేం సహించం. చూస్తూ ఊరుకోం కూడా. ఎవడైనా గానీ, వాడు ఎవడైనా గానీ.. అన్నయ్య బాలకృష్ణ చెప్పినట్లు ఇలాంటి ఘటనలు జరగడం క్షమించరానిది. మా ఆడపడుచుకు జరిగినట్లు ఎవరికీ జరగకూడదు. పరిస్థితి రాబట్టే పేర్లుచెప్పా ల్సి వస్తోంది. ఒరేయ్ నానీగా, వంశీగా, అంబటి రాంబాబు.. ఒరేయ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జాగ్రత్తగా ప్రవర్తించండి.. ఇది హెచ్చరిక కాదు హద్దులమీరి ప్రవర్తించారు. మీ భవిష్యత్ ఎలా ఉంటుందో మీకే తెలియదు. మీ ఇళ్లల్లో ఆడవాళ్లు ఉన్నారు. వారు మీ గురించి ఏమనుకుంటున్నారో ఆలోచించండి.
ఒక్కసారి వారి గురించి, వారి భవిష్యత్ గురించి ఆలోచించుకోండి. ఇంకోసారి దేవాలయం లాంటి నందమూరి కుటుంబం జోలికి వస్తే బాగుండదని చెబుతున్నాం. రాజకీయంగా ఉంటే అదే పద్ధతిలో చూసుకోండి. కానీ ఇలాంటి వ్యాఖ్యలు ఎన్నడూ ఎరుగం. మేం గాజులు తొడుక్కొని కూర్చో లేదు. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు తెలుగు దేశం పార్టీని స్థాపించారు. ఆపార్టీకి ఆయన ఒకక్రమశిక్షణ పెట్టారు. దాన్నే మేం పాటిస్తున్నాం. మా సహనాన్ని పరీక్షించకండి. మీరు హద్దులుమీరితే మేమూ మీరతాం. ఇటువంటి సంఘటనలు మరెప్పుడూ, ఎవరి కుటుంబంలో నూ జరగకూడదని హెచ్చరిస్తున్నాం..జాగ్రత్తగా ఉండండి. మా అక్క భువనేశ్వరిగారి జోలికొస్తే, రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పాల్సిన పనిలేదు. రావణాసురుడికి పట్టిన గతే మీకు పడుతుందని గుర్తుంచుకోండి.
వసుంధర, బాలకృష్ణ సతీమణి:
ఏది వినకూడదో, ఏది మాట్లాడకూడదో అవన్నీ మాట్లాడాల్సి వస్తోంది. మేం నిజంగా చాలా బాధపడుతున్నాం. రాముడికి సీతాదేవి ఎలానో, చంద్రబాబునాయుడి గారికి భువనేశ్వరి గారు అలా. నందమూరి కుటుంబానికి భువనేశ్వరిగారు శ్రీ రామరక్ష. అలాంటి మనిషి గురించి మాట్లాడినవారికి, వారి ఇళ్లల్లోని ఆడవాళ్లే సమాధానంచెప్పాలి. దేవుడే వారికి తగినవిధంగా సమాధానంచెబుతాడు.
నందమూరి సుహాసిని, స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి కుమార్తె:
ఇవాళా చాలా బాధాకరమైన రోజు. మా అత్తగారు భువనేశ్వరి గారి మీద ఇటువంటి స్కాండిల్స్ చేయడం బాధాకరం. ఆమె ఏరోజూ పాలిటిక్స్ లో కలుగచేసుకోలేదు. మా ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉంటూ, బిజినెస్ లు చూసుకుంటూ ముందుకెళ్లారుగానీ, ఏ రోజు రాజకీయాలు, ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోలేదు. తెలుగు ప్రజలు నందమూరి తారకరామారావుగారిని అన్నా అని పిలుచుకుంటారు. అలాంటి వ్యక్తి బిడ్డ గురించి మాట్లాడటం చాలా బాధగా ఉంది.
