• ఏలూరు నుంచి బ్లేడ్ బ్యాచ్, సీసాల బ్యాచ్ ను పిలిపించి, వారికి వసతి ఎందుకు కల్పించారో మేకా ప్రతాప్ అప్పారావు చెప్పాలి
• రాయలసీమ, పల్నాడులో లేని విధంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో అడుగడుగునా లోకేశ్ ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు
• యువగళం పాదయాత్రతో వైసీపీనేతల ప్యాంట్లు తడుస్తున్నాయి : ముద్దరబోయిన
• ఏలూరు నుంచి కిరాయిరౌడీలను తీసుకొచ్చి పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు, స్థానిక డీఎస్పీ : మాగంటి బాబు
• యువగళం పాదయాత్ర ప్రదేశం (నూజివీడు) లో టీడీపీ నేతలు నూజివీడు టీడీపీ ఇన్ ఛార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ మాగంటి బాబు, స్థానిక టీడీపీ నేత పాకా శ్రీను
రౌడీషీటర్ల ఒత్తిడితో టీడీపీ నేతల ఫిర్యాదు స్వీకరించడానికి పోలీసులు నిరాకరించారు : ముద్దరబోయిన వెంకటేశ్వరరావు
“యువగళం పాదయాత్రలో ఆటంకాలు సృష్టించాలన్న ఉద్దేశంతోనే నూజివీడులో లోకేశ్ ప్రజల్లోకి వచ్చినప్పుడు వైసీపీ కార్యకర్తలు పార్టీ జెండాలు, ఇనుప రాడ్లు, రాళ్లతో శుక్రవారం కవ్వింపు చర్యలకు దిగారు. టీడీపీ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. జరిగిన ఘటనపై ఫిర్యాదు చేయ డానికి మేం స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్తే, అక్కడ రౌడీషీటర్లైన నాని, కాసులు అనే ఇద్దరు మా ఎదుట వీరంగం వేశారు.
టీడీపీవారిపై కేసులు పెట్టాల్సిందేనని పోలీసుల్ని ఒత్తిడి చేశారు. నూజివీడు రూరల్ పోలీస్ స్టేష న్లో స్థానిక ఎస్సై తాముఇచ్చిన ఫిర్యాదు తీసుకొని, ఎక్ నాలెడ్జ్ మెంట్ ఇవ్వలేదు. దానిపై తాము గట్టిగా నిరసన వ్యక్తం చేయడంతో స్థానిక సీఐ వచ్చి సర్దిచెప్పి, ఎక్ నాలెడ్జ్ మెంట్ ఇచ్చారు. ఎఫ్.ఐ.ఆర్ కట్టారో లేదో తెలియదు. పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూస్తూనే ఉన్నాం.
గతంలో టీడీపీప్రభుత్వంలోజగన్మోహన్ రెడ్డి ప్రశాంతంగా తన పాదయాత్ర కొనసాగించాడు. కానీ ఇప్పుడు లోకేశ్ ను అడుగడుగునా అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారో సమాధానం చెప్పాలి. యువగళం యాత్ర ధాటికి వైసీపీనేతల ప్యాంట్లు తడుస్తున్నాయని అర్థమైంది. వైసీపీనేతలు లోకేశ్ ను, యువగళం యాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే తగిన విధం గా గుణపాఠం చెబుతాం.
