జిల్లాలో టీడీపీ నిరసనలు రెండో రోజు శనివారం కూడా కొనసాగుతున్నాయి. లాడ్జి సెంటర్, అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ నిరసన ప్రదర్శన చేపట్టింది. వైసీపీ నేతల వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెదకూరపాడులో కూడా టీడీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. చంద్రబాబు కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దాచేపల్లి, పిడుగురాళ్ల లో టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గం లోని రాజుపాలెం లో జరిగిన ఆందోళన మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. అవమానాలకు పట్టుదలగా తీసుకోవాలని సూచించారు. వచ్చేది టిడిపి ప్రభుత్వమేనని ఒక్కో నాకొడుకు సంగతి తేలుస్తామని హెచ్చరించారు. చేబ్రోలు మండలం నారాకోడూరు లో టిడిపి నిరసన ర్యాలీ చేపట్టి ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసారు.
ప్రత్తిపాడు లో టిడిపి నేతలు నోటికి నల్ల రిబ్బన్ లు కట్టుకోని మౌన నిరసన చేపట్టారు. వేమూరు , రేపల్లె లలో టిడిపి శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టి ఎన్టీఆర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు . బాపట్ల టిడిపి ఇన్ చార్జ్ వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో టిడిపి నిరసన ప్రదర్శన చేసింది. ముగ్గురు టిడిపి కార్యకర్తలు గుండులు చేయించుకున్నారు. పెదకూరపాడు నియోజకవర్గం లో టిడిపి నిరసన ప్రదర్శన చేపట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.గుంటూరు నగరంలో టిడిపి భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది.
వైసిపి నేతల వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ గుంటూరు లాడ్జి సెంటర్లో టిడిపి కార్యకర్తలు ధర్నా చేశారు. ధర్నా చేస్తున్న టిడిపి కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
చంద్రబాబు కుటుంబ విషయాల్ని, ఆయన సతీమణిని రాజకీయాల్లోకి లాగటాన్ని ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు.
అంబటి రాంబాబు, కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తులకు వయస్సు పెరిగిందని గాని బుద్ధి పెరగలేదన్నారు.
రాజకీయాల్లో విధాన పరమైన అంశాలపై మాట్లాడాలి గాని ఇంట్లో ఉన్న మహిళలను రాజకీయాల్లోకి తీసుకొచ్చే ముఖ్యమంత్రి ఉండటం బాధాకరమన్నారు. విలువలేని ఆలోచనలతో, మహిళల పట్ల గౌరవం లేకుండా రాజకీయాలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కుసంస్కారానికి ఈ ఘటనలే నిదర్శనమన్నారు. తమ్మినేని క్యారెక్టర్ ఏంటో శ్రీకాకుళం వాళ్లని అడిగితే చెబుతారన్నారు. డిఎన్ఏ టెస్ట్ చేయాలని ద్వారంపూడి మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు. కాకినాడలో గంజాయి స్మగ్లింగ్, దొంగ సరుకు రవాణా వంటి వాటిని వెనుక ద్వారంపూడి హస్తం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆయన డిఎన్ఏ టెస్ట్ చేయాలా అని ప్రశ్నించారు.