-మహిళల ఆర్ధికాభివృద్ధికి ట్రస్టు సరికొత్త ఆలోచనలు
-రాజకీయాలను శాసించే స్థాయికి మహిళలు
-ఎన్టీఆర్ 9 శాతం మహిళలకు రిజర్వేషన్ ఇస్తే, దాన్ని చంద్రబాబు 33 శాతానికి పెంచారు
-రాజమండ్రిలో ఈనెలలోనే బ్లడ్ బ్యాంకు ఏర్పాటు
-కుప్పం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమంలో నారా భువనేశ్వరి
కుప్పం : మహిళలు అన్ని రంగాల్లో, ముఖ్యంగా రాజకీయాలను శాసించే స్థాయికి మహిళలు ఎదిగారు. దీనికి కారణం నందమూరి తారకరామారావు. సమాజంలో సగం ఉన్న మహిళలకు అవకాశాలు ఎందుకు ఇవ్వకూడదు, వారిని ఎందుకు ముందుకు తీసుకెళ్లకూడదు అని ఎన్టీఆర్ ఆలోచించి ఆస్తిలో సగం హక్కును కల్పించారు. తిరుపతిలో మహిళలకు ప్రత్యేక యూనివర్శిటీ ఏర్పాటు చేశారు. రాజకీయాల్లో మహిళలకు అవకాశాలు కల్పించారు.
మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలని, అభివృద్ధి చెందాలని, సమాజంలో గౌరవంగా జీవించాలని చంద్రబాబు ఆలోచించి మహిళలకు అనేక పథకాలను తెచ్చారు. మా ఇంట్లో నా తండ్రి మాత్రమే కాదు చంద్రబాబు కూడా మహిళల గురించి ఆలోచించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ 9 శాతం మహిళలకు రిజర్వేషన్ ఇస్తే, దాన్ని చంద్రబాబు 33 శాతానికి పెంచారు. మహిళలకు 33శాతం ఉద్యోగాల్లో రిజర్వేషన్ కు పెంచారు.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు డ్వాక్రా సంఘాలు ప్రారంభించారు. దీపం పథకం ద్వారా మహిళలు కట్టెల పొయ్యిలపై వంట చేయకుండా గ్యాస్ పొయ్యిలు ఉచితంగా అందించారు. ఈ ప్రభుత్వంలో మహిళలకు సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారు. దళిత మహిళ ప్రతిభా భారతిని దేశ చరిత్రలో మొదటిసారిగా అసెంబ్లీ స్పీకర్ గా చేశారు. పేదల కోసం లక్షలాది ఇళ్లను కట్టించి, వాటని మహిళల పేరుమీద ఇచ్చారు. చేతి పనులు చేసే మహిళల గురించి ఆలోచించి వారికి అవసరమైన పథకాలను తెచ్చారు.
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. 20ఏళ్లుగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు విద్య, బ్లడ్ బ్యాంకుల, హెల్త్ క్యాంపులను ముందుకు తీసుకెళుతున్నాం. విశాఖ, హైదరాబాద్, తిరుపతిలో బ్లడ్ బ్యాంకులు నడుపుతున్నాం. 24 గంటలు ఈ బ్లడ్ బ్యాంకులు తెరిచే ఉంటాయి.రాజమండ్రిలో ఈనెలలోనే బ్లడ్ బ్యాంకు ఏర్పాటుకు పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నాం.
గండిపేటలో ఎన్టీఆర్ స్కూల్, జూనియర్ కాలేజీ, మహిళల డిగ్రీ కాలేజీ నడుపుతున్నాం. దీని ద్వారా వచ్చిన ఆదాయంతో చల్లపల్లిలో పేద పిల్లలకు ఉచిత విద్య అందిస్తున్నాం. చల్లపల్లి స్కూలులో 6,500మంది విద్యార్థులు చదువుకుని బయటకు వెళ్లారు. మహిళలకు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. హెరిటేజ్ సంస్థ బాధ్యతలను చంద్రబాబు నాకు అప్పజెప్పే సమయానికి, నాకు ఏమీ తెలియదు. కానీ అధైర్యపడకుండా పని నేర్చుకుని నేను ముందుకు వెళుతున్నాను.