రాజకీయం రాజకీయనేతల మధ్యనే ఉండాలి. కానీ ఫ్యామిలీలు, ఫ్యామీలీలోని వారిగురించి తప్పుగా మాట్లాడటం సరికాదు. రాజకీయంగా పోరాడటం, వాదించడం ఒకెత్తు.కానీ ఫ్యామిలీలను తీసుకురావడం ముమ్మాటికీ క్షమించరానిది. తెలుగువారందరూ ఇప్పుడుజరిగిన దాన్ని ఖండించాలి. రామారావు గారు మహిళలకు ఎంత ప్రాముఖ్యతఇచ్చారో అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి కూతురుగురించి, నేడుఇలా మాట్లాడటం అందరికీ అవమానమే.
నందమూరి చైతన్యకృష్ణ:
కొడాలినానీ, వల్లభనేని వంశీ లాంటి వాళ్లు రాజకీయలబ్ధి కోసం ఇలా నీచాతినీచంగా మా అత్తగారి గురించి మాట్లాడటం, మా అత్తని బలిపశువుని చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా అత్తలు భువనేశ్వరి, లోకేశ్వరి, పురంధేశ్వరిల గురించి మీకేం తెలుసు? మా తాతగారు, నందమూరి తారకరామారావు గారు తనబిడ్డలను చాలాపద్ధతిగాపెంచారు. తెలుగుఆడపడుచులు ఎలా ఉండాలో వారు అలా ఉంటారు. వారిని, వారి బిడ్డలైన మా అక్కలనుచూసి ఎలాఉండాలో మేం నేర్చుకు న్నాం. అందరూ సాంప్రదాయంగా ఉంటారు. ఇతరుల్లా తిరగడం, మందుతాగడం వంటి పనులు చేయలేదు. మా అమ్మ, మా నాన్న, మా అత్తలు, అక్కలు సాంప్రదాయం, అభిమానంతో వ్యవహరిస్తారు. ఇంటికి వచ్చేవారితో మర్యాదగా, పద్ధతిగా మాట్లాడతారు.
అలాంటి కుటుంబంలోని ఆడబిడ్డ భువనేశ్వరిగారి గురించి మాట్లాడ తారా? రాజకీయాలు చేయాలి..ఎలాచేయాలో అలాచేయాలి. కానీ మహిళలను కించపరిచేలా మాట్లాడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. మా తాతగారు సినీరంగంలోఉన్నప్పుడు, రాజకీయాల్లో ఉన్నప్పుడు మహిళలకు చాలా విలువ, ప్రాధాన్యతఇచ్చేవారు. కట్నంఅడగడాన్ని, కట్నంకోసం వేధించడాన్ని నిరసిస్తూ, తాతగారు వరకట్నం అనేసినిమా ను తీశారు. సావిత్రిగారుప్రధాన పాత్రలో కోడలుదిద్దిన కాపురం అనే సినిమాతో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు చూపించారు. మహిళలను ముందుం డేలా ఆయన ప్రోత్సహించారు.
ఆడవాళ్లను వెన్నుతట్టి ప్రోత్స హించాలిగానీ, ఏమిటా మాటలు? పోలికలగురించి మాట్లాడ తారా..సిగ్గులజ్జా ఉన్నాయా వాళ్లకు. అదేనా మాట్లాడేది? రాజకీయాల్లోఉన్నవాళ్లు యువతకు, మరీ ముఖ్యంగా మహిళలకు ఉపాధికల్పించాలి. ఇలాంటి మాటలు వింటే మహిళలు రాజకీయాల్లోకివస్తారా? నోరుమూసుకొని ఇంట్లో కూర్చుంటారు. చంద్రబాబునాయుడు గారు మహిళలు వారి కాళ్లపై వాళ్లు నిలబడాలని డ్వాక్రాగ్రూపులను తీసుకొచ్చారు. మా బాబాయిగారైన హరికృష్ణ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీలో మహిళలకు రిజర్వేషన్లు పెట్టారు.