నూజివీడు ప్రజల గడ్డ
లోకేశ్ పాదయాత్ర 2,600కిలోమీటర్లకు చేరింది. 196 రోజులనుంచీ ఆయ న జనంలో ఉన్నారు. రాయలసీమలో కూడా లేని విధంగా కృష్ణా జిల్లాలో వైసీపీ మూకలు కావాలనే లోకేశ్ కు అడ్డు తగులుతున్నాయి. నూజివీడు ఎమ్మెల్యేకి మైండ్ చెడిందని అర్థమైంది. లోకేశ్ పాదయాత్రలో వెయ్యి మంది కూడా లేరని వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. నూజివీడు ఆయన గడ్డో… మా గడ్డో కాదు, ఇది ప్రజల గడ్డ. నూజివీడు ప్రజలంతా వైసీపీని జిల్లాలో లేకుండా తరిమేయడానికి సిద్ధంగా ఉన్నారు. ”
వైసీపీ ఎమ్మెల్యే మేకా కిరాయి గూండాలతో యువగళం యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశాడు: మాగంటి బాబు
“ కుప్పంలో మొదలైన యువగళం పాదయాత్ర రాయలసీమ, పల్నాడు మీదుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. ఇప్పటివరకు చాలా శాంతియుతంగా జరిగింది. శుక్రవారం నూజివీడులో జరిగిన గొడవకూడా వైసీపీవాళ్లు కావాలని చేసిందే. వాళ్ల ఉనికికోసం వాళ్లే టీడీపీవారిని కవ్పిం చారు. జరిగిందంతా తెలిసి కూడా నూజివీడు వైసీపీ ఎమ్మెల్యే టీడీపీవాళ్ల ను నిందించడం సిగ్గుచేటు.
పాదయాత్రను అడ్డుకోవడానికి ఏలూరు నుంచి బ్లేడ్ బ్యాచ్, సీసాల బ్యాచ్ ను తీసుకొచ్చారు
నేను పాదయాత్రలో ఉన్నాను. ఏలూరులో ఉండే బ్లేడ్ బ్యాచ్, సీసాల బ్యాచ్ ను పాదయాత్రలోకి ఎవరు తీసుకొచ్చారో, ఎందుకు తీసుకొచ్చారో ఎమ్మెల్యే మేకా అప్పారావు సమాధానం చెప్పాలి. ఏలూరునుంచి 50మంది వరకు కిరాయి గూండాలను తీసుకొచ్చి, ఎమ్మెల్యేకు చెందిన పాతబిల్డింగ్ పైనో, ఎక్కడో లాడ్జీలోనో పెట్టారని మాకు చెప్పారు.
నేను ఏలూరుకు ఫోన్ చేస్తే, అక్కడివారే మాకు సమాచారం ఇచ్చారు. ఆ బ్యాచ్ ను ఎవరు తీసుకొచ్చా రు? మా మీద అభాండాలు వేయడానికే ఎమ్మెల్యే ఇష్టమొచ్చినట్టు మాట్లా డుతున్నాడు. లోకేశ్ పాదయాత్రలో జనం లేరంటున్న వైసీపీఎమ్మెల్యే జగన్ సభల్లో ఎంతమంది ఉంటున్నారో చెప్పాలి. ముఖ్యమంత్రి సభలకు వచ్చేవారంతా స్వచ్ఛందంగా..అభిమానంతో వస్తున్నారా? కిరాయి ఇచ్చి, బస్సుల్లో జనాల్ని తరలిస్తున్నది నిజం కాదా?
రౌడీయిజం వైసీపీ చేస్తూ టీడీపీని అంటోంది
జగన్ రెడ్డి హాయాంలో అరాచకం.. రౌడీయిజం..గూండాయిజం.. గంజాయి జమే. టీడీపీప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వీళ్ల సంగతి తేలుస్తాం. బూతుల మంత్రులు, బూతులు మాట్లాడే ఎమ్మెల్యేలు, అందరి దీ ఒకటే లక్ష్యం. చంద్రబాబు, లోకేశ్ లను దూషించడం.. టీడీపీపై దుష్ప్రచారం చేయడం. గన్నవరం టీడీపీ కార్యాలయం తగలబెట్టారు. టీడీపీ నేత పట్టాభి ఇంటిపైకి దాడికి వెళ్లారు. టీడీపీ జాతీయ కార్యాలయం పైనే దాడిచేశారు. ఇదంతా ఏమిటి..రౌడీయిజం కాదా? మీరు రౌడీయిజం చేస్తూ, సిగ్గులేకుండా మమ్మల్ని అంటున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే చిల్లర వేషాలేస్తాడని ముందే ఊహించాం
మేకా ప్రతాప్ అప్పారావు ఇలాంటి చిల్లర వేషాలేస్తాడని మేం ఊహించాం. అందుకే మా జాగ్రత్తలో మేం ఉన్నాం. లోకేశ్ పాదయాత్ర ఇంకా ఉంది. ఎక్కడైనా ఏదైనా జరిగితే ఢీ అంటే ఢీ అనడానికి సిద్ధంగానే ఉన్నాం. పోలీసులు కట్టడి చేస్తారని సంయమనంతో వ్యవహరిస్తున్నాం. లోకేశ్ పాదయాత్రలో ఎక్కడా ఎలాంటి అపశ్రుతులు లేవు. ఏదో ఒకటిచేసి, అలజడి సృష్టించి, అరాచకం చేసి, పాదయాత్రను అడ్డుకోవాలన్న కుట్రతోనే ఏలూరు నుంచి కిరాయి గూండాలను తీసుకొచ్చారు.
