రాజకీయాలకు సంబంధంలేని మహాతల్లిని ఎక్కడైతే అవమానపరిచారో, అక్కడే తేలుస్తాం

– వివేకాహత్యకేసుతో ముఖ్యమంత్రికి సంబంధంలేకుంటే, రక్తపుమరకలు తుడవడం, సాక్ష్యాధారాలు తారుమారుచేయించడం, సీబీఐ విచారణకోరి తరువాత వద్దనడం, సిట్ అధికారులను మార్చడం వంటిపనులు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయించాడు?
– రూ.40కోట్ల సుపారీఇచ్చి హత్యచేయించగల ధైర్యం పులివెందులలో వై.ఎస్.కుటుంబానికి తప్ప మరొకరికి ఉంటుందా?
• కూలీడబ్బులకోసం ఖూనీలుచేసే వల్లభనేని వంశీ, నానీ,ద్వారంపూడి ల కుటుంబాలచరిత్రపై తాము మాట్లాడితే గుండెలుపగిలి ఛస్తారు.
• నీచమైన వారి జన్మరహస్యాలను వారి కుటుంబాలచరిత్రను మేం బయటపెడితే, తట్టుకోలేరు.
– టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్.ఎస్.రాజు
మా అధినేత కన్నీటికి కారకులైనవారికి రక్తకన్నీరు తెప్పించే తీరుతాం. ఏ జెండాలనైతే మోస్తున్నామో అవే జెండాలను తిరగేసి ఆపసుపుజెండాకర్రలతో ద్వారంపూడి వంటివారికి బుద్ధిచెప్పితీరుతాం. పసుపుజెండాలకర్రలతో వైసీపీనేతల వీపులు వాయిస్తాం.
పేర్నినాని, కొడాలినానీ, అనిల్ కుమార్, అంబటి రాంబాబులు భువనేశ్వరిని హేళనచేయలేదంటున్నారు సిగ్గులేని వెధవలు. రాజకీయాలకు సంబంధంలేని మహాతల్లిని ఎక్కడైతే అవమానపరిచారో, అక్కడే తేలుస్తాం.
కూలీడబ్బులకోసం ఖూనీలుచేసే వల్లభనేని వంశీ, నానీ,ద్వారంపూడి ల కుటుంబాలచరిత్రపై తాము మాట్లాడితే గుండెలుపగిలి ఛస్తారు. నీచమైన వారి జన్మరహస్యాలను వారి కుటుంబాలచరిత్రను మేం బయటపెడితే వెధవలు తట్టుకోలేరు.
నిన్నటిరోజున అసెంబ్లీలో జగన్ మాట్లాడుతూ, వివేకానందరెడ్డిహత్యపై తమచేత్తో తమకంటిని ఎందుకు పొడుచుకుంటామంటూ డ్రమటిక్ గా మాట్లాడాడు. వివేకా హత్యజరిగిన నాటినుంచి ఈరోజు వరకు వరుసగా జరిగిన సంఘటనలను గమనిస్తే,ఎవరికన్ను ఎవరి వేలుని పొడిచిందో స్పష్టంగా అర్థమవుతుంది. వివేకాహత్య జరిగినప్పుడు రక్తపు మరకలు ఎవరుతుడిచారో, సాక్ష్యాధారాలు చెరిపేయడానికి వై.ఎస్.అవినాశ్ రెడ్డి ఎందుకు ప్రయత్నించాడో, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి శవంవద్దే ఎందుకుఉన్నారు ముఖ్యమంత్రి గారు?
గొడ్డలిపోట్లకు కట్టుకట్లి శవాన్ని భద్రపరచాల్సిన అవసరం మీకెందుకు వచ్చింది? గుండెపోటుతో చనిపోయాడని ఉదయం చెప్పిన విజయసాయిరెడ్డి ఇతరులు, మధ్యాహ్నం మాటెందుకు మార్చారు. తరువాత హత్యచంద్రబాబు, లోకేశ్ లే చేయించారని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? మనస్సాక్షిలేని సాక్షిలో పుంఖానుపుంఖాలుగా చంద్రబాబుపై నిందలేస్తూ కథనాలు ఎందుకు వండి వార్చారు? ప్రతిపక్షంలోఉన్నప్పుడు సీబీఐ విచారణ కావాలనికోరిన జగన్, అధికారంలోకివచ్చాక హైకోర్ట్ లో వేసిన తనపిటిషన్ ఎందుకు వెనక్కుతీసుకున్నాడు?