అలా ఏవైనా మహిళలకు ఉపయోగపడేలా చేయండి. మా అత్తయ్య గురించి వల్లభనేని వంశీ, కొడాలినానీ, అంబటి రాంబాబులు నీచాతినీచంగా మాట్లాడారు. సామాన్య మహిళలను కూడా కించపరిచేలా మాట్లాడుతున్నారు.. అది చాలాతప్పు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ప్రకటనను డిమాండ్ చేస్తున్నాం. జరిగిన దానిపై మీరు కూడా క్షమాపణచెప్పాలి. కొడాలినానీని మంత్రిపదవినుంచి బర్తరఫ్ చేయాలి. అతను మినిస్టర్ గా కొనసాగడానికి అనర్హుడు.
గారపాటి శ్రీనివాస్:
మా కుటుంబసభ్యులంతా చాలా సంతోషకరమైన రోజుల్లోనే కలుస్తాము. కానీ రాజకీయాలు ఇంతగా దిగజారిపోయి, ఇలా అందరంమాట్లాడాల్సి వచ్చినందుకు చాలాచాలా బాధగా ఉంది. 2019లో వైసీపీ అధికారం లోకి వచ్చినప్పుడు, ప్రజలు ఎంతో ఆశించారు. యువ ముఖ్యమంత్రి, అతనికి ఒక్కఅవకాశమిస్తే ఎలాఉంటుందో అని అవకాశమిచ్చారు. ఎవరైనా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారుగానీ, ఎడారిలాఎందుకూ పని కిరాకుండా చేస్తారని అనుకోలేదు. ఎన్టీఆర్ గారి ఆశీస్సులతో సినీ, రాజకీయరంగాలను చూస్తున్నాం. అసెంబ్లీలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదు. కానీ భువనేశ్వరి గారి పేరుఎత్తి, చంద్రబాబునాయుడిగారితో కన్నీళ్లుపెట్టించారు. అసలు మీరుఏమనుకుంటున్నారో చెప్పండి… కుటుంబస భ్యులమైన మేంకాదు.. 5కోట్ల మందిప్రజలు అడుగుతున్నారు.
రెండున్నరసంవత్సరాలనుంచి ఏం అభివృద్ధిచేశారో ప్రజలముందు పేపర్లుపెట్టండి. అమరావతి ఏమైంది.. పట్టిసీమ పోలవరం ఏమయ్యాయి. ఒక్క బిజినెస్ ఆర్గనైజేష న్ అయినా ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చారా? రెండున్నర సంవత్సరాలైంది..ఏంచేశారు? ఇవన్నీ వదిలేసి అసెంబ్లీలో లేని వ్యక్తులు, అదీమహిళల గురించి మీరుఅంటే బాధగా ఉండదా? వైసీపీలో కూడా మహిళలుఎమ్మెల్యేలుగా , మంత్రులుగా ఉన్నారు. అలాంటి పార్టీలో మహిళలకు ఇచ్చే గౌరవం ఏమిటో 5 కోట్ల ఆంధ్రప్రజలకు అర్థమైంది. మేం హెచ్చరించడంకాదు.. మర్యాదగానే చెబుతున్నాం.
కొడాలి నానీ, అంబటిరాంబాబు, రోజాగారికి చెబుతున్నాం. నందమూరి తారకరామారావు గారి వారసులిగా, తెలుగుదేశం పార్టీ అనే పెద్ద కుటుంబసభ్యులుగా చెబుతున్నాం. ఇప్పుడు మీ టైం నడవచ్చు. సిగ్గులేకుండా ఇప్పటికీ చంద్ర బాబునాయుడుగారు కట్టిన అసెంబ్లీలోనే కూర్చొని మాట్లా డుతున్నారని గుర్తుంచుకోండి. వైసీపీ నేతలందరినీ హెచ్చరిస్తున్నా. వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోండి. మరీ ముఖ్యంగా మహిళలను అనడంతో మీ స్థాయి ఏమిటో మీరే ఆలోచించుకోండి.

LEAVE A RESPONSE