మహిళలు తలచుకుంటే ఏదైనా సాధిస్తారు..ఈ నమ్మకాన్ని మహిళలు ఎప్పుడూ కోల్పోకూడదు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇతర కార్యక్రమాలు గురించి ఆలోచిస్తున్నాము. కుప్పంలో వినూత్నంగా మహిళలకు ఇంకేమి చేయగలుగుతామో ఆలోచించి మరిన్ని కార్యక్రమాలు చేస్తాం. నిరుద్యోగ యువతకు ఏం చేస్తే వారికి ఉద్యోగం, ఉపాధి అవకాశాలు దొరుకుతాయో ఆలోచించి ముందుకు వెళతాం.
ఎన్టీఆర్ ట్రస్టుకు అనేక మంది దాతలు ఉన్నారు.వారందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎన్టీఆర్ ట్రస్టును ముందుకు తీసుకెళుతున్న ట్రస్టు టీమ్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఏ కష్టం ఉందని కబురుపెట్టినా ఎన్టీఆర్ ట్రస్టు వలంటీర్లు ఎక్కడికైనా వచ్చేస్తున్నారు.వారికి నా కృతజ్ఞతలు. మీడియా మిత్రులకు నా ప్రత్యేక ధన్యవాదాలు.ట్రస్టు చేసే కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి బలంగా తీసుకెళుతున్నారు.
న్యూట్రిఫుల్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాం : ఎన్టీఆర్ ట్రస్టు సీఈఓ రాజేంద్ర కుమార్
స్త్రీ శక్తి, మహిళ సాధికారత కార్యక్రమానికి విచ్చేసిన మహిళలకు నా నమస్కారాలు. ఎన్నికలకు ముందు భువనమ్మ కుప్పం మహిళలకు మహిళా సాధికారతపై శ్రద్ధ పెడతానని హామీ ఇచ్చారు. ఈ మేరకు నన్ను ముందుగానే ఇక్కడికి పంపి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోమన్నారు.
1997లో ఎన్టీఆర్ ట్రస్టును చంద్రబాబు స్థాపించారు. విద్య, ఆరోగ్యం, సాధికారత, విపత్తు నిర్వహణ సాయం, కోవిడ్ కష్ట సమయంలో పలు సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగిస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో భువనమ్మ ఆధ్వర్యంలో 13,124 వైద్య శిబిరాలు ద్వారా2,51,672 మంది పేదలకు వైద్యం అందించాం.
ఏజెన్సీ ఏరియాల్లో గిరిజనుల సంక్షేమం కోసం ట్రస్టు ద్వారా సంజీవని ఆరోగ్య కేంద్రాలతో పాటు ఆరోగ్య రథాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో భాగంగానే చిత్తూరుజిల్లా కుప్పం, గుంటూరుజిల్లా మంగళగిరి, సత్యసాయిజిల్లా హిందూపురంలో ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య రథాలు ప్రారంభించాం. సంజీవని క్లినిక్ ద్వారా నేటికి 1,00,499 కుటుంబాలు లబ్ధి పొందాయి. అదేవిధంగా ఆరోగ్య రథం ద్వారా 49,615 కుటుంబాలు లబ్ధి పొందాయి.
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా హైదరాబాద్, తిరుపతి, విశాఖలో రక్తనిధి కేంద్రాలు నిర్వహిస్తున్నాం. వీటి ద్వారా నేటికి 8,11,000మంది ప్రాణాలను కాపాడగలిగాం. త్వరలోనే రాజమండ్రిలో కూడా రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభించబోతున్నాం. తలాసేమియా అనే వ్యాధితో కొంత మంది పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. వీరికి ప్రతి నెల రక్తం మార్చాలి. 180మంది తలాసేమియా వ్యాధితో ఇబ్బందులు పడే వారికి ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా రక్తాన్ని అందిస్తున్నాం. ఉచితంగా వారికి వైద్య సేవలు అందిస్తున్నాం.
పేద పిల్లలు, అనాధలకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించాలని చల్లపల్లి, హైదరాబాద్ లో స్కూళ్లు నడుపుతున్నాం. కృష్ణాజిల్లా,చల్లపల్లి మండలం, పాగోలులో 400మంది అనాధ పిల్లలు చదువుతున్నారు. వీరికి ఉచిత విద్య అందిస్తున్నాం. ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకు స్టేట్ 3వ ర్యాంకు వచ్చింది. చల్లపల్లి స్కూల్ లో 19308 మందికి ఇప్పటి వరకు ఉచిత విద్య అందించాం, ఇతర కళాశాలలో 1672మందికి ఉచిత విద్యను అందించాం.