యువగళం యాత్రకు రక్షణ ఇవ్వని పోలీసులు.. వైసీపీ జెండాలు, బ్యానర్లకు రక్షణగా నిలబడ్డారు
రౌడీషీటర్లు పాదయాత్రను భగ్నం చేయడానికి ప్రయత్నిస్తే, పోలీసులు ఏం చేస్తున్నారు? గౌరవమైన స్థానాల్లో ఉండి ఒక వైపే కొమ్ముకాయడం పోలీస్ వ్యవస్థకు మాయనిమచ్చ. పోలీసులు వైసీపీమూకలపై లాఠీఛార్జ్ చేసుంటే, శుక్రవారం యువగళం యాత్రలో ఏమీ జరిగేది కాదు. లోకేశ్ పాదయాత్రలో నలుగురు పోలీసులు కనిపించరు. వైసీపీ జెండాలు, బ్యానర్ల కు మాత్రం కాపలాగా వందలమంది ఉన్నారు. జాతీయ జెండాకు కూడా అంతగా రక్షణ ఇవ్వరేమో?
ధర్మం ప్రకారం పనిచేయమంటే దానికే మాపై తప్పుడు కేసులు పెడతారా? ఇక్కడి డీఎస్పీ వైసీపీకోసం రెచ్చిపోయి పనిచేస్తున్నాడు. చంద్రబాబు గారి కాన్వాయ్ ను లారీలు అడ్డుపెట్టి అడ్డుకున్నారు. యువ గళం యాత్రకు అడ్డంకులు సృష్టించారు. పద్ధతి మార్చుకోమని హెచ్చరి స్తున్నాం. టీడీపీ ప్రభుత్వం రాగానే వైసీపీనేతలు దోచుకున్నదంతా కక్కి స్తాం. ”
కర్రలు, రాళ్లతో, వైసీపీజెండాలు పట్టుకొని యువగళం యాత్రలోకి వైసీపీ మూకలు చొచ్చుకువస్తే పోలీసులు చూస్తూ ఉండిపోయారు : పాకా శ్రీను (స్థానిక టీడీపీనేత)
“తుట్లూరులో శుక్రవారం జరిగిన ఘటన ముమ్మాటికీ వైసీపీ పథక రచనే. యువగళం పాదయాత్రపైకి రౌడీలతో, వైసీపీజెండాలతో కావాలనే చొరబడ్డా రు. జరిగిన దాన్ని పోలీసులు, మీడియా వాళ్లు, ప్రజలు చూశారు. టీడీపీ పాదయాత్రలోకి మీకేం పని అని వైసీపీవాళ్లను పోలీసులు ప్రశ్నించలేదు. రాళ్లు, జెండాలు, కర్రలతో దాడికి యత్నిస్తుంటే ఏమీ పట్టనట్టే వ్యవహరించారు. రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డి, షర్మిల పాదయాత్రలు జరిగినప్పుడు టీడీపీ వాళ్లు ఎప్పుడూ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడలేదు. ”