Suryaa.co.in

Features

ప్రజల మనోభావాలు తాకట్టు పెట్టు …అది పదవిని తెచ్చిపెట్టు

నూజివీడు చరిత్ర కనుమరుగై పోయింది …. నూజివీడు అభివృద్ధి కలగా మిగిలిపోయింది….. నోరు విప్పి చెప్పలేని ప్రజా ప్రతినిధులు , జరిగేది నష్టమే అని తెలిసినా సమర్ధించుకునే క్రమంలో సిగ్గు వదిలేసి మాట్లాడే మహానుభావులు ,వంతపాడే వందిమాగధులు , ఇలాంటి మనందరి పుణ్యమా అని నూజివీడు చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది…..పంచాయితీ స్థాయిలో పక్కగా ఉన్న మైలవరం విజయవాడ లో కలిసింది ,రాష్ట్ర రాజధానికి అనుసంధానంగా, ఒకప్పటి CRDA లో ,విజయవాడకి దగ్గరలోని నెక్కలం తో కలిసి ఉన్న,,మున్సిపల్ స్థాయి నూజివీడు విజయవాడలో కలవలేక పోయింది…..

నూజివీడు నుండి అటు వెళితే, ఏలూరు జిల్లా కేంద్రానికి ,నూజివీడు 35 కిలోమీటర్లు మాత్రమె కదా ,అని బొంకే వారికి, ఇంకో 5 కిలోమీటర్లు ఇటు వైపుకు వెళితే విజయవాడ , మన రాష్ట్ర రాజధాని 40 కిలోమీటర్లకే వస్తుందని తెలియదా……. కనీసం ప్రజలకు ఏది ఉపయోగమో , ఏది ఎందుకు అడుగుతున్నారో కూడా ఆలోచించలేని స్థితిలో వున్నారా,, లేక అదే జరగాలి అనుకున్నారా….. ఒక ప్రాంతం అభివృద్ది చెందాలి అంటే,, ఏ ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలో ,ఎలాంటి వనరులు సృష్టించుకోవాలో కూడా తెలియని స్థాయిలో వున్నారా,, లేక ఇలా జరిగితేనే మన హవా సాగుతుంది అని భావించారా…… వీటికోసం మాత్రం సవాళ్ళు విసరలేరా …… ఇన్ పుట్ ,అవుట్ పుట్ సిద్ధాంతంతో,పైకి కనిపించేట్టుగా మాత్రం, పైన చేతిలో పండును పెట్టి ,, తెలియకుండా కిందనుండి రసాన్ని పిండుతూ పిప్పితో సహా లాగేసే విధానానికి శంఖుస్థాపన చేసి,,ఆ సంక్షేమ పథకాలను గొప్పగా చెప్పుకోవడం తప్ప ప్రజలకు ఏమన్నా ఒరిగిందా….. ప్రజలకు భవిష్యత్తు మీద భరోసా ఏమన్నా కలిగిందా…….

(1) మనం విద్యార్థి ఉద్యమాలలో పనిచేసి ఉంటే,,విద్యార్థుల సమస్యలు తెలిసేవి , ఊరు అభివృద్ది చెందితే విద్యాసంస్థలు పెరిగితే ,విద్యార్థికి శ్రమ,, తల్లిదండ్రులకు భారం తగ్గుద్దని తెలిసేది, వారి భవిష్యత్తు గురించి కూడా ఆలోచించేవాళ్ళం….. లేదా (2) మనం యువజనసంఘం లో పనిచేసి ఉంటే యువతకు ఉపాధి అవకాశాలు గురించి ఆలోచించేవాళ్ళం…..(3) పోనీ కార్మికరంగం లో పనిచేసి ఉంటే కార్మికుల, కాంట్రాక్టు ఉద్యోగుల అవసరాలు ఏంటో,,చాలీచాలని జీతాలతో ఏలా బతకాలో తెలుసుకునేవాళ్ళం.. (4) పోనీ ఒక్క గంట పొలంలో వంగి పని చేసివుంటే,, ఆ పనిలో రైతు కష్టాలు ఏంటో , భూమి రేట్లు పడిపోతే ఆ భూమి విలువ ఏంటో తెలుసుకునేవాళ్ళం…(5) ఇవేమీ కాకున్నా, కనీసం మధ్య,, దిగువ మధ్యతరగతి వాళ్ళం అయితే కష్టసుఖాలు అనుభవించేవాళ్ళం……. ఇవన్నీ అర్దం అయితే మన ప్రాంతాన్ని ఎలా అభివృధ్ధి చెయ్యాలి, ఉపాధి,వనరులు ఎలా సమకూర్చుకోవాలి, వాటి అవసరం ఏమిటి అని ఆలోచించేవాళ్ళం ,….. ఏ కష్టం తెలియకుండా చట్టసభల్లో శాసనాలను చెయ్యమంటే ,పర్యవసానం ఇలానే ఉంటుంది……

ప్రశ్నించలేని,,అవగాహన లేని వారిని ప్రజాప్రతినిధులుగా చట్టసభలకు పంపిస్తే జరిగేది ఇదే….. చట్టసభలలో ఒకప్పుడు కార్మికుల కోసం, ప్రజల హక్కుల కోసం చట్టాలు చేసిన చరిత్ర ఉండేది.,,, ఇప్పుడు ఆ చట్టాలను రద్దు చేసి ప్రజల హక్కులను మనం కాలరాస్తున్న వైనాన్ని,, భవిష్యత్తులో మన పిల్లలు చదువుకోబోయే చరిత్రగా అవుతుంది…..

అనేక చోట్ల ఒకప్పుడు,,ముఖ్యంగా తెలంగాణలో ,ప్రజలను బానిస విముక్తులను చేయడం కోసం పలు రకాల సిద్ధాంతాలతో కొందరు త్యాగాలు చేసి ఎందరికో బానిసవిముక్తి కలిగిస్తే, మళ్లీ మాకు అదే వ్యవస్థ కావాలని,, ఇప్పుడు మళ్లీ ప్రజలు కోరుకుంటూవుంటే , రాబోయే తరం మనల్ని క్షమించరు ….., ఒసేయ్ రాములమ్మ లాంటి సినిమాలు తీసి ప్రజలకు ఏదో చెప్పాలి అనుకోవడం , అనుకునే వాళ్ళ తప్పే….
ఉద్యమాలు చేస్తూంటే,, చేసే వారిని కమ్యూనిస్టులతో కలిసి మాట్లాడుతున్నారు , ఇంకా వాళ్లు ఎక్కడున్నారు,, అంటూ , అనుకుంటే పొరపాటే…ప్రశ్నించే ప్రతివాడు కమ్యూనిస్టే … అలాంటి వారికి వేదిక సిద్ధాంతపరమైన కమ్యూనిస్టు పార్టీలు…

ఇన్ని, టియంసిల నీటికి మాత్రమె నిల్వ సామర్థ్యం తో ప్రాజెక్టులు నిర్మిస్తారు…. ఆ స్థాయిని దాటి ఎక్కువకాలం నిల్వ ఉంచితే ఆ ప్రాజెక్టు బద్దలు కాక మానదు…… అణచివేత కూడా అంతే…….ప్రశ్నించే వారందరూ ఒకే వేదిక మీదకు వచ్చిన రోజున కొందరు నాయకుల ప్రాజెక్టులు బద్దలు కాక ఆగవు.

– ఇందుపల్లి సత్యప్రకాష్ (న్యాయవాది)
– బత్తుల వెంకటేశ్వరరావు ( సి పి ఐ నూజివీడు నియోజకవర్గ కార్యదర్శి)

LEAVE A RESPONSE