4,255 మంది పేద ప్రతిభ కలిగిన విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ద్వారా రూ.3.44కోట్లు అందించాం. 2016 నుండి ఇప్పటి వరకు 275మంది బాలికలకు రూ.2,16,60,000 స్కాలర్ షిప్ ల రూపంలో అందించాం. 7,345 మంది యువతి, యువకులకు ఉచిత నైపుణ్య శిక్షణ ఇచ్చి 2,500పైగా ఉద్యోగాలు కల్పించాం.
నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం రూ.4కోట్లు ఆర్థిక సహాయం అందించాం. మహిళ స్వయం ఉపాధి ద్వారా మహిళలు స్వయంగా ఎదిగేందుకు భువనమ్మ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కుప్పంలో 65మంది ఉచితంగా శిక్షణ తీసుకున్నారు.
ఎన్టీఆర్ ట్రస్టులో శిక్షణ తీసుకున్న మహిళలను ఓ కోపరేటివ్ సొసైటీ లా ఏర్పాటు చేసి, కంపెనీలతో మాట్లాడి, వర్కు ఆర్డర్లు తెచ్చి, జీవన విధానాలు పెంచాలని చూస్తున్నారు. కుప్పంలో నీటి సదుపాయం కోసం ఎన్టీఆర్ సుజల నీటి ప్లాంటులు ఏర్పాటు చేశాం.మరిన్ని రానున్న కాలంలో ఏర్పాటు చేస్తాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 క్లస్టర్ పాయింట్లు, 41 స్వతంత్ర ప్లాంట్లను నెలకొల్పాం.
ఎన్టీఆర్ సుజల ప్లాంట్ల ద్వారా 5లక్షల మందికి సురక్షిత మంచినీరు అందుతోంది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఏపీ, తెలంగాణలో ఇప్పటి వరకు 20లక్షల మందిని ఆదుకున్నాం. 2013లో ఉత్తరాఖండ్ వరదల సమయంలో 510మందికి, పైలాన్ తుఫాను వచ్చినప్పుడు ఏపీలో 17వేల మందికి సాయం అందించడంతో పాటు పునరావాసం కల్పించింది ఎన్టీఆర్ ట్రస్టు.
2014లో హుద్ హుద్ తుఫాను సమయంలో 50వేల మందికి పైగా బాధితులకు మందులు, మజ్జిగ, పాలు, తాగునీరు అందించాం. 2016 సెప్టెంబర్ లో హైదరాబాద్ లో వరదలు వస్తే 10 బస్తీల్లోని 5వేల మందికి సాయం అందించాం. మహబూబ్ నగర్, కర్నూలులో వరదలు సంభవించినప్పుడు 54 వైద్య బృందాలను పంపించి వైద్య శిబిరాలను నిర్వహించి, రూ.15కోట్ల విలువైన బియ్యం, మందులు, వస్త్రాలు, స్కూలు బ్యాగులు, దుప్పట్లను వరద బాధితులకు అందించాం.
కేరళ వరద బాధితుల పిల్లలకు రూ.20లక్షల విలువైన నోట్ పుస్తకాలు, మందులు అందించాం. వరదల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున 48 కుటుంబాలకు రూ.48లక్షలు అందించాం. కోవిడ్, ఇతర విపత్తుల సమయంలో కష్టాల్లో ఉన్న 20వేల కుటుంబాలకు ఆహారం, కూరగాయలు, మందుబిళ్లలు, ఆక్సిజన్ ప్లాంట్లు వగైరా ఇచ్చాం.
కుప్పంలో కరోనా సమయంలో రాష్ట్రంలో కుప్పం, టెక్కలిలో రూ.1.50కోట్లు వ్యయంతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కింది…రాష్ట్రంలో ఎక్కడా ఇలా చేయలేదు. రూ.2లక్షల మాస్కులను రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేశాం. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీసేవారు. రాష్ట్ర ప్రజలకు టెలీ కాన్ఫరెన్స్ పెట్టి, కరోనా పేషెంట్లతో డాక్టర్లు మాట్లాడి, మంచి వైద్య సేవలు అందించేలా అనేక చర్యలు తీసుకున్నారు. ఇంటి వద్దకే పేషెంట్లకు మందులు సరఫరా చేశాం.