తనపాత్ర, తనకుటుంబసభ్యుల పాత్రలేకపోతే, జగన్ సీబీఐ విచారణకుఎందుకు డిమాండ్ చేయలేదు? ముఖ్యమంత్రికాగానే జగన్ సిట్ అధికారిగాఉన్న అడిషనల్ డీఐజీని తప్పించి, ఎస్పీ స్థాయి అధికారిని ఎందుకు నియమించారు? మరలా అదే సిట్ అధికారిని ఎందుకు మార్చారు? అడిషనల్ డీజీ స్థాయి అధికారితో దర్యాప్తు చేయించాలంటూ వివేకాకుమార్తె సునీత హైకోర్ట్ ని ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చింది? ఓట్లకోసం వివేకాహత్యను చంద్రబాబుపైకి నెట్టడానికి ప్రయత్నించింది నిజంకాదా? విచారణతాలూకా వాస్తవాలను బహిర్గతపరచకూడదనిజగన్ న్యాయస్థానాన్నిఆశ్రయించింది నిజంకాదా? ఎందుకు ఆయనఅలాచేశాడు?
వివేకా కుమార్తె సునీత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాకే తనతండ్రిహత్యకేసుదర్యాప్తు నెమ్మదిగా సాగుతుందన్నది నిజంకాదా? జగన్ ప్రభుత్వంలో తనప్రాణాలకు రక్షణలేదని ఆమె డీజీపీనికలిసి, రక్షణకల్పించాలని కోరాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది? ఎవరుకల్పించారు? జగన్మోహన్ రెడ్డికి హత్యతో సంబంధంలేకపోతే ఆమెకు ఎందుకురక్షణ కల్పించలేదు? ఢిల్లీస్థాయిలో ఆమె తనకు న్యాయంచేయాలంటూ అర్థిం చాల్సిన అవసరం ఏమొచ్చింది? సునీత హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ లో వై.ఎస్. అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిల పేర్లు లేవా?
వివేకాహత్యలో ప్రత్యక్షసాక్షి అయిన శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి? వివేకా మృతదేహానికి కట్లుకట్టిన జగన్ భార్య శ్రీమతి భారతి తండ్రి డాక్టర్ గంగిరెడ్డి మృతి కూడా అనుమానాస్పదమే. కరోనాసమయంలో, కరోనాతో మృతిచెందిన ఆయన మృతదేహానికి కట్లు ఎందుకున్నాయి? వివేకా హత్యఅనే రాజకోట రహస్యం తాలూకా వాస్తవాలను హత్యలో పాల్గొన్న దస్తగిరి కళ్లకుకట్టినట్టు సీబీఐకి చెప్పినా ఇంకా తప్పించుకోచూస్తున్నారా?
రూ.40కోట్ల సుపారీ ఇచ్చిమరీ హత్యచేయించగల ఆర్థికస్తోమత జగన్మోహన్ రెడ్డి కటుంబానికి తప్ప ఎవరికిఉంది? అంతస్థాయి, స్తోమత పులివెందులలో ఉన్నది వై.ఎస్.కుటుంబానికి తప్ప ఇంకెవరికైనా ఉంటాయా? 2019లో ఆడినకన్నీటి డ్రామాలనే జగన్ ఇప్పుడు ప్లేచేస్తున్నాడు. అసెంబ్లీ వేదికగా ప్రజల్ని అమాయకుల్నిచేసి నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడు. హత్యలో జగన్ పాత్ర, అవినాశ్ రెడ్డి పాత్ర ఉందికాబట్టే, వారు దర్యాప్తుసహా, అనేక అంశాల్లో అడ్డుపడుతున్నారు.