న్యూట్రిఫుల్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాం..దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం. న్యూట్రిఫుల్ యాప్ ద్వారా కుప్పంలో కూడా ఆరోగ్యపరమైన సలహాలు, సూచనలు పొందుతున్నారు.రానున్న కాలంలో ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా నారా భువనేశ్వరి గారు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
లబ్ధిదారుల స్పందన:
నందిని, కుట్టు మిషన్ లబ్ధిదారులు:- మా లాంటి వారికి ఇలాంటి శిక్షణ ఇచ్చి, మా కాళ్లపై మేము నిలబడేలా చేసిన భువనమ్మకు ధన్యవాదాలు. ఇది మా కుటుంబానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
భువనమ్మ:- అత్యవసర పరిస్థితుల్లో కుట్టు మిషన్ ను కొంత మంది అమ్ముకుంటున్నారు అని నా దృష్టికి వచ్చింది. దయచేసి ఇకపై ఎవరూ ఇలా అమ్ముకోవద్దు.
ఆదెమ్మ, గుడిపల్లి మండలం:- నేను కూరగాయలు అమ్ముకుంటూ జీవిస్తున్నాను. రోడ్డు ప్రక్కన పరదాలు పరిచి కూరగాయలు అమ్ముకునేదాన్ని. నాకు తోపుడు బండి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ బండిపై పండ్లు, కూరగాయలు, పూలు అమ్ముకుంటాను.
పద్మలత, కుప్పం, టిఫిన్ బండి లబ్ధిదారురాలు:- ప్రస్తుతం చిన్న పాకలో టిఫిన్ సెంటర్ నడుపుకుంటున్నాను. కానీ ఈ బండి ఇవ్వడం ద్వారా వ్యాపారం మంచిగా సాగే ప్రదేశంలో టిఫిన్ సెంటర్ నడుపుకుంటాను. మా కుటుంబానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
కుట్టు మిషన్లు అందుకున్నవారు:
శారద, మౌనిక, హైమావతి, కీర్తన, వెన్నెల, తనూజ, గౌరీదేవి, కావ్య, సత్య, కనకదుర్గ, రాజేశ్వరి, ఎం.శ్రావణి, ఎస్.పుష్ప, కె.వాణి, ఎస్.శిరీష, ఎం.పద్మావతి, టి.పార్వతి, పి.గాయత్రి, ఎస్.రాజేశ్వరి, ఎస్.కోమల, వి.జి.లక్ష్మి, ఎస్.నందిని, ఎం.సరస్వతి, శ్రీనివాసుల రాధాభాయ్, ఎస్.వి.మధు, రమ్య, బి.కె.నవత, వర్షిత.
కూరగాయల బండ్లు అందుకున్నవారు:
సర్దార్, చంద్రమ్మ, జె.ఆర్.మురళి, జమీన్, ధనలక్ష్మి, విజయన్, లక్ష్మమ్మ, రాజేశ్వరి, నారాయణ, పి.కృష్ణమూర్తి, దేవి, డి.పావని, తదితరులు.
టిఫిన్ బండ్లు అందుకున్నవారు: శంషాద్, మోహనమ్మ, శ్యామకుమారి, కిరణ్, గణేష్, శ్రీనివాసులు, సప్తాష్, తదితరులు.
31 కుట్టు మిషన్లు, 11 టిఫిన్ బండ్లు, 15 తోపుడు బండ్లను లబ్ధిదారులకు నారా భువనేశ్వరి అందించారు.
మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే భువనమ్మ లక్ష్యం: ఎమ్మెల్సీ డాక్టర్. కంచర్ల శ్రీకాంత్
కుప్పం మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే భువనమ్మ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించారు. మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు భువనమ్మ సిద్ధంగా ఉన్నారు.
మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా పలు సేవా కార్యక్రమాలను భువనమ్మ చేయబోతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఎవరు కష్టాల్లో ఉన్నా నేనున్నాంటూ ఎన్టీఆర్ ట్రస్టు నుండి భువనమ్మ ఎంతో మందిని ఆదుకున్నారు. రానున్న కాలంలో కుప్పంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు భువనమ్మ అనేక చర్యలు తీసుకోబోతున్నారు.